ప‌ర‌మ భ‌క్త వైసీపీ నేత మాట్లాడ‌రేం?

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై ప‌ర‌మ భ‌క్త వైసీపీ నేత మాట్లాడ‌క‌పోవ‌డంపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల ప్ర‌సాదాన్ని క‌ల్తీ చేశారంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వివాదాస్ప‌ద ఆరోప‌ణ‌లు చేశారు.…

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై ప‌ర‌మ భ‌క్త వైసీపీ నేత మాట్లాడ‌క‌పోవ‌డంపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల ప్ర‌సాదాన్ని క‌ల్తీ చేశారంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వివాదాస్ప‌ద ఆరోప‌ణ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో తిరుమ‌ల‌తో ఎంతో అనుబంధం ఉన్న క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి, అలాగే వైఎస్ జ‌గ‌న్‌కు ప‌ర‌మ భ‌క్తుడైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి మాట్లాడ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.

వైసీపీ హ‌యాంలో తుడా చైర్మ‌న్ ప‌ద‌విని ద‌క్కించుకుని, ఎక్స్ అఫీషియో మెంబ‌ర్‌గా టీటీడీ బోర్డులో స‌భ్య‌త్వాన్ని చెవిరెడ్డి ద‌క్కించ‌కోవ‌డాన్ని నెటిజ‌న్లు గుర్తు చేస్తున్నారు. ఆ త‌ర్వాత త‌న కుమారుడిని తుడా చైర్మ‌న్‌గా నియ‌మించుకుని, టీటీడీ బోర్డులో స్థానం పొందేలా చక్రం తిప్పారు. అయితే త‌న కుమారుడి వ‌య‌సు త‌క్కువ కావ‌డంతో ఏకంగా ఎండోమెంట్ చ‌ట్టాన్నే వైఎస్ జ‌గ‌న్‌తో స‌వ‌రించుకున్నార‌ని, ఇప్పుడు పార్టీకి కీల‌క స‌మ‌యంలో గ‌ళం అవ‌స‌రం అయిన స‌మ‌యంలో చెవిరెడ్డి నోరు మెద‌ప‌క‌పోవ‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

పైగా టీటీడీ కొనుగోలు క‌మిటీలో చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి స‌భ్యుడు. ఇదే క‌మిటీలో ప్ర‌స్తుత మంత్రి పార్థ‌సార‌థి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి కూడా కొనుగోలు క‌మిటీలో స‌భ్యులు. నెయ్యి కొనుగోలుపై చెవిరెడ్డి మాట్లాడ్డంతో పాటు నాడు త‌న‌తో పాటు స‌భ్యులైన పార్థ‌సార‌థి, ప్ర‌శాంతిరెడ్డిల‌ను కూడా మాట్లాడించాల‌నే డిమాండ్ వైసీపీ నాయ‌కులు, నెటిజ‌న్ల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. ఆ ప‌ని ఎందుకు చేయ‌డం లేద‌నే నిల‌దీత ఎదుర‌వుతోంది.

నాడు వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో అధికారాన్ని బాగా వాడుకున్న నాయ‌కుల్లో చెవిరెడ్డి కూడా ఒక‌రు. ఇప్పుడు కూడా ఆయ‌న జ‌గ‌న్‌కు నీడ‌లా ఉంటున్నారు. మ‌రెందుక‌ని చెవిరెడ్డి కీల‌క స‌మ‌యంలో మౌనాన్ని ఆశ్ర‌యించారో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. తాను మెంబ‌ర్‌గా ఉన్న‌ టీటీడీ పాల‌క మండ‌లి ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని తిరుమ‌ల‌కు వెళ్లి చెవిరెడ్డి స‌త్య ప్ర‌మాణం చేయ‌డం ద్వారా టీడీపీని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసే అవ‌కాశం వుంది. క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామికి చెవిరెడ్డి ఎంత‌టి ప‌ర‌మ భ‌క్తుడంటే త‌న స్వ‌గ్రామం తుమ్మ‌ల‌గుంట‌లో కూడా అద్భుత‌మైన శ్రీ‌వారి ఆల‌యాన్ని నిర్మించారు. తుమ్మ‌ల‌గుంట‌లో కూడా బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హిస్తుంటారు.

చెవిరెడ్డికి ఎక్క‌డైనా ఆల‌యాలు క‌నిపిస్తే చాలు.. కాసేపు ఆగి క‌ళ్ల‌క‌ద్దుకోనిదే ముందుకు క‌ద‌ల‌రు. అలాంటి చెవిరెడ్డి కీల‌క‌మైన ఈ త‌రుణంలో మౌనాన్ని పాటించ‌డం ద్వారా, బాబు ఆరోప‌ణ‌ల‌కు బ‌లం క‌లిగించిన‌ట్టు అవుతుంది. కావున ఇప్ప‌టికైనా జ‌గ‌న్ భ‌క్తుడైన చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి తిరుమ‌ల ప్ర‌సాదంపై నిజాలేంటో చెప్పి, గ‌తంలో త‌న‌తో పాటు ఉన్న పార్థ‌సార‌థి, వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డిల‌తో చెప్పించాల్సిన బాధ్య‌త ఎంతైనా వుంది.

