ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అక్రమల పేరుతో వైసీపీ నాయకులకు చెందిన భవనాలు, వైసీపీ అఫీసుల కూల్చివేతలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. నిన్న తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దగ్గర ఉండి వైసీపీ ఎంపీపీకి చెందిన భవనాన్ని కూల్చివేయాడానికి చేసిన హంగామా మార్చిపోక ముందే ఇవాళ కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడి భవనాన్ని కూల్చి వేయడానికి సిద్దం అయ్యారు.
కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో వైసీపీ నాయకుడు బళ్లా సూరిబాబు రాజ్యలక్ష్మీనగర్‌లో నగరపాలక సంస్థ అనుమతి లేకుండా భవనంపై మరో అంతస్తు నిర్మిస్తున్నరంటూ ఇటీవల నోటీసులు ఇచ్చి.. ఆయన నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇవాళ అధికారులు అదనపు అంతస్తు కూల్చివేతకు సిద్ధమయ్యారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అక్కడికి చేరుకోని కూల్చివేతను అడ్డుకోవడంతో పోలీసు అధికారులు ఆయన్నుఅదుపులోకి తీసుకోని కూల్చివేతకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ద్వారంపూడి మాట్లాడుతూ ప్రభుత్వం కావాలనే కక్షసాధింపులకు దిగుతోందని ఆరోపించారు. టార్గెటెడ్‌గానే ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వీటిపై న్యాయపోరాాటం చేస్తామని అన్నారు. కాగా ఇప్పటికే ద్వారంపూడి కంపెనీలు, ఆస్తులు టార్గెట్‌గా జనసేన ముఖ్యనాయకులు దృష్టి పెట్టారు. మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారంపూడికి చెందిన పరిశ్రమల్లో కాలుష్యానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.