ఈవీఎంల‌ను వాడితే పోటీ చేయ‌నని వైసీపీ నేత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈవీఎంల‌తోనే వ‌చ్చే ద‌ఫా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే తాను బ‌రి నుంచి త‌ప్పుకుంటాన‌ని రాచ‌మ‌ల్లు ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. మీడియాతో ఆయ‌న…

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈవీఎంల‌తోనే వ‌చ్చే ద‌ఫా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే తాను బ‌రి నుంచి త‌ప్పుకుంటాన‌ని రాచ‌మ‌ల్లు ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేయ‌డం వ‌ల్లే కూట‌మి అధికారంలోకి వ‌చ్చింద‌న్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈవీఎంల‌కు బ‌దులు బ్యాలెట్ పేప‌ర్ల‌ను వాడాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఒక‌వేళ ఈవీఎంల‌నే ఉప‌యోగిస్తే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేసే ప్ర‌స‌క్తే లేద‌ని ఆయ‌న తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈవీఎంల‌లో గోల్‌మాల్ వ‌ల్లే కూట‌మి అధికారంలోకి వ‌చ్చింద‌ని వైసీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈవీఎంల‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌పై కొన్ని చోట్ల వైసీపీ నాయ‌కులు న్యాయ పోరాటానికి కూడా దిగారు. అయితే ఆశించిన స్థాయిలో వ్య‌వ‌స్థ నుంచి స‌హ‌కారం ల‌భించ‌లేద‌న్న‌ది వైసీపీ ఆరోప‌ణ‌.

ఇటీవ‌ల హ‌ర్యానా ఎన్నిక‌ల్లో కూడా బీజేపీ మూడో ద‌ఫా విజ‌యంపై ఈవీఎంలలో ఏదో జ‌రిగింద‌న్న అనుమానాన్ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనుమానం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇప్ప‌టికీ బ్యాలెట్ విధానంలోనే ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. కావున దేశ వ్యాప్తంగా ఈవీఎంల వినియోగంపై చ‌ర్చ జ‌ర‌గాల‌ని ఆయ‌న డిమాండ్ చేయ‌డం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తాజాగా మాజీ ఎమ్మెల్యే ఈవీఎంల‌ను వాడితే అస‌లు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డ‌మే అన‌వ‌స‌రం అనే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రోవైపు రాచ‌మ‌ల్లు ప్ర‌క‌ట‌న‌ను టీడీపీ నేత‌లు ప‌బ్లిసిటీ స్టంట్‌గా కొట్టి పారేస్తున్నారు.

34 Replies to “ఈవీఎంల‌ను వాడితే పోటీ చేయ‌నని వైసీపీ నేత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌”

  1. ఆహా అవునా అలాగా నాయనా అలా అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్లో చక్కగా ఒకటి రెండు మూడు అని అంకులేసి మరి తీర్పులుస్తారు ప్రజలు వాటిలో పోటీ చేసి నీ సత్తా నిరూపించుకో 2023లో 3 ఎమ్మెల్సీల్లో చక్కగా అంకెలు వేసి మరి పెట్టారుగా మీకు గుం డు సున్నా ఇంకా సి గ్గు రాలేదా నాయనా

  2. EVM ప్రభుత్వం అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి తెచ్చుకున్న సీట్లు. అందుకే ఒక్కడు కూడా ఈవీఎం ల మీద మాట్లాడటం లేదు 😂😛🤣

  3. అవుడియా బాగుంది… పొట్టి జల్కం కూడా ఇలానే ప్రతిజ్ఞ చేస్తే ఆంధ్రకు దరిద్రం మొత్తం పోయినట్లే..

  4. మంగళవారం మాటలు ఆ మనం గెలిస్తే నీతి న్యాయం వేరే వాళ్ళు గెలిస్తే EVM.
    నీకేమైనా పిచ్చ GA ! ఎందుకు ఇలాంటి వి వాగిస్తారు
  5. బాబోయ్ ఈ సలహా ని అన్న కి మాత్రం చెప్పాబాకండి ….ఇదేదో సానుభూతి సింపతీ వర్కౌట్ అయ్యేలా ఉంది అని పార్టీ మూసేసి దుకాణం సర్దేసినా సర్దేస్తుంటాడు …..అసలే రాజకీయ వ్యూహాలు ప్లాన్ చేయడం ` లో మన అన్న ఎక్సపెర్ట్ ….

