జ‌గ‌న్ ఎటాక్ అప్పుడే చేసి వుంటే?

అధికారంలో ఉన్న‌ప్పుడే ఎప్ప‌టిక‌ప్పుడు, నిరాధార ఆరోప‌ణ‌ల‌పై జ‌గ‌న్ ఎటాక్ చేసి వుంటే, ప‌రిస్థితి మ‌రోలా వుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మీడియా ముందుకొచ్చారు. కూట‌మి నేత‌లు ప‌దేప‌దే త‌న‌ను విధ్వంస‌కారుడిగా చిత్రీక‌రిస్తున్న తీరుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బాబు హ‌యాంలో 2014-19 మ‌ధ్య , అలాగే త‌న హ‌యాంలో ఆర్థిక వ్య‌వ‌హారాల‌పై జ‌గ‌న్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఆక‌ట్టుకుంది.

జ‌గ‌న్‌ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో వుండ‌గా, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కాగ్‌, కేంద్ర ప్ర‌భుత్వ గ‌ణాంకాల‌పై ప‌వ‌ర్ పాయింజ్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా ఏ విధంగా విధ్వంసం చేసిందో బాబు తూర్పార‌ప‌ట్టారు. అయితే చంద్ర‌బాబు త‌న ప్ర‌జెంటేష‌న్‌లో చేసిన ఆర్థిక గ‌ణాంకాల జిమ్మిక్కుల‌ను జ‌గ‌న్ స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టారంటూ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌డం విశేషం.

చంద్ర‌బాబు దృష్టిలో సంప‌ద సృష్టి అంటే త‌న‌తో పాటు త‌న వాళ్ల ఆస్తుల్ని పెంచుకోవ‌డం మాత్ర‌మే అని విమ‌ర్శించారు. సంప‌ద సృష్టి ఎలా చేయాలో ఎవ‌రైనా త‌న చెవిలో చెప్పాల‌ని చంద్ర‌బాబు అన‌డం వెట‌కారం కాదా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. అన్నీ తెలిసి కూడా చంద్ర‌బాబు హామీలిచ్చి, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సంప‌ద సృష్టి గురించి మాట్లాడుతున్నార‌ని త‌ప్పు ప‌ట్టారు. సంప‌ద సృష్టించిన త‌ర్వాతే హామీలు అమ‌లు చేస్తానంటూ ప్ర‌జ‌ల జీవితాల‌తో సీఎం ఆడుకుంటున్నార‌ని జ‌గ‌న్ ధ్వ‌జ‌మెత్తారు.

చంద్ర‌బాబును న‌మ్మ‌డం అంటే పులినోట్లో త‌ల పెట్ట‌డ‌మే అని ఎన్నిక‌ల ప్ర‌చారంలో మొత్తుకుని చెప్పాన‌ని జ‌గ‌న్ అన్నారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు పొర‌పాటు ప‌డి ఓట్లు వేసి, బాధ‌ప‌డుతున్నార‌న్నారు. ఇటీవ‌ల నీతి ఆయోగ్ అంటూ చంద్ర‌బాబు కొత్త డ్రామాకు తెర‌లేపార‌న్నారు. ఎవ‌రైనా పోల్చి చెప్పేట‌ప్పుడు అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల పాల‌న‌లోని ఐదేళ్ల కాలాన్ని తీసుకుని చెప్పాలా? లేదా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

చంద్ర‌బాబు త‌న పాల‌న‌లోని బెస్ట్ ఇయ‌ర్ (2018-19ను, త‌న పాల‌న‌లోని అధ్వాన ఏడాది (2022-23)ని మాత్ర‌మే తీసుకుని ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చార‌న్నారు. రాష్ట్రం చాలా అన్యాయ‌మైన ప‌రిస్థితిలో ఉన్న‌ట్టు చూపే ప్ర‌య‌త్నం చేశార‌ని మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు, అలాగే తన ఐదేళ్ల పాల‌న‌లోని డేటాను చూపి, ఎవ‌రు ఆర్థిక విధ్వంస‌కారుడో మీరే చెప్పాల‌ని జ‌గ‌న్ కోరారు. చంద్ర‌బాబు హ‌యాంలో మూల‌ధ‌న వ్య‌యం రూ.13,860 కోట్లు అని చూపారు. ఇదే వైసీపీ హ‌యాంలో రూ.15,632 కోట్లు అని చెప్పుకొచ్చారు. మ‌రీ ముఖ్యంగా త‌మ హ‌యాంలో కోవిడ్‌తో రెండున్న‌రేళ్ల పాటు ఆదాయం లేద‌న్నారు. చంద్ర‌బాబుకు అలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితి లేద‌న్నారు. ఇది కాగ్ రిపోర్ట్ అని, ఎవ‌రి హ‌యాంలో ఆర్థిక విధ్వంసం జ‌రిగింద‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