31 Replies to “ప‌ర‌మ భ‌క్త వైసీపీ నేత మాట్లాడ‌రేం?”

  1. తప్పు తెలుసు కాబట్టే తప్పుకున్నాడు GA…. ఆ ఘోరాన్ని చూడలేకే మిగిలిన వాళ్ళు కూడా పార్టీ మారి వుంటారు పాపం…..

  2. ఈ పుష్ప గారు శేషాచలం అడవుల్లో గంధం చెట్టులు కొట్టడానికి డ్యూటీ కి వెళ్లి వుంటారు ఏమో. లారీ లు ప్యాలస్ లో కనిపించడం లేదు.

  3. తన భర్త మీద వచ్చి నా ఆరోపణలు సొంత భార్య కూడా ఖండించలేదు. వదినమ్మ నీ కూడా అడగాలి కదా ఈ ప్రశ్న.

    అప్పట్లో తిరుమల గుడి సెట్టింగ్ వేసుకుని డెముడునే తమ కాళ్ళ దగ్గర తెచ్చుకున్నారు కదా, అది నిజం ఐతే తిరుమల ప్రసాదం తినడానికి వదినమ్మ కి వచ్చిన కష్టం ఏమిటి?

  4. అధికారంలో ఉన్నపుడు తిరుమల కు వెళ్ళటం కాదు, ఈ 5 సంవత్సరాలలో భక్తుడు జగన్ ను తిరుమల కు ఒక్క సారైనా వెళ్ళమను, వెళ్లే ప్రయత్నం చేసినా సరిపోతుంది.

    1. This is too much to ask.. why he will go to tirumala.. He is converted christian.. we should accept it.. and he is very much loyal to his religion… enta loyal ante.. Hindu temple ni destroy chesesta loyal. we should not expect that he will go to tirumala

      1. True, that idiot entered Hindu’s holy place of worship, by force using Power as if he is a devotee of the Lord. So, if he is a true devotee he should attempt to enter, to prove his true devotion is not a drama.

      2. True, that_idiot entered Hindu’s holy place of worship, by force using Power as if he is a devotee of the Lord. So, if he is a true devotee he should attempt to enter, to prove his true devotion is not a drama.

        1. catch my point.. he is shameless so he can enter… But we should we worried / shameful to see him entering into the temple. Are you ready to watch him entering Tirumala temple again?

        2. Catch this point.. he is shameless** so he can enter, But we should be worried if he enters. are you ready to watch him entering into the temple* again? I am not ready.

  5. ఇంత ఆక్రోశంతో ఇన్ని రాతలు రాసేకంటే ఆ మెంటలోడిని వదిలేసి వేరే పార్టీకి జంప్ అయిపో. ఇంకో 6మంత్స్ తర్వాత నీకు ప్యాకేజీ కూడా ఇవ్వలేకపోవచ్చు.

    1. శాఖహారులందరితోనూ మాంసాహారం తినిపించిన మొనగాడు జగనన్న. కేజీ 1400 costly కొవ్వు అట, బలవర్థకమైన లడ్డు.

  6. పాపం, ఎన్ని ఆపసోపాలూ పడుతున్నావురా. అసలు దొంగలు కూడా నీ అంత బాధపడటం లేదు.

  7. Ee Satya pramanam concept ento. Devuni meeda bhayam bhakti unte kalti cheyyaru. Vallu pramanam cheyyakkarledu. Leni vallu kalti chestaru. Vallaki pramanam cheyyadaniki bhayam undadu. So vallu pramanam chesina prayojanam ledu. Intha chinna logic Ela miss ayyav GA.

  8. సత్య ప్రమాణాలు చేస్తే సరిపోయేదానికి .. ఊరకనే మన మాజీ పొన్ను గారిని సుప్రీమ్ కోర్ట్ ఎందుకు పంపించారు .. ఒక టన్ను కర్పూరం కొనేసి .. మొత్తం వైసీపీ బ్యాచ్ ని రోజు వారి తిరుమల పంపించి ప్రమాణాలు చేస్తే సరిపోద్దిగా …

  9. ఏమి మాట్లాడాలి ఆయనా .. ఎందుకు మాట్లాడాలి …ఎంత రాచరికం వెలగబెట్టినా… మతం విషయం లో మన మాజీ సీఎం ఎన్నో వేషాలు వేసాడు, లేకపోతే …. జనాలు తంతారని అప్పట్లో గుడికెళ్ళాడు కానీ భక్తి ఉంది కాదు అనే విషయము తెలుసుకాబట్టి మాట్లాడడు

    ఇకపోతే..ల్యాబ్ రిపోర్ట్ లో కల్తీ అయ్యింది అని వచ్చింది రా అయ్యా…అంటే అది ఎప్పుడో వచ్చింది కదా ఇప్పుడెందుకు చెప్పావ్ అంటున్నారు , నందిని నీ ఎందుకు తీసేసావ్ అంటే L1 rate వచ్చింది అంటాడు , ట్యాంకర్ లోపలికి వెళ్ళలేదు కదా అంటాడు… ఏంటో అదో రకం

  10. కౌన్సిలర్ స్థాయి నేతని ఒంగోలు ఎంపీ స్థాయి ఇచ్చి నుంచోబెట్టినా చెవిరెడ్డి మాట్లాడడం లేదని ఎంకటి బాధ..

Comments are closed.