యురేనియం ప్రాజెక్టు వ్య‌తిరేక ఉద్య‌మం!

క‌ర్నూలు జిల్లా క‌ప్ప‌ట్రాళ్ల అడ‌వుల్లో యురేనియం ప్రాజెక్ట్ ఏర్పాటుపై చుట్టుప‌క్క‌ల గ్రామీణులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఉద్య‌మానికి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి సంఘీభావం తెలిపారు. ఉద్య‌మ‌కారుల‌తో క‌లిసి ఆయ‌న అడుగులు వేశారు. Advertisement క‌ప్ప‌ట్రాళ్ల అడ‌వుల్లో…

క‌ర్నూలు జిల్లా క‌ప్ప‌ట్రాళ్ల అడ‌వుల్లో యురేనియం ప్రాజెక్ట్ ఏర్పాటుపై చుట్టుప‌క్క‌ల గ్రామీణులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఉద్య‌మానికి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి సంఘీభావం తెలిపారు. ఉద్య‌మ‌కారుల‌తో క‌లిసి ఆయ‌న అడుగులు వేశారు.

క‌ప్ప‌ట్రాళ్ల అడ‌వుల్లో చేప‌ట్టిన యురేనియం త‌వ్వ‌కాల‌కు వ్య‌తిరేకంగా 12 గ్రామాల ప్ర‌జ‌లు ఉద్య‌మ బాట ప‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. యురేనియం ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తే, ప‌ల్లె సీమ‌లు స‌ర్వ‌నాశ‌నం అవుతాయ‌నే ఆందోళ‌న గ్రామీణుల్లో క‌నిపిస్తోంది.

ముఖ్యంగా వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని వేముల మండలం తుమ్మలపల్లె, కేకే కొట్టాల, మబ్బుచింతపల్లె, రాచకుంటపల్లె, భూమయ్యగారిపల్లెల్లో యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(యూసీఐఎల్‌) సంస్థ యురేనియం తవ్వకాలు చేపట్టిన సంగ‌తి తెలిసిందే.

అప్ప‌ట్లో యురేనియం ప్రాజెక్ట్‌కు వ్య‌తిరేకంగా గ్రామీణులు ఉద్య‌మించినా, నాడు సీఎం హోదాలో వైఎస్సార్ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో యురేనియం ప్రాజెక్ట్ ఏర్పాటుపై ప‌ట్టుద‌ల‌కు పోయారు. దీంతో ఉద్య‌మాల్ని అణిచివేశారు.

యురేనియం ప్రాజెక్ట్ ఏర్పాటుతో పంట‌లు పండ‌క‌పోవ‌డం, అలాగే పిల్ల‌ల పుట్టుక‌పై ప్ర‌జ‌ల అనుమానాలే నిజ‌మ‌య్యాయి. దీంతో యురేనియం అంటే ప్ర‌జ‌లు వ‌ణికిపోయే ప‌రిస్థితి.

ఈ విష‌యాల‌న్నీ తెలియ‌డంతో తాజాగా దేవనకొండ మండలంలో 468.25 హెక్టర్ల విస్తీర్ణంలో కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌(కౌలుట్లయ్యమల) భూముల్లో యురేనియం త‌వ్వ‌కాల‌పై వ్య‌తిరేక‌త వెల్లువెత్తుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు వ్య‌తిరేకంగా శ‌నివారం ప‌ల్లెవాసులు పెద్ద ఎత్తున ఉద్య‌మ‌బాట ప‌ట్టారు. దీంతో క‌ర్నూలు-బళ్లారి మార్గంలో ర‌వాణా స్తంభించింది.

3 Replies to “యురేనియం ప్రాజెక్టు వ్య‌తిరేక ఉద్య‌మం!”

Comments are closed.