ఉద్యోగుల‌కు జీతాలు.. జ‌గ‌న్ పాల‌న గుర్తొస్తోంది!

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల‌న గుర్తొస్తోంద‌ని ఉద్యోగులు అంటున్నారు. ఇంకా స‌గం మంది ఉపాధ్యాయులు, ఉద్యోగుల‌కు జీతాలు ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కొలువుదీరిన మొద‌టి నెల‌లో మాత్ర‌మే మొద‌టి తేదీన జీతాలు ప‌డ్డాయి. ఆ…

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల‌న గుర్తొస్తోంద‌ని ఉద్యోగులు అంటున్నారు. ఇంకా స‌గం మంది ఉపాధ్యాయులు, ఉద్యోగుల‌కు జీతాలు ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కొలువుదీరిన మొద‌టి నెల‌లో మాత్ర‌మే మొద‌టి తేదీన జీతాలు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా ఒక‌టో తేదీకి బ‌దులు మూడు, నాలుగు…ఇలా పెంచుకుంటూ 10వ తేదీ నాటికి జీతాలు వేస్తున్న‌ట్టు ఉద్యోగులు మండిప‌డుతున్నారు.

ఇందుకేనా జ‌గ‌న్‌ ప్ర‌భుత్వాన్ని మార్చి, కూట‌మి ప్ర‌భుత్వాన్ని తెచ్చుకున్న‌ద‌ని ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్ర‌శ్నిస్తున్నారు. నెలాఖ‌రుకు రూ.3 వేల కోట్లు ప్ర‌భుత్వం అప్పు తెచ్చింది. అయిన‌ప్ప‌టికీ ఉద్యోగులంద‌రికీ జీతాలు వేయ‌లేదు. అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లోనే ఇలా వుంటే, రానున్న రోజుల్లో ఇంకెంత దారుణంగా వుంటుందో అని ఉద్యోగులు భ‌య‌ప‌డుతున్నారు.

త‌మ‌ది ఉద్యోగుల ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అని ప్ర‌భుత్వ పెద్ద‌లు చెప్ప‌డ‌మే త‌ప్ప‌, ఆచ‌ర‌ణ‌లో మాత్రం తేడా క‌నిపిస్తోంద‌నే స‌ణుగుడు మొద‌లైంది. ఇదే రీతిలో ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డం ఆల‌స్య‌మైతే మాత్రం వ్య‌తిరేక‌త తెచ్చుకోడానికి పెద్ద స‌మ‌యం ప‌ట్ట‌దు. ఇంకా త‌మ డిమాండ్ల సాధ‌న‌కు ఉపాధ్యాయులు, ఉద్యోగులు రోడ్డెక్క‌లేదు. ప్ర‌భుత్వం ఏర్ప‌డి కేవ‌లం నాలుగు నెల‌లు మాత్ర‌మే కావ‌డంతో, కుదురుకోడానికి కొంత స‌మ‌యం ఇవ్వాల‌నే ఆలోచ‌న‌తో ఉద్యోగులు, ఉపాధ్యాయులున్నారు.

అయితే కూట‌మి ప్ర‌భుత్వం జీతాలు ఇవ్వ‌డానికే తిప్పలు ప‌డ‌డం చూస్తే, ఇక డిమాండ్ల‌ను ఏ విధంగా ముందుకు తేవాల‌నే సంశ‌యంలో ప‌డే ప‌రిస్థితి. ఒక‌టో తేదీ జీతాలు ఇస్తే, అదే మ‌హాభాగ్యం అనుకునేలా కూట‌మి ప్ర‌భుత్వం కూడా గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కార్ మాదిరే చేసేలా వుంద‌ని ఉద్యోగులు వాపోతున్నారు. రానున్న రోజుల్లో ఉద్యోగుల తీరు ఎలా వుంటుందో మ‌రి!

43 Replies to “ఉద్యోగుల‌కు జీతాలు.. జ‌గ‌న్ పాల‌న గుర్తొస్తోంది!”

    1. 1వ తారీఖు జీతాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినప్పుడు ఇవ్వకపోతే ప్రజలను మోసం చెయ్యడమేగా జగన్ కి, కూటమికి తేడా ఏముంది

    2. జగన్ టైం లో కరోనా నుంచి లేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది.. ఇన్కమ్ తగ్గడం వలన, కానీ, ఇప్పుడు 3 నెలలకే స్టార్ట్.. పోనీ జనాలకి ఏమైనా స్కీం లు ఇచ్చారు లేట్ అయింది అంటే..అదీ లేదు..