  6. మీ పార్టీ మొత్తం ఇదే డెసిషన్ తీసుకొండ్రా బాబు. ఆంధ్రా ప్రజలంతా మీకు సదా ఋణపడి వుంటారు.🙏

      1. రంగనాథ్ గారు, మీ నిరాశను మేము అర్థం చేసుకుంటున్నాము—మీరు మద్దతు ఇస్తున్న పార్టీకి ప్రజలు పెద్ద దెబ్బ కొట్టారు, 175 సీట్లలో కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కానీ ఇప్పుడు మీరు సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మీరు గౌరవనీయమైన పూజారి కుటుంబం నుండి వచ్చినవారు, మీ కుటుంబం విలువలు, జ్ఞానంతో ప్రసిద్ధి. మరి మీరు మొత్తం కాపు మరియు కమ్మ కులాలను ద్వేషించడం ఏ విధంగా సమర్థనీయమైంది? మీకు ఒకరిద్దరు వ్యక్తుల నుంచి చెడు అనుభవం ఉండొచ్చు, కానీ దాని కోసం మొత్తం కులాన్ని ద్వేషించడం ఎంతవరకు సరైనది? ఒక విద్యావంతుడు, సంస్కారవంతుడిగా మీరు ఇలా మొత్తం సమాజంపై ద్వేషం ప్రదర్శించడం మీకెలా సమంజసం అనిపించటం లేదు?

        మీరు పొందిన విద్య, మీ కుటుంబ గౌరవం ఏమిటి ఉపయోగం, ఇది కేవలం ద్వేషం, విభజన కోసం వాడితే? కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం, అలాగే అటువంటి ద్వేషాన్ని ప్రచారం చేసే వ్యక్తులను మద్దతు ఇవ్వడం మీకు మరెవరికన్నా ఎక్కువ హాని చేస్తుంది. ఇది శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. మీలో ఉన్న ఈ ద్వేషం, కుల పరమైన ద్వేషం మీ గుండెకు తీవ్రమైన ఒత్తిడిని పెంచి, భవిష్యత్తులో తీవ్రమైన గుండెపోటు (heart attacks) మరియు మానసిక సమస్యలను తెచ్చిపెడుతుంది.

        ఇది కేవలం రాజకీయాల గురించే కాదు, ఇది మీ ఆరోగ్యం, మీ మనశ్శాంతి, మీ మానవత్వం గురించీ కూడా. ద్వేషం మీ మనసును మరియు శరీరాన్ని శాంతిహీనంగా చేస్తుంది. ఈ మార్గంలో కొనసాగితే, మీరు మాత్రమే తీవ్ర నష్టాన్ని చవిచూస్తారు. ఇది చాలింది. మనం మనుషులం, కుల భేదాలకు మించి ఉండాలి. శాంతిని స్వీకరించండి, ఈ ద్వేషాన్ని వదిలేయండి, మీ గుండెను, మనసును, భవిష్యత్తును రక్షించుకోండి.

        ఈ చీకటి నుండి బయటపడండి మరియు శాంతియుతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించండి. దేవుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదించి, ఈ విధ్వంసకరమైన భావాల నుండి బయటపడే మార్గం చూపాలని కోరుకుంటున్నాను.

  7. నువ్వు పోటీ చెయ్యకపోతే మాకు దిక్కెవరన్నా?! మమ్మల్ని అనాధనలను చెయ్యొద్దన్నా!!…😀

  8. నీలాంటి వాడే ఎవడో చెరువు మీద అలిగి కడుక్కోవడం మానుకున్నాడంట. దేశానికి ఏమీ నష్టం లేదులే. అయినా పదేళ్ళు పదవిలో ఉండి నువ్వు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. నువ్వు మాత్రం అవినీతి సొమ్ము బాగా వెనకేసావు

  9. ప్రొద్దుటూరులో ఇతను చేసిన అరాచకం అంతా ఇంత కాదు… ఈవీఎంలు లేకపోతె రిగ్గింగ్ చేసి గెలవచ్చు అనా….

Comments are closed.