గోశాల‌లో గోమాత‌ల మ‌ర‌ణాలు నిజం.. తేలాల్సింది లెక్కే!

కూట‌మి నేత‌లు నెమ్మ‌దిగా ఎస్వీ గోశాల‌లో గోవుల మృతిపై స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

టీటీడీ నేతృత్వంలో న‌డిచే ఎస్వీ గోశాల‌లో గోమాత‌లు మ‌ర‌ణాలు తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి మొట్ట‌మొద‌ట ఎస్వీ గోశాల‌లో గోమాత‌ల మ‌ర‌ణాల్ని వెలుగులోకి తెచ్చారు. దీంతో టీడీపీ, కూట‌మి స‌ర్కార్ ఉలిక్కి ప‌డ్డాయి. ఎందుకంటే, గోవుల్ని అత్యంత ప‌విత్రంగా భార‌తీయ స‌మాజం భావించ‌డ‌మే. గోవుల్ని పూజించే పుణ్య‌భూమి మ‌న‌ది. త‌ల్లిగా భావించే గోవుల మ‌ర‌ణాల్ని ముఖ్యంగా హిందూ స‌మాజం జీర్ణించుకోలేక‌పోతోంది.

భూమ‌న ఆరోప‌ణ‌ల్ని మొద‌ట టీటీడీ కొట్టి పారేసింది. అబ్బే, సోష‌ల్ మీడియాలో ఆ ప్ర‌చారం ఉత్తుత్తిది అని ఖండించింది. ఆ మ‌రుస‌టి రోజు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, తిరుప‌తి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులు స్పందించారు. అనారోగ్యంతోనూ, వృద్ధాప్యంతోనూ, ప్ర‌మాదాల కార‌ణంగా గోవులు మృతి చెందిన‌ట్టు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. గోమాత‌ల మ‌ర‌ణాల్ని ఆయ‌న ధ్రువీక‌రించ‌డంపై భూమ‌న స్వాగ‌తించారు.

తిరుప‌తి ఎమ్మెల్యే ఆర‌ణి మీడియాతో మాట్లాడుతూ ఎస్వీ గోశాల‌లో 40 గోవులు ప్రాణాలు పోగొట్టుకున్న‌ట్టే ఏకంగా సంఖ్య కూడా చెప్పారు. అయితే అనారోగ్యంతో చ‌నిపోయిన‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. తిరుప‌తి ఎమ్మెల్యే ఆగ్ర‌హమ‌ల్లా గోమాత‌లు చ‌నిపోవ‌డం కంటే, త‌మ నాయ‌కుడైన డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను భూమ‌న విమ‌ర్శించ‌డంపైన్నే. ప‌వ‌నానంద స్వామి అని ఎలా అంటార‌ని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం.

కూట‌మి నేత‌లు నెమ్మ‌దిగా ఎస్వీ గోశాల‌లో గోవుల మృతిపై స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గోమాత‌లు చ‌నిపోయాయని, కానీ రాజ‌కీయం చేయ‌డం ఏంట‌ని చైర్మ‌న్ బీఆర్ నాయుడైనా, ఆర‌ణి శ్రీ‌నివాసులైనా ప్ర‌శ్నించేది. స‌నాత‌న ధ‌ర్మంపై పెద్ద ఎత్తున కూట‌మి స‌ర్కార్ నీతులు చెబుతూ, మ‌రోవైపు అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. అందుకే గోవుల మృతిని కూట‌మి స‌ర్కార్‌, టీటీడీ త‌ట్టుకోలేక‌పోతున్నాయి.

దీని నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలో వాళ్ల‌కు దిక్కుతోచ‌డం లేదు. అయితే గోశాల‌లో పాల‌క‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు చెబుతున్న లెక్క‌ల్లో నిజం ఏంట‌నేది తేలాల్సి వుంది. నిజంగా టీటీడీకి, కూట‌మి స‌ర్కార్‌కు చిత్త‌శుద్ధి వుంటే, అత్యున్న‌త స్థాయి విచార‌ణ చేయించేందుకు ముందుకు రావాలి. అలాగే ఆరు నెల‌ల సీసీటీవీల ఫుటేజీని అఖిల‌పక్షాన్ని పిలిచి, చూపాల్సిన అవ‌స‌రం వుంది.

21 Replies to “గోశాల‌లో గోమాత‌ల మ‌ర‌ణాలు నిజం.. తేలాల్సింది లెక్కే!”

  1. హిం*దూ పేర్లతో టీ*టీడీ లో ఉన్న వా*టికన ము*ఠా ప్లా*న్ లాగ వుం*ది.