  1. లేటు అంటే జగన్ ప్రభుత్వం రకరకాల కౌంటర్ లు ఇవ్వటమో, ప్రజల లో చులకన చేసేందుకు ప్రయత్నం చేయటమో చేసేది. లేటు అవ్వటం కంటే ఈ విషయాలు ఎక్కువ బాధించాయి.

  2. అప్పులు చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగుల్ని మేపడానికా అంటున్న సీబీన్ abn లు వీల్లకి సరైనోళ్లు..ఇలాగే ఉండాలి…ఇంకా కుదిరితే వీళ్ళు ఉద్యోగాలు వదిలి పోయేలా, ఏడాదికొక్కసారి జీతాలు,ఎదో ఓంకాతో సస్పెన్షన్లు చేస్తూ,మెమో లు ఇస్తూ దిగ జార్చాలి…

    1. వాడు అలా చేసాడు కాబట్టే 11 కి పడిపోయాడు. ఉద్యోగులుతో కయ్యం పెట్టుకుంటే పొయ్యి ఇంట్లో ఉండాల్సిందే ఎవ్వడైనా…… ఉద్యోగుల జీతాలు అంటే వాడెబ్భసొమ్ము ఇస్తున్నట్లు బాధపడిపోతారు నీలాంటి వాళ్ళు.

    2. Lakshala.manditho potee PADI kashtapadi udyogam techukunte meelanti vallu digajari matlade matalu vintunte chala bafha vestundi. Evarini takkuva chesi matladakandi. Andariki valla valla paridhilo kashtalu untai. Veelaithe artham chesukondi. Employees kuda meelanti manushule kada Bro.

  3. Without implementing super six schemes, without spending state funds on capital construction or Polavaram project, where are all the state funds going to? Also, why is government taking loans and still not able to pay salaries?

  4. గ్రేట్ ఆంధ్రా జూన్, జూలై, ఆగష్టు, సెప్టెంబర్ లో 1 లేదా 2 తేదీలలో జీతాలు వేశారు అక్టోబర్ లో మాత్రమే 3,4,5 తేదీలలో వేశారు. మరీ జగన్ లాగా 10 నుండి 15 తేదీ దాకా లాగలేదు. చూద్దాం ఇంకా 2029 దాకా టైమ్ ఉందిగా.

  5. గ్రేట్ ఆంధ్రా మరీ జగన్ తో పోల్చొద్దు, తను 10 నుండి 15 తేదీ దాకా లాగాడు. ఇప్పుడు 5 తేదీ దాటలేదు ఇప్పటివరకు. చూద్దాం ముందుముందు ఎలా ఉంటుందో

  6. గాలి ని పొట్లం కట్టి వార్త గా రాయమాకండి! ఎక్కడ లేట్ అయ్యిందో నిర్దిష్టం గా రాయండి !

    పాలన జిల్లా లో పాలన ట్రెజరీ కింద ఎక్కడ రాలేదో క్లియర్ గా మెన్షన్ చేయండి

    ధైర్యం ఉందా?

  7. అంటే ఉద్యోగుల్ని ఏమానకుండా జీతాలు ఆలస్యం చేస్తే సరిపోతుందా!ఎక్కడ లేటెంది రాష్ట్రమంటా లేట్. ఒకడేమో సంవత్సరానికి ఒకసారి జీతం ఇవ్వమంటున్నాడు. మరి వాని కొడుకు ఉద్యోగి ఐతే ఇలా మాట్లాడుతాడ.

  8. ప్రభుత్వానికి భారమేదైనా ఉందంటే అది మీ ఉద్యోగుల జీతాలే, నిరుపేదలు అయినట్లు ఒకటవ తారీఖున జీతాలు పడక పోతే ఓ గింజేసుకుంటారు. మీలో ఎవరు నిజాయతీ గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఖజాన లో మీకే 70% జీతాల రూపంలో పోతున్నాయి, మీరే అలా అంటే మరి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, మీ దగ్గరకు వస్తే లంచం తీసుకుంటారు.

  9. కొన్ని డిపార్ట్మెంట్ మరి ముఖ్యంగా ప్రాజెక్ట్స్లో పని చేసే ఎంప్లాయిస్ కి రెండు నెలలు అయినా జీతాలు లేవు.

Comments are closed.