విపక్ష నేత పాత్రలో బొత్సకు ఎన్ని మార్కులు?

తన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కొత్త పాత్రలోకి మారారు. ఆయన వైసీపీ మంత్రిగా ఓటమి చెందినా ఆ వెంటనే శాసనమండలి ఎమ్మెల్సీగా నెగ్గడం, ఆ తరువాత మండలిలో ప్రధాన…

తన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కొత్త పాత్రలోకి మారారు. ఆయన వైసీపీ మంత్రిగా ఓటమి చెందినా ఆ వెంటనే శాసనమండలి ఎమ్మెల్సీగా నెగ్గడం, ఆ తరువాత మండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ ర్యాంక్ హోదాతో అవకాశం దక్కడం జరిగాయి.

ఈ పదవిలోకి బొత్స వచ్చాక తొలిసారి ఆయన శాసనమండలికి వచ్చింది బడ్జెట్ సెషన్ తోనే. పది రోజుల పాటు సాగిన ఈ సెషన్ లో మండలిలో బొత్స పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది వైసీపీలోనూ బయట రాజకీయ పార్టీలలోనూ ఒక డిస్కషన్ గా సాగుతోంది.

బొత్స పెద్ద మనిషిగానే వ్యవహరించారు అని అంటున్నారు. ఆయన వైసీపీ తరఫున ప్రతిపక్షంలో ఉన్నా దూకుడుతో కూడిన రాజకీయం చేయకుండా సంయమనం పాటించారు అని అంటున్నారు. చాలా సందర్భాలలో పెద్ద మనిషిగానే ఆయన నిలవాలని అనుకున్నారు. మీరంటే మాకు ఎంతో గౌరవం అని కూటమి మంత్రులు అనగానే బొత్స కూడా ఆ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నమే చేశారు అని అంటున్నారు.

వైసీపీ అధినాయకత్వం బొత్స నుంచి ఇంకా వాడి వేడి ఆశించింది అని అంటున్నారు. అయితే ఆయన నిర్మాణాత్మకమైన పాత్రనే పోషించారు. రాజకీయంగా ఎంత దాకా వెళ్లాలో అంతవరకే వెళ్లారు అని అంటున్నారు. ఇక సభ బయటకు వచ్చాక ఆయన కూటమి మంత్రులు అందరితోనూ కలుపుగోలుగానే ఉంటూ వచ్చారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ప్రాంగణంలో కనిపిస్తే బొత్స ఆయనకు అభివాదం చేయడం ఆ తరువాత పవన్ వచ్చి ఆయనకు ఆలింగనం చేసుకోవడం ఇరువురు నేతలూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ఆ సమయంలో అక్కడే ఉన్న వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవన్నీ చూస్తూ వెనక్కి వెళ్ళడమూ జరిగింది.

బొత్స అయితే లౌక్యంగానే తన విపక్ష పాత్రను నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. శాసనమండలిలోనూ ప్రభుత్వ బిల్లులు సజావుగానే ఆమోదం పొందుతున్నాయి అంటే విపక్షం నిర్మాణాత్మకమైన పాత్రనే పోషిస్తోంది అని అంటున్నారు. బొత్స నిర్వహించిన ఈ పాత్ర వైసీపీ అధినాయకత్వానికి ఎంత మేరకు సంతృప్తికరంగా ఉంది ఎన్ని మార్కులు పడతాయి అన్నది చూడాలి.

13 Replies to “విపక్ష నేత పాత్రలో బొత్సకు ఎన్ని మార్కులు?”

  1. మన మార్కులు ఇప్పుడు ఎవడిక్కావాలి… తీసేస్తే వెళ్లి తెదేపా లోనో… జన సేన లోనో చేరతారు… అంతే కదా

  2. వాడి వేడి ఆశించిందా.. అంటే ఏమిటి..?

    ఇంట్లో ఆడోళ్లను భూతులు తిట్టమని … ఆశించిందా.. అంతేలే .. మీ జగన్ రెడ్డి పార్టీ నిఘంటువు అదే..

  3. ఈ ప్రతిపక్ష నాయకత్వమేదో జ#గ₹ నే తీసుకుంటే బాగుండేది, అక్కడ విధానసభ లో ప్రతిపక్షనేత హోదా ఇవ్వలేదు అని సాకులు చెప్పడం కన్నా, తమ చేతిలోనే ఉన్న ఈ పదవిని చేపట్టి ప్రభుత్వాన్ని ప్రజల తరపున నిలదీయోచ్చు కదా ?

  4. లె..1 లా ఇంట్లో కూర్చోకుండా మండలికి వెళ్లి ధైర్యం గా అధికారపక్షాన్ని ఎదుర్కొని పెద్దగా గొడవలు పడకుండా బయట పవన్ ని ఆలింగనం చేసుకుని మంచి పాయింట్సే కొట్టారు..

    .

    స్టూడెంట్ స్కూల్ కి వెళ్లాలి

    పోలీసోడు స్టేషన్ కి డ్యూటీ కి వెళ్లాలి

    ఎమ్మెల్యే అసెంబ్లీ కి వెళ్లాలి..వెళ్లకపోతే తీసెయ్యాలి

  5. విధానాల పరంగా విభేదించాలి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి అధికార ప్రతిపక్ష లు ఇరువురు రాష్ట్రాభివృద్ధి ఎజెండా తోనే పోటీచేసేరు కలసి మెలసి ఉండటం మంచిది జగన్ గారు వచ్చాకనే రాజకీయాలు రోత లెవెలికి తీసుకెళ్ళేరు వ్యవస్థలను బ్రస్టు పట్టించేరు ముఖ్యం గ పోలీస్ రెవిన్యూ న్యాయ వ్యవస్థలను నాశనం చెయ్యటానికి ప్రయత్నించేడు అందుకే అయన ను దాదాపు శాశ్వతం గ తటస్తులు విద్యావంతులు దూరం పెట్టేసేరు ఆయనకు ఆ విషయం తెలిసే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లలో పోటీచేయటం లేదు కాంగ్రెస్ పుంజుకొంటే సింగల్ సింహం బెంగళూరు పరార్

Comments are closed.