రాజ‌కీయ వ్య‌భిచారం

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైఖ‌రిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీతో పొత్తులో ఉంటూ, టీడీపీతో రాజ‌కీయ అవ‌గాహ‌న‌కు వ‌చ్చార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ప‌వ‌న్‌ను బీజేపీ నేత‌లు కూడా సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. ప‌వ‌న్ రాజ‌కీయ పంథా వైసీపీకి…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైఖ‌రిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీతో పొత్తులో ఉంటూ, టీడీపీతో రాజ‌కీయ అవ‌గాహ‌న‌కు వ‌చ్చార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ప‌వ‌న్‌ను బీజేపీ నేత‌లు కూడా సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. ప‌వ‌న్ రాజ‌కీయ పంథా వైసీపీకి ఆయుధంలా ఉప‌యోగ‌ప‌డుతోంది. కేవ‌లం చంద్ర‌బాబును సీఎం చేయ‌డానికే ప‌వ‌న్ వెంప‌ర్లాడుతున్నార‌నే విమ‌ర్శ‌ల‌కు బ‌లం చేకూర్చేలా ప‌వ‌న్ ప్ర‌వ‌ర్త‌న ఉంది.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ వ్య‌భిచారం చేస్తున్నాడ‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్‌కు నిల‌క‌డ‌లేద‌న్నారు. బీజేపీతో అంట‌కాగుతూ మ‌రోవైపు టీడీపీ ముసుగులో ప‌ని చేస్తున్నా డ‌ని త‌ప్పు ప‌ట్టారు. 

ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న రాజ‌కీయ వైఖ‌రిపై ప్ర‌జ‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తున్నారో చెప్పాల‌ని కోరారు. అలాగే పొత్తుల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.  

టీడీపీ నాయకులు వాపు చూసి బలుపని అనుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. 175 నియోజక వర్గాల్లో టీడీపీకి అభ్యర్థులు లేరన్నారు. అందుకే పొత్తులకు వెళ్తున్నారన్నార‌ని మంత్రి చెప్పుకొచ్చారు. ఇదిలా వుండ‌గా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మంత్రి వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ప‌వ‌న్‌ను వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యూహాత్మ‌కంగా రెచ్చ‌గొడుతున్నా, ఆయ‌న మాత్రం బ‌య‌ట ప‌డ‌డానికి ఇంకా స‌మ‌యం తీసుకునేలా వున్నారు.