    గ్రే*ట్ ఆం*ద్ర కూడా ఆ వాటి*కన్ గొ*ర్రె బి*డ్డలు లో భాగమే నా ..

    1. మరణం కాదు. మర్డర్ నిజం. చేసిన వాళ్ళు కూడా తేలి పోయారు , తేలాల్సింది మర్డర్ చేపించింది ఎవరనేది.

  2. గోశాల కి నేను రెగ్యులర్ గా వెళతాను.. మా ఇంటిదగ్గర 2000 పైన ఆవులు వున్నాయి… డాక్టర్స్ కూడా వుంటారు… ఆవులు చనిపోవడం అన్నది మాములు విషయం… 15% ఆవులు జబ్బు వృద్ధాప్యం తో ఉంటాయి..అవి చనిపోవడం మాములే. దీని మీద రచ్చ అన్నది రాజకీయం తప్ప మరొకటి కాదు.

    వేరే కారణాలు ఉంటే మాత్రం టీటీడీ చూడాలి

  3. Oka ExCM brother inko ExCM babayi bathroom lo jaaripadi, gunde potu vachi, anukokundaa goddalito narikinchukoni chanipoyaadu, please find out, CBN behind this, he should resign and give power to our anna n jalaganna bring out the truth within a week

  4. ఒక జర్నలిస్ట్ గ పరిశోధించి విశ్లేషణాత్మకంగా రాయి, ఎదో భూమన చెప్పిన రాజకీయ కక్ష కబుర్లు కాకుండా. అసలు గోశాల లో ఎన్ని ఆవులు వున్నాయి, వాటికీ సరిపడా వెటర్నరీ డాక్టర్స్ వున్నారా, లేకుంటే ఎంత అందని తక్కువ వున్నారు? అక్కడ హాస్పిటల్ లో మందులు, సర్జరీ కి సరిపడా వస్తువులు ఉన్నాయా, గోవులు సంచరించడానికి విశాలమైన పాచిక పాయలు, షెడ్లు ఉన్నాయా? లేకపోతె వన తార యజమాని అనంత్ లాంటివాళ్ల సహకారం తీసుకోవాలా? అని రాస్తే ఉపయోగం.

  5. Orey ayya, we use to have 20+ buffalos in 1995. Few of them use to die because of multiple deceases and my father use to raise the young ones to maintain the same count…this is very common…that TTD might have thousands….so 100 is not a big number considering the age. Isari ee diamond miss avvaleda inka gola cheyataniki

  6. Burra thakkuva GA, we use to have 20+ buffalos in 1995. Few of them use to die because of multiple deceases and my father use to raise the young ones to maintain the same count…this is very common…that TTD might have thousands….so 100 is not a big number considering the age. Isari ee diamond miss avvaleda inka gola cheyataniki

  7. Burra thakkuva GA, we use to have 20+ buffalos in 1995. Few of them use to die because of multiple deceases and my father use to raise the young ones to maintain the same count…this is very common…that TTD might have thousands….so 100 is not a big number considering the age. Isari ee diamond miss avvaleda inka gola cheyataniki

  8. Orey ayya, we use to have 20+ buffalos in 1995. Few of them use to die because of multiple deceases and my father use to raise the young ones to maintain the same count…this is very common…that TTD might have thousands….so 100 is not a big number considering the age and seasonal deases. Isari ee diamond miss avvaleda inka gola cheyataniki

  9. Orey ayya, we use to have 20+ buffalos in 1995. Few of them use to die because of multiple deceases and my father use to raise the young ones to maintain the same count…this is very common…that TTD might have thousands….so 100 is not a big number considering the age. Isari ee diamond miss avvaleda inka gola cheyataniki

  10. Burra thakkuva GA, we use to have 20+ buffalos in 1995. Few of them use to die because of multiple deceases and my father use to raise the young ones to maintain the same count…this is very common…that TTD might have thousands….so 100 is not a big number considering the age and seasonal deases. Isari ee diamond miss avvaleda inka gola cheyataniki

  11. Till yesterday there were allegations that what YCP said was fake, now with more evidences being shown, they are agreeing that deaths are true and want to confirm the numbers. This might be the meaning of visionary.

  12. Tonall these alliance supporters who are saying that this is not a big deal, wonder how these loud mouth alliance supporters would have reacted if the same thing happened during last 5 years. Heights of hypocrisy!!

Comments are closed.