చంద్ర‌బాబు పీఎస్‌పై మంత్రులు, ఎమ్మెల్యేల గుర్రు!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి పీఎస్ క‌ప్ప‌ర్థిపై మంత్రులు, కూట‌మి ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. చంద్ర‌బాబును క‌ల‌వ‌నీయ‌కుండా, అలాగే ఆయ‌న దృష్టికి ఏ విష‌యాన్ని తీసుకెళ్ల‌కుండా పీఎస్ అడ్డంకిగా నిలిచార‌ని వాళ్లంతా మండిప‌డుతున్నారు. ఇలాగైతే ముఖ్య‌మంత్రి…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి పీఎస్ క‌ప్ప‌ర్థిపై మంత్రులు, కూట‌మి ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. చంద్ర‌బాబును క‌ల‌వ‌నీయ‌కుండా, అలాగే ఆయ‌న దృష్టికి ఏ విష‌యాన్ని తీసుకెళ్ల‌కుండా పీఎస్ అడ్డంకిగా నిలిచార‌ని వాళ్లంతా మండిప‌డుతున్నారు. ఇలాగైతే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి చెడ్డ పేరు వ‌స్తుంద‌నే ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. క‌ప్ప‌ర్థి వ్య‌వ‌హార శైలిపై టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి జీవీరెడ్డి ఆ పార్టీ అనుకూల చాన‌ల్‌లో ఘాటు కామెంట్స్ చేశారు.

క‌నీసం ఫోన్ చేసినా క‌ప్ప‌ర్థి స్పందించ‌డం లేద‌ని, బాబు గారితో క‌ల‌వ‌నీయ‌డం లేదంటూ క‌ప్ప‌ర్థిపై జీవీరెడ్డి మండిప‌డ్డారు. క‌ప్ప‌ర్థి సీఎంవోలో కొన‌సాగితే చెడ్డ‌పేరు వ‌స్తుంద‌ని జీవీ రెడ్డి వాపోయారు. క‌ప్ప‌ర్థికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే, క‌సురుకుంటున్నార‌ని స‌మాచారం. క‌నీసం మ‌ర్యాద లేకుండా క‌ప్ప‌ర్థి మాట్లాడుతున్నార‌ని మంత్రులు సైతం ఆఫ్ ది రికార్డుగా ఆవేద‌న చెందుతున్నారు.

చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఏదో జ‌రుగుతుంద‌ని ఆశించామ‌ని, కానీ ఆచ‌ర‌ణ‌లో మాత్రం నిరాశ క‌లిగిస్తోంద‌ని మంత్రులు, ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఇలాంటి రాజ‌కీయ ప‌రిణామాలుంటాయ‌ని అస‌లు ఊహించ‌లేద‌ని వాళ్లంతా చెబుతున్నారు. క‌ప్ప‌ర్థిపై టీడీపీలో అంత‌ర్గ‌తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

సీఎం చంద్ర‌బాబుకు కప్ప‌ర్థి ప్ర‌భుత్వ పీఎస్‌. క‌ప్ప‌ర్థి ఎవ‌రినీ లెక్క చేయ‌డం లేద‌నే ఆరోప‌ణ బ‌లంగా వుంది. అయితే ఒక‌రిద్ద‌రైతే బాబుతో మాట్లాడిస్తార‌ని, పెద్ద సంఖ్య‌లో ఉన్న‌ప్పుడు ఎలా సాధ్య‌మ‌ని మ‌రికొంద‌రు టీడీపీ నేత‌లు అంటున్నారు. ప్ర‌స్తుతానికైతే క‌ప్ప‌ర్థి తీరుపై టీడీపీలో తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మవుతున్నాయి.

7 Replies to “చంద్ర‌బాబు పీఎస్‌పై మంత్రులు, ఎమ్మెల్యేల గుర్రు!”

  1. A true leader should learn the art of delegation. But CBN never seems to have mastered it, mainly because he never trusts any one. While Jagan over delegates his duties, CBN tries to manage everything by himself and fails.

Comments are closed.