సోష‌ల్ స‌ర్వీసెస్ కింద చంద్ర‌బాబు కేవ‌లం ఒకే ఒక్క ఏడాది (2018-19)లో రూ.2,866 కోట్లు చూపార‌న్నారు. ఇదే 2022-23లో కేవ‌లం రూ.447 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసిన‌ట్టు చంద్ర‌బాబు చూపార‌న్నారు. కానీ చంద్ర‌బాబు ఐదేళ్ల పాల‌న‌లో రూ.2,437 కోట్లు ఖ‌ర్చు చేస్తే, త‌న ఐదేళ్ల పాల‌న‌లో రెట్టింపు నిధులు రూ.5 వేల కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేశామ‌న్నారు. ఇలా చంద్ర‌బాబు వ‌క్రీక‌రించార‌ని ఆయ‌న ఆరోపించారు.

దేశ జీడీపీలో చంద్ర‌బాబు పాల‌న‌లో చంద్ర‌బాబు వాటా 4.47 శాతం, వైసీపీ హ‌యాంలో 4.80 శాతం అని జ‌గ‌న్ చెప్పారు. త‌మ పాల‌న‌లో కోవిడ్ విప‌త్క‌ర ప‌రిస్థితి వుంద‌ని ఆయ‌న మ‌రోసారి గుర్తు చేశారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దిగిపోయే నాటికి త‌ల‌స‌రి ఆదాయంలో దేశంలో 18వ స్థానంలో ఉన్నామ‌న్నారు. త‌మ హ‌యాంలో 15వ స్థానానికి పెరిగిన‌ట్టు జ‌గ‌న్ తెలిపారు.

ఇలా అన్ని విష‌యాల్లోనూ జ‌గ‌న్ గ‌ణాంకాల‌తో స‌హా ఏ విధంగా వైసీపీ మంచి పాల‌న అందించిందో వివ‌రించారు. కానీ అధికారంలో ఉన్న‌న్నాళ్లు ప్ర‌త్య‌ర్థులు ఆర్థిక విధ్వంసం సృష్టిస్తున్నార‌ని ఆరోప‌ణలు గుప్పిస్తుంటే, ఇలా ఏ రోజూ మీడియా ముందుకొచ్చి వివ‌ర‌ణ ఇచ్చిన దాఖ‌లాలు లేవు. అధికారంలో ఉన్న‌ప్పుడే ఎప్ప‌టిక‌ప్పుడు, నిరాధార ఆరోప‌ణ‌ల‌పై జ‌గ‌న్ ఎటాక్ చేసి వుంటే, ప‌రిస్థితి మ‌రోలా వుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

18 Replies to “జ‌గ‌న్ ఎటాక్ అప్పుడే చేసి వుంటే?”

  1. అమరావతిని చూస్తె చాలు విద్వంసం ఎవరు చెస్తారొ కళ్ళకి కట్టినట్టు ఇట్టె అర్ధం అవుతుంది!

    .

    అక్కడి దాకా ఎందుకు ఇప్పుడు కూడా రాజదానికి అప్పు ఇవ్వవద్దు అని లెకలు రాయటం ఎమిటిరా! చీ!! నీ బ్రతుకు చెట!

  2. జగన్ లెకుండా విద్వంసం ఉండదు! విద్వంసం చెయకుండా జగన్ ఉండడు!!

    విద్వంసం జగన్ అన్నా కవల పిల్లలు!

  3. “ఇలా అన్ని విష‌యాల్లోనూ జ‌గ‌న్ గ‌ణాంకాల‌తో స‌హా ఏ విధంగా వైసీపీ మంచి పాల‌న అందించిందో వివ‌రించారు”…..recorded press meet!..lol. This fellow can not even have live press meet and face questions…waste fellow

  4. చంద్రబాబుకు ఓటెయ్యడమంటే పులి నోట్లో తల పెట్టినట్టే అని చెప్పినా, జనాలు నీ మాటలు నమ్మకుండా, నీకు పంగనామాలు పెట్టారంటే..

    నీ మాటలకి ప్రజల్లోనే విశ్వసనీయత కోల్పోయావ్.. ఇప్పుడు power పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే విశ్వసిస్తారా ??

Comments are closed.