నాయకులంతే.. ప్రచారం పిచ్చి పోవడం కష్టం!

చంద్రబాబు నాయుడు మళ్లీ చంద్రన్న కానుక పథకాన్ని ప్రారంభిస్తున్నారు. విద్యారంగంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక కొత్త, ఆదర్శనీయమైన ఆలోచనను మిగిలిన విషయాల్లో కూడా వర్తింపజేయవచ్చునని వారు ఎందుకు అనుకోవడంలేదో తెలియదు. తన…

చంద్రబాబు నాయుడు మళ్లీ చంద్రన్న కానుక పథకాన్ని ప్రారంభిస్తున్నారు. విద్యారంగంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక కొత్త, ఆదర్శనీయమైన ఆలోచనను మిగిలిన విషయాల్లో కూడా వర్తింపజేయవచ్చునని వారు ఎందుకు అనుకోవడంలేదో తెలియదు. తన ప్రభుత్వం దిగిపోవాల్సి వస్తే.. ఖచ్చితంగా పథకం కూడా ఆగిపోవాలని, సదరు పథకాన్ని ప్రజలు కోరుకుంటే.. ఎప్పుడూ తన పార్టీని మాత్రమే ఎన్నుకుంటూ ఉండాలనే కోరికతో ఎందుకు వ్యవహరిస్తున్నారో కూడా తెలియదు.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఈదఫా గద్దె ఎక్కిన తర్వాత తీసుకున్న కొన్ని మంచి నిర్ణయాల్లో ప్రభుత్వ పథకాలకు.. పార్టీలతో నిమిత్తం లేకుండా.. ఆయా అంశాలతో అనుబంధం ఉన్న గొప్పవారి పేరు పెట్టడం చేస్తామని నిర్ణయించడం ఒకటి. విద్యారంగంలో అమలవుతున్న పథకాలకు జాతీయస్థాయి మహానుభావుల పేర్లు పెడతాం అంటూ లోకేష్ చాలా ఘనంగా ప్రకటించారు. మంచి నిర్ణయం అది.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఎన్టీఆర్, చంద్రబాబు పేర్లు పెట్టుకోవడం… వైసీపీ రాగానే అన్నింటినీ తొలగించి వైఎస్సార్, జగన్ పేర్లు పెట్టుకోవడం ప్రజలకు చాలా చీదరగా అనిపిస్తూ ఉంటుంది. లోకేష్ చేసిన ప్రకటన అభినందించదగినది. దానివల్ల ప్రభుత్వాలు మారినా ప్రజలకు పథకాలు అదేరీతిగా కొనసాగుతూ ఉంటాయి. పార్టీలు పేర్లు మారుస్తున్నాయనే చిన్నచూపుకూడా ఉండదు. విద్యారంగంలో అయితే అలాంటి నిర్ణయం ప్రభుత్వం ప్రకటించింది గానీ.. చంద్రబాబులో ఉన్న ప్రచార కాంక్ష పలచబడినట్టుగా మాత్రం లేదు.

ఇప్పుడు కుటుంబాలకు ఇచ్చే కానుకలకు చంద్రన్న కానుక అనే పేరుతో మళ్లీ ప్రారంభించబోతున్నారు. ఎందుకు? ఈ పథకానికి కూడా పార్టీ రహితంగా సార్వజనీనంగా ఒక పేరు పెడితే.. ఇప్పుడున్న సర్కారు స్వార్థచింతన లేకుండా ఆదర్శనీయమైన నిర్ణయాలు తీసుకుంటున్నదనే పేరు వస్తుంది కదా. ప్రభుత్వంలో ఎంతో కీలక భాగస్వామి అయిన పవన్ కల్యాణ్ ఎంతగానో విలువ ఇచ్చే డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టవచ్చు కదా.., అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.

చంద్రబాబు నాయుడు.. ఈ దఫా అధికారంలో ఉన్నప్పుడైనా.. తన పేరు పిచ్చితో కాకుండా.. సార్వజనీన ఆలోచనలతో అడుగులు వేస్తే.. రేపటి తరాలకు ఆదర్శంగా నిలుస్తారని ప్రజలు అనుకుటున్నారు.

14 Replies to “నాయకులంతే.. ప్రచారం పిచ్చి పోవడం కష్టం!”

    1. Alliance anedi future avasaraalaa kosam Jalaga vedhava oka gajjikukka vaaditho evaroo potthu pettukoru deenki grama simham single simham antoo build up

      Ippudu jalaga vedhava political ekaaki

  1. మా అన్నయ్య కి ప్రచారం అంటే అసలు గిట్టదు..

    మా ఆన్నయ్య కి విలువలు,విశ్వసనీయత ముఖ్యం..

    మా అన్నయ్య కి మాట తప్పడం మడమ తిప్పడం రాదు..

Comments are closed.