వెంక‌ట‌గిరిలో టీడీపీకి షాక్‌.. వైసీపీపై విశ్వాసం!

తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తి మాట్లాడుతూ స్థానిక సంస్థ‌ల్లో మ‌రోసారి వైసీపీదే బ‌లం అని చాటి చెప్పామ‌న్నారు.

తిరుప‌తి జిల్లా వెంక‌ట‌గిరి మున్సిపల్ చైర్‌ప‌ర్స‌న్ న‌క్కా భానుప్రియ‌ను దించాల‌న్న టీడీపీ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. అధికారంలో ఉన్నామ‌న్న ధీమాతో ఏదైనా చేయొచ్చ‌ని టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. అయితే టీడీపీ ప‌ప్పులేవీ ఉడ‌క‌లేదు. తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి, వెంక‌ట‌గిరి వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త రామ్‌కుమార్‌రెడ్డి వ్యూహాత్మ‌కంగా ముందుకెళ్ల‌డంతో 19 మంది కౌన్సిల‌ర్లు సొంత పార్టీ వైసీపీపై విశ్వాసాన్ని చాటుకున్నారు.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్ల‌లో వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల్ని గ‌ద్దె దింపాల‌నే ప‌థ‌కానికి టీడీపీ శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా వెంక‌ట‌గిరి మున్సిపాల్టీలో కూడా అలాంటి ప్ర‌యోగాన్ని టీడీపీ చేప‌ట్టింది. వైసీపీ నుంచి వెళ్లిన కేవ‌లం ఆరుగురు కౌన్సిల‌ర్ల‌తో చైర్‌ప‌ర్స‌న్ భానుప్రియ‌ను అధికారం నుంచి దింపేయాల‌ని టీడీపీ ప్ర‌య‌త్నించి, బొక్క‌బోర్లా ప‌డింది.

ఇవాళ అవిశ్వాస తీర్మానంపై ఎన్నిక‌కు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఏర్పాటు చేసింది. దీంతో ఎంపీ గురుమూర్తి, రామ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ మేరుగ ముర‌ళీ అధికారాన్ని నిలుపుకోడానికి జాగ్ర‌త్త‌గా అడుగులు వేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టిన ఆరుగురు కౌన్సిల‌ర్లు ఇవాళ ఎన్నిక‌ను బ‌హిష్క‌రించారు. దీంతో వైసీపీ చైర్‌ప‌ర్స‌న్‌పై అవిశ్వాసం వీగిపోయిన‌ట్టైంది. మొత్తం 19 మంది వైసీపీ కౌన్సిల‌ర్లు సొంత పార్టీపై విశ్వాసం ఉంచారు.

ఈ సంద‌ర్భంగా తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తి మాట్లాడుతూ స్థానిక సంస్థ‌ల్లో మ‌రోసారి వైసీపీదే బ‌లం అని చాటి చెప్పామ‌న్నారు. వైసీపీ కౌన్సిల‌ర్లంతా ఏక‌తాటిపైకి వ‌చ్చి, అవిశ్వాస తీర్మానానికి వ్య‌తిరేకంగా ఓటు వేశార‌న్నారు. త‌మ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల అచంచ‌ల విశ్వాసానికి నిద‌ర్శ‌న‌మని ఆయ‌న అన్నారు. జ‌గ‌న్‌పై విశ్వాస‌మే వెంక‌టగిరి మున్సిపాల్టీని నిలుపుకునేలా చేసింద‌న్నారు.

అధికారంలో లేక‌పోయినా, పార్టీ కోసం నిల‌బ‌డిన కౌన్సిల‌ర్లంద‌రికీ ఆయ‌న పేరుపేరునా అభినంద‌న‌లు తెలిపారు. వెంక‌ట‌గిరి వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ విజ‌యం త‌మ‌ పార్టీలో ఐక్యతకు నిదర్శనమ‌న్నారు. రానున్న రోజుల్లో జ‌రిగే ప్ర‌తి ఎన్నిక‌లో వైసీపీదే విజ‌య‌మ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.

5 Replies to “వెంక‌ట‌గిరిలో టీడీపీకి షాక్‌.. వైసీపీపై విశ్వాసం!”

  1. ఏదో ఒకటో ఆరా నిలుపుకోవడం దానికి ఇంకా పెద్దగా బిల్డప్ ఇచ్చుకోవడం డానికే సరిపోతుంది మీ బతకంత . ఒక పక్కేమో ఐక్యంగా ఉన్నామని అంటున్నారు మరోపక్కేమో ఒక్కొక్కరే మెల్లగా జారిపోతున్నారు. మరి ఇదేమి లెక్కలో నీకే తెలియాలి రా గ్యాస్ ఆంధ్ర.

Comments are closed.