న్యాయ‌వాదుల‌పై టీడీపీ దౌర్జ‌న్యం

చివ‌రికి న్యాయ‌వాదుల్ని కూడా టీడీపీ నేత‌లు విడిచిపెట్ట‌లేదు. అది కూడా కూట‌మి అనుకూల న్యాయ‌వాదుల‌ని గుర్తింపు పొందిన న్యాయ వాదుల కార్యాల‌యాల‌పై తిరుప‌తి న‌గ‌ర అధ్య‌క్షుడు చిన్న‌బాబు నేతృత్వంలో దాడులు జ‌ర‌గ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.…

చివ‌రికి న్యాయ‌వాదుల్ని కూడా టీడీపీ నేత‌లు విడిచిపెట్ట‌లేదు. అది కూడా కూట‌మి అనుకూల న్యాయ‌వాదుల‌ని గుర్తింపు పొందిన న్యాయ వాదుల కార్యాల‌యాల‌పై తిరుప‌తి న‌గ‌ర అధ్య‌క్షుడు చిన్న‌బాబు నేతృత్వంలో దాడులు జ‌ర‌గ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన‌ప్ప‌టి నుంచి ప్ర‌త్య‌ర్థుల‌పై భౌతిక‌దాడులు, హ‌త్య‌ల గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

అలాగే ప్ర‌త్య‌ర్థుల వ్యాపార స‌ముదాయాల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని పెద్ద ఎత్తున వార్త‌లొచ్చాయి. అయితే ఇంత వ‌ర‌కూ ఏ ప్ర‌భుత్వంలోనూ న్యాయ‌వాదుల‌తో గొడ‌వ పెట్టుకున్న వాళ్లు లేరు. ఆ రికార్డును టీడీపీ న‌గ‌ర అధ్య‌క్షుడు చిన్న‌బాబు బ‌ద్ద‌లు కొట్టార‌ని సొంత పార్టీ నుంచి విమ‌ర్శ‌లొస్తున్నాయి.

తిరుప‌తి మ‌హ‌తి ఎదురుగా కోర్టు రోడ్డులో ముక్కు స‌త్య‌వంతుడు రిటైర్ట్ జిల్లా జ‌డ్జి గుర్ర‌ప్ప‌నాయుడు, ర‌మేశ్‌రెడ్డి, మ‌ధుసూద‌న్‌నాయుడు తదిత‌ర న్యాయ‌వాదులు కార్యాల‌యాల‌ను న‌డుపుతున్నారు. అయితే అద్దె కార్యాల‌యాల్ని వెంట‌నే ఖాళీ చేయాలంటూ టీడీపీ న‌గ‌ర అధ్య‌క్షుడు న్యాయ‌వాదుల‌కు హుకుం జారీ చేశారు. ఏదైనా వుంటే భ‌వ‌న య‌జ‌మానితో మాట్లాడుకుంటామ‌ని, మ‌ధ్య‌లో మీరెవ‌ర‌ని న్యాయ‌వాదులు టీడీపీ నాయ‌కుడిని ప్ర‌శ్నించారు.

దీంతో అధికార పార్టీకి చెందిన త‌న‌ను ప్ర‌శ్నించ‌డాన్ని చిన్న‌బాబు జీర్ణించుకోలేక‌పోయారు. త‌న‌నే ప్ర‌శ్నిస్తారా? మీరెలా వుంటారో చూస్తాన‌ని చిన్న‌బాబు నేతృత్వంలో కొంద‌రు టీడీపీ కార్య‌క‌ర్త‌లు అక్క‌డికెళ్లి దౌర్జ‌న్యానికి తెగ‌బ‌డ్డారు. భవ‌నానికి సంబంధించి గేట్ల‌ను, గోడ‌ల‌ను ధ్వంసం చేశారు. దీంతో పెద్ద ఎత్తున జ‌నం గుమికూడారు.

పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. ఏదైనా స‌మ‌స్య వుంటే చ‌ట్ట‌ప‌రంగా తేల్చుకోవాల‌ని పోలీసులు హిత‌వు చెప్పారు. దౌర్జ‌న్యానికి దిగితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు చిన్న‌బాబును హెచ్చ‌రించారు. త‌మ కార్యాల‌యాల‌పై టీడీపీ న‌గ‌ర అధ్య‌క్షుడు దాడికి తెగ‌బ‌డ‌డం వెనుక భారీగా డ‌బ్బులు చేతులు మారిన‌ట్టు న్యాయ‌వాదులు ఆరోపిస్తున్నారు. న్యాయ వాదుల‌పైన్నే అధికార పార్టీ నాయ‌కులు దౌర్జ‌న్యానికి దిగితే, ఇక సామాన్యుల ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా వుంటుందో అర్థం చేసుకోవ‌చ్చ‌ని బాధితులు వాపోతున్నారు.

7 Replies to “న్యాయ‌వాదుల‌పై టీడీపీ దౌర్జ‌న్యం”

    1. ప్రియమైన లోకనాథరావు గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పినట్లు, మీరు మీ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా కాపు, కమ్మ కులాల మీద మీకున్న తీవ్రమైన ద్వేషంతో జీవిస్తున్నారని చెప్పాలి. మీరు ఎప్పుడూ కులం, కులం, కులం అని మాత్రమే మాట్లాడుతూ, కులాధారిత ద్వేషాన్ని ప్రోత్సహిస్తారు. ఈ ద్వేషం మీ మెదడులో తీవ్ర ఆవేశాన్ని నింపి, అది మీకు గుండె సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. కుల ద్వేషం వలన మీకు ఈ గుండె సమస్యలు రావడం ఎంత దురదృష్టకరం. కులం ఆధారంగా ద్వేషాన్ని పెంచుకోవడం వల్ల మీకు ఏమీ ఉపయోగం లేదు. మీలాంటి వారు, రంగనాథ్ లాంటి వారు ఎప్పుడూ కమ్మ, కాపు కులాలపై ద్వేషం పెంచుకోవడం వలన, అది మిమ్మల్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, మీరు ఇంకా మీ అసభ్యకరమైన స్వభావంతో కొనసాగుతూనే ఉన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ద్వేషించి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు 175 స్థానాల నుండి. మీకు సిగ్గు లేదా? ఈ జీవితాంతం కుల ద్వేషం ప్రోత్సహించడం ఏందుకు? ఇంత మంచి విద్య పొందిన మీరు, మీ చివర్లో సిగ్గులేని ఆలోచనలు చేయడం ఎంత దౌర్భాగ్యం.

      4o

Comments are closed.