తూర్పు కోస్తా బతుకు బంగారం

కాకినాడ నుంచి ఇచ్ఛాపురం వరకు తూర్పుకోస్తా అని అనుకుందాం.. నిజానికి ఇంకా విస్తృతమే ఈ ఏరియా. ఆ సంగతి అలా వుంచితే కాకినాడ నుంచి ఇచ్ఛాపురం వరకు భవిష్యత్ బంగారం కాబోతోంది. మొత్తం స్వభావ…

కాకినాడ నుంచి ఇచ్ఛాపురం వరకు తూర్పుకోస్తా అని అనుకుందాం.. నిజానికి ఇంకా విస్తృతమే ఈ ఏరియా. ఆ సంగతి అలా వుంచితే కాకినాడ నుంచి ఇచ్ఛాపురం వరకు భవిష్యత్ బంగారం కాబోతోంది. మొత్తం స్వభావ స్వరూపమే మారిపోబోతోంది. ఇచ్చాపురం సమీపంలో మూలపేట దగ్గరలో విమానాశ్రయం నిర్మించాలనే ప్రతిపాదన చాలా శరవేగంతో కదులుతోంది. అక్కడే ఓడ రేవు నిర్మాణానికి అడుగులు చకచకా కదులుతున్నాయి. అటు ఒరిస్సాలోని బరంపురం, గోపాలపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఇదే ఎయిర్ పోర్ట్. దీనికి భోగాపురం (విశాఖ) ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు మధ్య దూరం దాదాపు 150 కిలో మీటర్ల పైనే.

అంటే శ్రీకాకుళం జిల్లాలో ఓ ఓడరేవు.. ఓ విమానాశ్రయం. టెక్కలి డివిజన్ అభివృద్ధికి ఇవి చాలు. పైగా అక్కడ ఎక్కువ గ్రానైట్ పరిశ్రమ వుంది. విశాఖ వరకు తెచ్చి ఎగుమతి చేయాల్సి వస్తోంది. అలాంటిది ఇప్పుడు అక్కడే ఎగుమతులు, ఆన్సలరీ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం వుంది.

విజయనగరం జిల్లా పరిధిలోనే ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం వస్తోంది. దాని చుట్టూ అటు విజయనగరం, ఇటు విశాఖలను కలుపుతూ ఒక కొత్త నగరమే వస్తుంది.

విశాఖ/అనకాపల్లి జిల్లాలో మరో ఉక్కు కర్మాగారం అన్నది చాలా పెద్ద వరం. ఇప్పటికే అనకాపల్లి జిల్లా మొత్తం పారిశ్రామికంగా బాగా పెరిగింది. స్థానికులకు ఉద్యోగాలు బాగా పెరిగాయి. ఫార్మా, ఇతర పరిశ్రమలు వున్నాయి. ఇప్పుడు మరో స్టీల్ ప్లాంట్ అంటే ఈ ప్రాంత రూపురేఖలు మొత్తం మారిపోతాయి.

కాకినాడ జిల్లా మీదే వుంది ఇప్పుడు అందరి దృష్టి. ఇప్పటికే ఓ ఓడరేవు వుంది. మరో ఓడరేవు నిర్మాణానికి అడుగులు పడ్డాయి. విమానాశ్రయం ప్రతిపాదన ముందుకు కదులుతోంది. ఫార్మా సెజ్ నిర్మాణంలో వుంది. పలు ఫార్మా కంపెనీలు వచ్చాయి. ఇవన్నీ నిర్మాణంలో వున్నవి, నిర్మాణం పూర్తయినవి.

వీటన్నింటి కోసం విశాఖ-రాజమండ్రి నడుమ ఆరు వరుసల రోడ్ విస్తరణ కు కేంద్రం ఓకె చెప్పింది. ఇది ఏనాటి నుంచో ప్రతిపాదనలోనే వుంటూ వస్తోంది.

అంటే భోగాపురం నుంచి కాకినాడ వరకు అసలు స్వభావ స్వరూపాలే మారిపోబోతున్నాయి. విశాఖకు రాజధాని రాలేదన్న బాధ వుండొచ్చు. కానీ కేవలం రాజధాని రావడం కన్నా, ఈ ఓడరేవులు, ఎయిర్ పోర్టులు, పరిశ్రమలు ఇవన్నీ చాలా ఎక్కువ.

అందుకే తూర్పు కోస్తా భవిష్యత్ బంగారం.

18 Replies to “తూర్పు కోస్తా బతుకు బంగారం”

  1. ఎక్కడో ఒకచోట ఇదంతా లె1 గారు చలవ వాళ్లే అని రాసెయ్యకపోయావా అలవాటులో..

      1. ఇక్కడ ఒకడు డైలీ పోస్టులు పెడతాడు కదా పోర్టులు కట్టేశాడు, మెడికల్ కాలేజెస్ కట్టేశాడు పోలవరం కట్టేసాడు అని..అలా అన్నమాట

    1. మళ్ళీ కెలకడం ఎందుకు? ఓడ రేవులు, ఎయిర్పోర్ట్ లు ఉంటే ఎక్స్పోర్ట్, import కి అనువుగా ఉంటుంది అని అక్కడే ఎక్కువ పరిశ్రమలు వస్తాయి. ఇక కంపెనీ ఉద్యోగులు రాకపోకలకి ఎయిర్పోర్ట్ ఉంటే బాగుంటుంది.

Comments are closed.