కొత్త‌గా జ‌న‌సేన‌లో ఆయ‌న చేరేదేముంద‌బ్బా!

దొర‌బాబు జ‌న‌సేన‌లో చేరుతార‌నే ప్ర‌చారంతో పిఠాపురంలో జ‌నం న‌వ్వుకుంటున్నారు. ఆల్రెడీ దొర‌బాబు జ‌న‌సేన‌లో ఉన్నారు క‌దా, కొత్త‌గా చేరేదేముందబ్బా అని వెట‌క‌రిస్తున్నారు.

జ‌న‌సేన‌లో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు చేరుతార‌నే ప్ర‌చారం కొత్త చ‌ర్చ‌కు దారి తీస్తోంది. పిఠాపురంలో ఈ నెల 14న నిర్వ‌హించ‌నున్న జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌మ‌క్షంలో ఆయ‌న పార్టీలో చేరుతార‌ట‌! ఈ సంద‌ర్భంగా తాజాగా ప‌వ‌న్‌ను దొర‌బాబు త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి భేటీ కావ‌డం, పార్టీలో చేరాల‌న్న ఆకాంక్ష‌ల‌ను వెల్ల‌డించ‌డం, అందుకు జ‌న‌సేనాని గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చార‌న‌డం హాస్యాస్ప‌దంగా వుంద‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

ఎందుకంటే 2024లో పిఠాపురం టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పెండెం దొర‌బాబును కాద‌ని, వంగా గీత‌కు జ‌గ‌న్ ఇచ్చారు. దీంతో దొర‌బాబు అల‌క‌బూనారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో దొర‌బాబును జ‌గ‌న్ పిలిచి, మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే ఎమ్మెల్సీ ఇస్తాన‌ని, వంగా గీత‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు. అందుకు దొర‌బాబు త‌లూపారు.

కానీ త‌న వాళ్లంద‌ర్నీ జ‌న‌సేన‌లోకి పంపి, ప‌వ‌న్ గెలుపు కోసం దొర‌బాబు ప‌ని చేశార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. టికెట్ త‌న‌కు ఇవ్వ‌లేద‌న్న బాధ‌, కోపంతో దొర‌బాబు పూర్తిగా వైసీపీకి దూరంగా ఉన్నారు. అంతేకాదు, ఆ పార్టీ ఓడిపోవాల‌ని ఆయ‌న బ‌లంగా కోరుకున్నారు. ఇప్పుడు జ‌న‌సేన‌లో చేర‌డానికి ప‌వ‌న్ వ‌ద్ద‌కు వెళ్ల‌డం దొర‌బాబుకే చెల్లింది. వైసీపీకి వ్య‌తిరేకంగా, జ‌న‌సేన‌కు అనుకూలంగా ప‌ని చేసి, అన‌ధికారికంగా ఆ పార్టీలో ఉన్న దొర‌బాబు కండువా క‌ప్పుకోవ‌డం సాంకేతిక అంశ‌మే త‌ప్ప‌, చెప్పుకోడానికి ఏమీ లేదు.

దొర‌బాబు జ‌న‌సేన‌లో చేరుతార‌నే ప్ర‌చారంతో పిఠాపురంలో జ‌నం న‌వ్వుకుంటున్నారు. ఆల్రెడీ దొర‌బాబు జ‌న‌సేన‌లో ఉన్నారు క‌దా, కొత్త‌గా చేరేదేముందబ్బా అని వెట‌క‌రిస్తున్నారు.

7 Replies to “కొత్త‌గా జ‌న‌సేన‌లో ఆయ‌న చేరేదేముంద‌బ్బా!”

  1. పాతగా జెగ్గుల్ పార్టీలో ఉంటే బట్టలూడదీసి ‘మొడ్డ కుడుస్తాడని.. భయపడి కొత్తగా జెగ్గుల్ మొగుడి పార్టీలో చేరుతున్నాడు. Any ప్రాబ్లెమ్ for you గ్యాస్ ఎంకమ్మా??

  2. మీరు ఒక పార్టీ కి బాకా ఊదుతూ అనడం లే న్యూట్రల్ జెర్నలిజం అని.. కనీసం ఆయన తన వాళ్ళను ఐన పంపించి తన స్టాండ్ ఏంటో చెప్పకనే చెప్పాడు….అంత కన్నా ఘోరమా ఇది..

Comments are closed.