వ్య‌తిరేక‌త పెర‌గ‌ని నేత మోడీ మాత్ర‌మేనా!

ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. త‌న జీవిత కాలానికీ ప్ర‌ధానిగా మోడీ ఆల్మోస్ట్ ప్ర‌జ‌ల చేత ఆమోద‌ముద్ర వేసుకున్నాడ‌న్న‌ట్టుగానే క‌నిపిస్తోంది ప‌రిస్థితి!

2014లో న‌రేంద్ర‌మోడీ ప్ర‌ధాన‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఆ త‌ర్వాత దేశంలో రాజ‌కీయం చాలా మారిపోయింది. ఆ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌గ్గాలు ద‌క్కించుకున్న అనేక మంది రాష్ట్ర స్థాయి నేత‌లు, జాతీయ నేత‌లు కూడా తెర‌మ‌రుగు అయ్యారు. అయితే ప్ర‌ధాని హోదాలో మోడీ హ‌వా మాత్రం దాదాపుగా పుష్క‌ర కాలానికి ద‌గ్గ‌ర ప‌డింది. 2014 ఎన్నిక‌ల్లో మంచి మెజారిటీతోనే ఎన్డీయే కూట‌మి అంచ‌నాల‌కు మించి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. అప్పుడే బీజేపీకి దాదాపు సొంత మెజారిటీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం వ‌చ్చినా, కూట‌మిగానే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. మ‌రి ఐదేళ్ల త‌ర్వాత మోడీపై వ్య‌తిరేక‌త ఉంటుంద‌ని చాలా మంది అనుకున్నారు.

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో అర‌చేతిలో స్వ‌ర్గాన్ని చూపిన మోడీ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు రియాలిటీ అర్థం అయ్యింద‌ని, దీంతో 2019 ఎన్నిక‌ల్లో మోడీకి ఎదురుదెబ్బే అనే విశ్లేష‌ణ‌లు వినిపించాయి. అలా అంచ‌నాలు గట్టిన వారిలో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుతో స‌హా అనేక మంది ఉన్నారు. అందుకే ఆ స‌మ‌యంలో బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుని కాంగ్రెస్ తో జ‌ట్టు క‌ట్టారు చంద్ర‌బాబు నాయుడు. అప్పుడు మోడీపై చంద్ర‌బాబు కూడా బోలెడు విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. సాధార‌ణంగా గెలిచే కూట‌మితో జ‌ట్టుక‌డ‌తారు అనేది చంద్ర‌బాబుకు పేరు. అలాంటి రాజ‌కీయ చాణ‌క్యుడు అనే అంచ‌నాలున్న చంద్ర‌బాబు కూడా మోడీ క‌థ అప్పుడే అయిపోయింద‌ని అనుకున్న‌ట్టున్నారు. అయితే 2014తో పోలిస్తే మోడీ నాయ‌క‌త్వంలో బీజేపీకి 2019లో ద‌క్కిన ఎంపీ సీట్ల సంఖ్య చాలా ఎక్కువ‌!

సాధార‌ణంగా ఐదేళ్ల పాల‌న త‌ర్వాత వ్య‌తిరేక‌త‌తో ఎన్నో కొన్ని సీట్లు పోతాయి ఏ పార్టీకి అయినా. ఎంత బాగా పాలించిన వారికి కూడా అలాంటి వ్య‌తిరేక‌త త‌ప్ప‌దు. అయితే మోడీకి తొలి ఐదేళ్ల పాల‌న త‌ర్వాత చాలా సీట్లు పెరిగాయి. అక్క‌డ‌కూ త‌మ‌కు అధికారం ఇస్తే అద్భుతాలు జ‌రిగిపోతాయ‌ని మోడీ చెప్పిందేదీ ఆ ఐదేళ్ల‌లో జ‌ర‌గ‌లేదు. పైపెచ్చూ నోట్ల ర‌ద్దు వంటి నిర్ణ‌యాల వ‌ల్ల సామాన్యులు తీవ్ర ఇక్క‌ట్ల పాల‌య్యారు. అయితే అవేమీ మోడీకి కాసిన్ని సీట్ల‌ను కూడా త‌గ్గించ‌నీయ‌లేదు. సీట్ల సంఖ్య మ‌రింత పెరిగింది. అదేమంటే.. నాటి ఎన్నిక‌ల ముందు స‌రిహ‌ద్దుల్లో చోటు చేసుకున్న ప‌రిణామాలు మోడీ ఇమేజ్ ను పెంచి సీట్ల సంఖ్య పెరిగేలా చేసింద‌నే విశ్లేష‌ణ వినిపించింది.

