మాకు విలువ ఇవ్వ‌రా… బాబు, లోకేశ్‌ల‌పై గుస్సా!

నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ టీడీపీలో ర‌చ్చ‌కు దారి తీస్తోంది. ప‌ద‌వులు వ‌చ్చిన నాయ‌కులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. రాని వారు గుర్రుగా ఉన్నారు. రెండో జాబితాపై ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే నామినేటెడ్ పోస్టుల‌కు అభ్య‌ర్థుల‌ను…

నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ టీడీపీలో ర‌చ్చ‌కు దారి తీస్తోంది. ప‌ద‌వులు వ‌చ్చిన నాయ‌కులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. రాని వారు గుర్రుగా ఉన్నారు. రెండో జాబితాపై ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే నామినేటెడ్ పోస్టుల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌డంలో క‌నీసం త‌మ అభిప్రాయాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని మంత్రులు, ఎమ్మెల్యేలు మండిప‌డుతున్నారు. ప‌ద‌వుల భ‌ర్తీలో ఏ కొద్ది మంది సీనియ‌ర్ ప్ర‌జాప్ర‌తినిధుల అభిప్రాయాల్ని మాత్ర‌మే ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నార‌ని స‌మాచారం.

టీడీపీ కోసం ఎవ‌రెవ‌రు ప‌ని చేశారో వివిధ మార్గాల ద్వారా తాము తెప్పించుకున్న నివేదిక‌ల ఆధారంగా మాత్ర‌మే నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ చేప‌ట్టార‌ని మంత్రులు, కూట‌మి ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఇలాగైతే త‌మ‌కు చంద్ర‌బాబు, లోకేశ్ ఏం విలువ ఇస్తున్న‌ట్టని వారు ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ సంద‌ర్భంలో స‌ర్వ సాధార‌ణంగా స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ల సిఫార్సుల‌ను చంద్ర‌బాబు, లోకేశ్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి వుంది. గ‌తంలో చంద్ర‌బాబు అలా చేసేవారు.

లోకేశ్ చేతిలోకి అధికారం పోయిన త‌ర్వాత‌, ఆయ‌న‌కు స‌న్నిహితులైన వాళ్ల‌కు మాత్ర‌మే ప్రాధాన్యం ల‌భిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు ఉమ్మ‌డి చిత్తూరు జిల్లానే తీసుకున్నాం. ర‌వినాయుడికి నామినేటెడ్ ప‌ద‌వి ల‌భించింది. ఎమ్మెల్యే టికెట్ ద‌క్క‌ని మాజీ ఎమ్మెల్యేలు సుగుణ‌మ్మ‌, ఎస్సీవీనాయుడు త‌దిత‌రుల‌ను అస‌లు ప‌ట్టించుకోలేదు. ఇంకా అనేక ప‌ద‌వులున్నాయ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ, ప్ర‌స్తుతం భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను చూస్తే, ఏదో తేడా కొడుతోంద‌న్న ఆందోళ‌న నేత‌ల్లో వుంది.

లోకేశ్‌తో స‌న్నిహితంగా వుంటేనే ప‌ద‌వులు వ‌స్తాయ‌నే చ‌ర్చ టీడీపీలో విస్తృతంగా సాగుతోంది. అందుకే కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు లోకేశ్‌పై కోపంగా ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా ప‌ద‌వుల విష‌యంలో మీకేం కావాల‌ని అడ‌గ‌డం లేదు. చంద్ర‌బాబు, లోకేశ్ త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్టు భ‌ర్తీ చేస్తున్నార‌నే వాద‌న కూడా లేక‌పోలేదు.

3 Replies to “మాకు విలువ ఇవ్వ‌రా… బాబు, లోకేశ్‌ల‌పై గుస్సా!”

  1. జగన్ అందరిని అడిగే ఇచ్చాడా ? వాడు వాడి కోటరీ ఏ కదా నిర్ణయించింది . మ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించి మంత్రులని చేసినది చాలదా .. ప్రతీది మ్మెల్యే /ఎంపీ లని అడిగే చెయ్యాలా .

Comments are closed.