ఏపీలో రియ‌ల్ ఎస్టేట్ ల‌బోదిబో!

రాష్ట్రంలో ఎక్క‌డ వెంచ‌ర్లు వేయాల‌న్నా, ముందుగా స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌కు అడిగినంత ముడుపు ముట్ట‌చెప్పిన త‌ర్వాతే భూమిలో దిగాల‌ని ష‌ర‌తులు పెడుతున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు ల‌బోదిబోమంటున్నారు. కూట‌మి అధికారంలోకి వ‌స్తే రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయ‌లుగా వెలుగొందుతుంద‌ని అంతా అనుకున్నారు. వైసీపీ అభిమానులు కూడా అలా ఆశించిన వాళ్ల‌లో ఉన్నారు. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో వైసీపీకి వ్య‌తిరేకంగా ప‌నిచేసిన వాళ్ల‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఉన్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు వెంచ‌ర్లు వేసి, స్థ‌లాలు అమ్ముకునే వ్యాపారుల‌పై వైసీపీ ప్ర‌భుత్వం పిడుగుపాటు నిర్ణ‌యం తీసుకుంది. ఏ వెంచర్‌లో అయినా ఐదు శాతం ప్రభుత్వానికి ఇవ్వాల‌నే ఆదేశాలు రాజ‌కీయాల‌కు అతీతంగా రియ‌ల్ వ్యాపారులంద‌రికీ కోపం తెప్పించాయి. అలాగే స్థానిక వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు రియ‌ల్ ఎస్టేల్ వ్యాపారుల్ని పెద్ద మొత్తంలో డ‌బ్బు డిమాండ్ చేయ‌డం కూడా జ‌గ‌న్‌పై కోపానికి కార‌ణ‌మైంది.

అలాగే ఇసుక విష‌యంలో అనాలోచిత నిర్ణ‌యాల‌తో అపార్ట్‌మెంట్ల నిర్మాణాల్లో కూడా జాప్యం జ‌రిగింది. దీంతో బిల్డ‌ర్ల‌లోనూ ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కూట‌మి స‌ర్కార్ అయితే వ్యాపారం బాగుంటుంద‌ని న‌మ్మి, ఆద‌రించారు. కానీ అధికార మార్పిడి త‌ప్ప‌, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎలాంటి పురోగ‌తి క‌నిపించ‌డం లేదు. పైగా గ‌త వైసీపీ పాల‌న‌లో కంటే, ఇప్పుడు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం మ‌రింత దారుణంగా ప‌డిపోయింది.

గ‌తంలో క‌డ‌ప‌లో సెంట్ రూ.5 ల‌క్ష‌లు ప‌లికిన స్థ‌లం, ఇప్పుడు ల‌క్ష నుంచి రెండు ల‌క్ష‌ల వ‌ర‌కూ త‌గ్గింది. అలాగే అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు అడిగే దిక్కే లేకుండా పోయింద‌ని బిల్డ‌ర్లు వాపోతున్నారు. నిజానికి బిల్డ‌ర్ల‌కు సానుకూలంగా ఈ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అనుమ‌తుల విష‌యంలో నిబంధ‌న‌ల్ని చాలా స‌ర‌ళ‌త‌రం చేసింది. అయితే అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల అత్యాశ‌ల్ని భ‌రించ‌లేక‌పోతున్నామ‌ని రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు.

రాష్ట్రంలో ఎక్క‌డ వెంచ‌ర్లు వేయాల‌న్నా, ముందుగా స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌కు అడిగినంత ముడుపు ముట్ట‌చెప్పిన త‌ర్వాతే భూమిలో దిగాల‌ని ష‌ర‌తులు పెడుతున్నారు. దీంతో అధికార పార్టీ నాయ‌కుల‌ను మేప‌డానికి మ‌న‌మెందుకు వ్యాపారం చేయాల‌నే నిరాశ‌తో రియ‌ల్ట‌ర్లు వెన‌క్కి త‌గ్గుతున్నారు. రాష్ట్రం మొత్త‌మ్మీద అంతోఇంతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చెప్పుకోనే స్థాయిలో వుందంటే… ఒక్క తిరుప‌తి మాత్ర‌మే. అది కూడా తిరుప‌తిలో గుడ్డికంటే మెల్ల మేలు అనే నానుడిని త‌ల‌పిస్తోంది. ఆ న‌గ‌రానికి ఉన్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల రీత్యా…. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం మిగిలిన ప్రాంతాల‌తో పోలిస్తే కొంచెం మెరుగు.

26 Replies to “ఏపీలో రియ‌ల్ ఎస్టేట్ ల‌బోదిబో!”

  1. అయ్యొ! Y.-.C.-.P ఉన్నపుడు ప్రజా ప్రతినిదులు అందరూ పాపం పత్తిత్తులు అంట! ఎమి సెపితిరి? ఎమి సెపితిరి?

    .

    ఒక క్రషర్ వ్యపారిని బెదిరించి 2 కొట్లకి పైగా వసూలు చెసారు అంటూ ఒక మాజి MLA మీద కెసు ఫైల్ అవబొతుంది అని వార్థలు వస్తున్నాయి!

  2. New ventures veyaka pothe, shortage ayi demand peragali kadha…last few years nunchi IT slabs lo homeloan deduction rules change ayi demand taggindhi..

    .Soon insurance industry also will fall.

  3. Orey konda erri ga venkat vedhava jagan didn’t take decision that 5% of land has to be given in any venture.. it is there in karnataka tamilnadu entire India..nuvvu waste fellow ani telusu kani intha konda erri pulka gaadivi ani teliyadu

  4. సరే ఎవరికీ చెప్పకుండా సైలెంట్ గా రేట్ తక్కువ ఉన్నప్పుడు కోనేసేయ్… మళ్ళా రేట్ వచ్చినప్పుడు కుమ్మేద్దువు కానీ…

  5. సువర్ణావకాశం రా గ్యాస్ ఆంధ్ర

    ఇ కనేo 5 లక్షలకు దొరికేది లక్ష రూపాయలకు దొరుకుతున్నప్పుడు ఎంత వీలుంటే అంత కోను

    తిరిగి రేటు వచ్చినప్పుడు అమ్ముకుంటే బోలెడంత లాభం వస్తుందిరా వెధవన్నర వెధవ.. ప్రతి విషయంలో నువ్వు ఒక వెధవన్నర వెధవ అని రుజువు చేసుకుంటున్నావు.

  6. All….. right… but article was 4 years delayed..

    Being in financial field… i know how the land rates are increasing in AP …. if constrction work begins in Amaravthi.. prices goes high in an year…

  7. Kadapa lo real estate. em comedy ra adi. emundi akkada.

    Visakhapatnam artificial ga jaffa gaadu capital adi idi ani rates penche laa chesadu. ippudu janam reality telusukuni dooram ayyaru. asalu vizag lo kondalaki samudraniki madhyalo land entha daantlo development entha real estate entha.

    New capital lo rates are now super hot. Velli choodu. inko 4 years lo world city kanapadakapothe cheppa ra GA. appudu maatladukundam.

Comments are closed.