అయితే అలాంటి ఎమోష‌న్లతో రాజ‌కీయ ల‌బ్ధి క‌లుగుతుందా అనేది ప్ర‌శ్నార్థ‌క‌మే! అయితే బీజేపీ రాజ‌కీయం అంతా మ‌తం, జాతీయ వాదం అనే ఎమోష‌న్ల‌తోనే సాగుతోంద‌నే విశ్లేష‌ణ మొద‌టి నుంచి ఉంది. అయితే కేవ‌లం ఎమోష‌నే అయితే.. మ‌రీ ఇంత కాలం రాజ‌కీయ మ‌నుగ‌డ సాధ్య‌మా, అలాంటి విజ‌యాలు సాధ్య‌మా అనేవి మ‌రింత లోతుగా విశ్లేషించాల్సిన అంశాలే!

మోడీ ప్ర‌ధాన‌మంత్రి అయ్యాకా.. కేంద్రం నుంచి చెప్పుకోద‌గిన సంక్షేమ ప‌థ‌కాలు లేవు. ఇంకా చెప్పాలంటే లెక్క‌లేనన్ని స‌బ్సిడీలు ఎత్తేశారు! అలాగే సామాన్యుల‌కు ఉప‌యోగ‌ప‌డే పెద్ద స్కీమ్ ఏదీ ప్రారంభించ‌లేదు. కాంగ్రెస్ హ‌యాంలో మొద‌లుపెట్టిన ఉపాధి హామీ ప‌థ‌కం వంటివి దేశానికి చాలా ఉప‌యోప‌డ్డాయి. దేశం అంటే.. ప్ర‌జ‌ల‌కు చాలా ఉప‌యోగ‌ప‌డ్డాయి. అలాంటి వాటిని కొన‌సాగించ‌డం త‌ప్ప మోడీ కూడా వాటిని క‌ట్టిపెట్ట‌లేని స్థితిలో ఉన్నారంటే అదెలాంటి ప‌థ‌క‌మో చెప్పొచ్చు.

ఇంకా కాంగ్రెస్ వాళ్లు స‌మాచార హ‌క్కు చ‌ట్టం తెచ్చారు, అయితే ఇప్పుడు ఆ ప‌థ‌కం పేరు కూడా పెద్ద వినిపించ‌దు. పాల‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త‌కు స‌మాచార హ‌క్కు చ‌ట్టం గ‌ట్టి బీజాలు వేసింది. త‌మ‌ది నిజాయితీ గ‌ల పార్టీ అని చెప్పుకునే కాషాయ పార్టీ వాళ్లు తెచ్చిన చ‌ట్టం కాదు అది, కాంగ్రెస్ వాళ్లు తెచ్చిన ప‌థ‌కం!

మ‌రి ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాలు పెట్ట‌క‌పోయినా, నోట్ల ర‌ద్దు వంటి రాత్రికి రాత్రి నిర్ణ‌యాలు విక‌టించినా, జీఎస్టీతో బాదుడు మ‌రింత‌గా పెరిగినా, గ‌త ప‌దేళ్ల‌లో డాల‌ర్ తో రూపాయి మార‌కం విలువ ఎంత‌కంత‌కూ ప‌డిపోతూనే ఉన్నా, మోడీ ప‌గ్గాలు చేప‌ట్టేనాటితో పోలిస్తే ఇప్పుడు రూపాయి మార‌కం విలువ అత్యంత హీన స్థితిలో ఉన్నా, ద్ర‌వ్యోల్బ‌ణం య‌ధేచ్ఛ‌గా పెరిగిపోతూ.. జీవన వ్య‌యం ఏ రోజుకారోజు పెరిగిపోతూ ఉన్నా, పెట్రో ధ‌ర‌లు సంపాద‌న మార్గంగా మార్చుకున్నా, నిత్య‌వ‌స‌ర‌ధ‌ర‌ల‌పై నియంత్రణ లేక‌పోయినా, రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌ల ప్ర‌య‌త్నాలు లేక‌పోయినా.. ఎక్క‌డిక్క‌డ టోల్ గేట్లు బిగిస్తూ.. జాతీయ ర‌హ‌దారులు అంటే టోల్ సొమ్ముల‌తో వేసేవి అని నిర్వ‌చ‌నాలు ఇస్తున్నా..
పుష్క‌ర‌కాలం కావొస్తున్నా.. మ‌నుషుల జీవ‌న ప్ర‌మాణాల్లో అద్భుత మార్పులు ఏమీ తీసుకురాక‌పోయినా.. ఎంచ‌క్కా ప్ర‌ధాని ప‌ద‌విలో ఉంటూ ఇసుమంత వ్య‌తిరేక‌త‌ను కూడా సంపాదించుకోని నేత మోడీనే కాబోలు!

