ప్ర‌హ‌స‌నంగా మారిన పైళ్ల ద‌గ్ధం

ప్ర‌భుత్వ‌మే కావాల‌ని ఇవ‌న్నీ చేయిస్తోందా? అనే అనుమానాన్ని ప్ర‌తిప‌క్షాలు వ్య‌క్తం చేస్తున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఫైళ్ల ద‌గ్ధం ప్ర‌హ‌స‌నంగా మారింది. మొద‌ట మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఫైళ్లు ద‌గ్ధం కావ‌డం సంచ‌ల‌నం రేకెత్తించింది. ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా తీసుకుంద‌నే సంకేతాలు పంప‌డానికి డీజేపీ, సీఐడీ చీఫ్‌ను హెలికాప్ట‌ర్‌లో అక్క‌డికి ప్ర‌భుత్వం పంపింది. కొన్నాళ్లు హ‌డావుడి చేశారు.

తాజాగా పోల‌వ‌రం ప్రాజెక్ట్‌కు సంబంధించి కీల‌క ఫైళ్లు ద‌గ్గ‌మ‌య్యాయ‌ని టీడీపీ నాయ‌కులు, ఆ పార్టీ అనుకూల మీడియా రాద్ధాంతం చేశారు. అంత సీన్ లేద‌ని సంబంధిత ఇంజినీర్ వెంట‌నే క్లారిటీ ఇచ్చారు. ఇదే రోజు టీటీడీ ప‌రిపాల‌న కార్యాల‌యంలో ఇంజినీరింగ్ సెక్ష‌న్‌లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగి కొన్ని ఫైళ్లు కాలిపోయిన‌ట్టు చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌న్నీ ప్ర‌హ‌స‌నంగా మారాయి.

ప్ర‌భుత్వ‌మే కావాల‌ని ఇవ‌న్నీ చేయిస్తోందా? అనే అనుమానాన్ని ప్ర‌తిప‌క్షాలు వ్య‌క్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడంతా ఈ-ఫైళ్ల కాలం. అలాంటప్పుడు ఒక చోట ఫైళ్ల‌ను ద‌గ్ధం చేసినంత మాత్రాన వాటిల్లే న‌ష్టం శూన్యం అని చెప్పొచ్చు. ఇక ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు అనుమానం వ్య‌క్తం చేయ‌డం వెనుక బ‌ల‌మైన లాజిక్ వుంది. ఉదాహ‌ర‌ణ‌కు టీటీడీలో ఏదో జ‌రిగిపోయింద‌ని రెండు నెల‌లుగా రాష్ట్ర విజిలెన్స్ బృందంతో త‌నిఖీలు చేయించారు.

సుమారు 72 మంది ఇంజినీర్ల‌కు నోటీసులు ఇచ్చారు. కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను కూడా ప‌ట్టుకోలేద‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. టీటీడీలో ఏమీ క‌నుక్కోలేక‌, చివ‌రికి ఫైళ్లు ద‌గ్ధం చేశార‌నే సాకుతో ముగింపు ప‌ల‌కాల‌నే ఎత్తుగ‌డ వేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌ద‌న‌ప‌ల్లెలో కూడా పెద్దిరెడ్డి కుటుంబం దోపిడీకి సంబంధించి ఆధారాల్ని త‌గుల‌బెట్టార‌ని రాద్ధాంతం చేశారు. ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబ దోపిడీకి సంబంధించి ఒక్క‌టంటే ఒక్క ఆధారం కూడా చూపించ‌డం లేదు.

మ‌రోవైపు పెద్దిరెడ్డి కుటుంబం ప‌రువు న‌ష్టం దావా వేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. దీంతో పెద్దిరెడ్డి కుటుంబంపై అవాకులు చెవాకులు పేలినోళ్లంతా ఇప్పుడు నోళ్లు మూసుకున్నారు. సీరియ‌స్ ఆరోప‌ణ చేయ‌డం, ప్ర‌జ‌ల్లో బ‌ద్నాం అయ్యార‌ని భావిస్తే, ఆ త‌ర్వాత దాన్ని ప‌క్క‌న ప‌డేయ‌డం వ్యూహాత్మ‌కంగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఫైళ్ల ద‌గ్ధాన్ని కూడా చూడాలేమో అనే చర్చ‌కు తెర‌లేచింది.

6 Replies to “ప్ర‌హ‌స‌నంగా మారిన పైళ్ల ద‌గ్ధం”

  1. RBI నివేదికను బట్టి సుస్ప ష్టం

    ‘మార్గదర్శి ’ సేకరిం చిన రూ.72,600 కోట్లకు పైగా డిపాజిట్లన్నీ చట్ట విరుద్ధమే

    కేసులు విచారణలో ఉం డగానే రూ.25 వేల కోట్ల అక్రమ డిపాజిట్ల వసూలు

    మార్గదర్శి ఫైనాన్సి యర్స్ కు కూడా చైర్మ న్గా వ్య వహరిం చిన ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణిం చారు) ఆర్థిక నేరస్తుడని తేటతెల్లమైం ది.చట్టానికి తాను అతీతమన్న ట్టుగా దశాబ్దాలుగా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్ప డి భారీగా దోపిడీకి తెగిం చినట్లు నిగ్గు తేలిం ది.

    మార్గదర్శి ఫైనాన్సి యర్స్ నిబం ధనలకు విరుద్ధం గా ప్రజల నుం చి అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు రిజర్వ్ బ్యాం క్ ఆఫ్ ఇం డియా (ఆర్బీఐ) మరోసారి విస్ప ష్టం గా ప్రకటిం చిం ది

  2. కూటమి కి honey మూన్ ఇంక కొన్ని రోజులే.

    కూటమి చెప్పేదoతా సొల్లే నని జనాలు త్వర లొనే తెలుసుకుంటారు….ఇది ఖాయం.

  3. మన ఫ్యాన్ పార్టీ వాళ్ళు బాగానే పని చేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు లో వుండి, ప్యాలస్ పులకేశి చెప్పినట్లు ఇంకా చేస్తూ.

Comments are closed.