మోహ‌న్‌బాబు ఇంటి ఎదుట మ‌నోజ్ బైఠాయింపు

మంచు మ‌నోజ్ ఫిర్యాదు చేయ‌డంతో నార్సింగి పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. మ‌నోజ్ కారు విష్ణు ఇంట్లో ఉన్న‌ట్టు పోలీసులు గుర్తించారు.

టాలీవుడ్ అగ్ర న‌టుడు మంచు మోహ‌న్‌బాబు కుటుంబంలో వివాదం సీరియ‌ల్‌ను త‌ల‌పిస్తోంది. అంతా స‌ర్దుకుంద‌ని అనుకునేలోపే మళ్లీ ర‌చ్చ‌. ఇప్ప‌టికే మంచు కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ప‌రస్ప‌రం ఫిర్యాదులు చేసుకుని, ప్ర‌జ‌ల్లో చుల‌క‌న అయ్యారు. అయిన‌ప్ప‌టికీ గొడ‌వ‌ల్ని ప‌రిష్క‌రించుకోలేక‌పోయారు. తాజాగా మ‌రోసారి వివాద తేనెతుట్టెను మంచు మ‌నోజ్ క‌దిపారు. త‌న కారును చోరీ చేశాడ‌నే ఫిర్యాదుతో వివాదం మొద‌టికొచ్చింది.

ఈ నేప‌థ్యంలో జ‌ల్‌ప‌ల్లిలోని మోహ‌న్‌బాబు ఇంటి వ‌ద్ద మ‌నోజ్ బైఠాయింపున‌కు దారి తీసింది. కారు చోరీపై నార్సింగి పోలీసుల‌కు మ‌నోజ్ ఫిర్యాదు చేసిన నేప‌థ్యంలో బుధ‌వారం త‌న తండ్రి ఇంటికి అత‌ను వెళ్లారు. అయితే ఇంట్లోకి వెళ్లేందుకు గేటు తెర‌వ‌లేదు. దీంతో అక్క‌డే మ‌నోజ్ బైఠాయించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మోహ‌న్‌బాబు ఇంటి వ‌ద్ద ఎలాంటి గొడ‌వ‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు.

మంచు మ‌నోజ్ ఫిర్యాదు చేయ‌డంతో నార్సింగి పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. మ‌నోజ్ కారు విష్ణు ఇంట్లో ఉన్న‌ట్టు పోలీసులు గుర్తించారు. మ‌నోజ్‌ను మోహ‌న్‌బాబు ఇంటి నుంచి సాగ‌నంప‌డానికి పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. మంచు కుటుంబ వివాద డ్రామా ఏ ర‌కంగా మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

4 Replies to “మోహ‌న్‌బాబు ఇంటి ఎదుట మ‌నోజ్ బైఠాయింపు”

    1. okka ఒకదానికి కూడా మొగుడు లేడు అందరూ ఇంట్లో కూర్చున్నారు మరి దాన్ని ఏం అంటారు

Comments are closed.