2024 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో మోడీ నాయ‌క‌త్వంలోని కొన్ని ఎంపీ సీట్లు త‌గ్గినా.. ఆ త‌ర్వాత మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ విజ‌యం సాధించిన తీరును చూసినా, ఢిల్లీలో ఆప్ తుడిచిపెట్టుకుపోయి బీజేపీ అక్క‌డ కూడా పాగా వేస్తుంద‌నే అంచ‌నాల నేపథ్యంలో చూస్తే.. రాజ‌కీయంగా ఇప్పుడ‌ప్పుడే మోడీకి వ‌చ్చిన ఇబ్బంది ఏమీ లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే బీజేపీ అలా వ‌ర‌స విజ‌యాలు సాధించుకుంటూ పోతే.. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ మ‌రింత ప్ర‌బ‌ల‌మైన ప్ర‌భావాన్ని చూపే అవ‌కాశాలు ఉన్న‌ట్టే!

ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. త‌న జీవిత కాలానికీ ప్ర‌ధానిగా మోడీ ఆల్మోస్ట్ ప్ర‌జ‌ల చేత ఆమోద‌ముద్ర వేసుకున్నాడ‌న్న‌ట్టుగానే క‌నిపిస్తోంది ప‌రిస్థితి! జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌డ్డాయా, అభివృద్ధి ఏమిటి, ధ‌నికులే సంపాదించుకోవ‌చ్చు త‌ప్ప డ‌బ్బు లేని వాడు ఇండియాలో డ‌బ్బు సంపాదించ‌డం క‌లే అన్న‌ట్టుగా వ్య‌వ‌స్థ అంత‌కంత‌కూ మారిపోతున్నా.. మోడీ విధానాలు ఇలాంటి ప‌రిస్థితిని మార్చ‌లేక‌పోతున్నా.. ప్ర‌ధానిగా ఆయ‌న ప‌ద‌వికి అయితే ఎలాంటి ఢోకా లేన‌ట్టుగా ఉంది!

41 Replies to “వ్య‌తిరేక‌త పెర‌గ‌ని నేత మోడీ మాత్ర‌మేనా!”

  1. ఎన్ని ఈనోలు వేసినా తగ్గని ప్రభావం ఈ ఆర్టికల్ లో స్పష్టంగా కన్పిస్తూ ఉంది🤣🤣🤣

  2. There is heavy problem for getting labour in our society in recent times but still media& intellectuals talking about poor, rich, labour exploitation etc…

  3. ఏమోరా. ఇందులో నీ కుళ్ళు, కడుపు మంట స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోపలికి eno తాగి బయట burnol పూసుకో.

    1. Nee comment chuste kevalam sankshema pathakau Ane musugulo sommulani appananaga panchutu deshanni gulla cheyadame development anukuntu kulala madhya chicchu rajestu deshanni ravanakastam la eppudu ragilela chese hastam abhimanila unnavu

      1. nuvvundi baavilanti ap lono leka th lono.. delhilo em chesaado delhi vallaku telustadi.. and morover development cheyaniyalunda LT ni addi pettukuni torture chuinchadam alavaate veellaku.. so janaalu sare okasari ee edava lake ichichuddaam ani ichintaaru

        1. మరి LG అడ్డు పడుతుంటే పదేళ్లు ఏం పీకి కట్టలు కట్టినట్టు. జనాలు 2014 లొ కూడా ఈ ఎదవకి ఇచ్చి చూద్దాం అనే వేసారా ఓట్లు.

          1. Orey neeku delhilo em jargutundo tokka kuda teledu.. baavilo kappavani chepaaga.. Yes 2014 lo chance ichi chuddaamane ichindi.. and he proved it as well.. andke 2020 lo kuda he won it with 62 seats out of 70 seats

  4. మంచో చెడో వాళ్ళ ప్రాధాన్యత దేనికో అది చెప్పే అధికారంలోకి వస్తున్నారు…… సిక్స్ అనో సెవెన్ అనో తాము చేయనివి చెప్పటం లేదు…… అలాగే ఓట్ల కోసం దర్గాలకి వెళ్లి టోపీలు పెట్టుకోవటం లేదు, చర్చిలకి వెళ్లి సిలువ వేసుకోవటం లేదు

  5. చీ నీ బతుకు.. ఎప్పుడూ అదే కుళ్ళు కుతంత్రాలు తోనేనా జాతీయవాదం, దేశభక్తి అసలే అవసరం లేదా నీకు…

  6. 2004-2014 Congress government lo bomb blasts mumbai, delhi, pune, Dilsukhnagar, Kashmir, Lumbini park, gokul chat, etc etc etc.. lekke ledu.

    2014-2024 pulwama lanti okati rendu sarlu tappithe peddaga no terrorist attacks..

    Idokka vishayam chalada deshaniki BJP kavalo, Congress kavalo nirnainchadaniki..

  7. ఒక్కసారి మీ ఇంట్లో మీ పేరెంట్స్ కి చేతి సాయంగా పనివ్వాళ్ల కోసం అడిగి చూడూ,

    నెలకి 10 వేలు ఇస్తాను అని కూడా అను.

    ఎంత మంది నువ్వు అంటున్న్ “పేదలు” పని చేయడానికి రెడీగా వున్నారో తెలుస్స్టింది.

  8. ఎంత చేసినా ఎం చేసినా వ్యతిరేకత ని తప్పించుకోవటం కష్ట సాధ్యం. అయితే సరైన opposition ఫేస్ లేక పోవడం కలిసొచ్చున విషయం.

  9. నీ పీత బుర్రకు ఇంత పెద్ద విషయాలు అవసరమా ?

    GST తో జనాన్ని బాదారా ? GST రాకముందు సేల్స్ టాక్స్, వాట్ వగైరాలతో జనాన్ని బాదలేదా ? GST ఇప్ప్పుడు పాతబాదుడు కన్నా తక్కువ కాదా ?

    కోవిద్ దెబ్బకూ యుద్దాల దెబ్బకూ ప్రపంచం అంతా అతలాకుతలం అవుతుంటే, ఈదేశ ద్రవ్యోల్బణంను ఆ దేశాల ద్రవ్యోల్బణంతో పోల్చి కదా చెప్పాల్సింది.

    గతం కంటే ఇప్పుడు దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగాయి. అప్పుడు డాలర్ విలువ పెరిగితే లాభమా నష్టమా ?

    మోడీ హయాంలో దేశాఅర్ధికస్థితి అయిదవస్థానానికి చేరింది. ఫోరెక్స్ 700+ బిల్లియన్ డాలర్లకు చేరింది. కోవిడ్ వాక్సిన్ ప్రపంచం అంతా పంచాము.

    ఉగ్రవాదుల పీచమణచారు. స్కాములు తగ్గాయి. స్కాములు కేవలం ప్రతిపక్షప్రవ్హుత్వాలకే పరిమితం అయ్యాయి. దాన్నేమంటారు ?

    ఇంకా చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది

    మోడీ ఏమీ చేయకపోతే, దేశంలో ఏ మూలకు వెళ్ళినా చివరికి ఈశాన్యరాష్ట్రాలకు వెళ్ళినా జనం ఎందుకు తండోపతండాలుగా వస్తున్నారు.

    నీకున్న చీమతలకాయంత బుర్రతో ఇంత పెద్ద విషయాలు చర్చ అవసరమా ?

    1. Hinduism
    2. Silent Dictatorship
    3. lack of proper opposition
    4. Media control
    5. wiping emerging opposition and leaders by using central services and false cases
    6. Efficiency in controlling at booth level

    Unless youngsters realise and educate themselves, No one can defeat current central Government. Unless they are out of power, no scam comes into light and there is no chance that youngsters realise and educate

Comments are closed.