టీడీపీలో చేర‌డానికి సిద్ధంగా క‌డ‌ప కార్పొరేట‌ర్లు

వైఎస్ జ‌గ‌న్‌కు అత్యంత బ‌ల‌మైన క‌డ‌ప‌లో ఆయ‌న్ను రాజ‌కీయంగా దెబ్బ‌తీయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

వైసీపీకి వైఎస్సార్ క‌డ‌ప జిల్లా రాజ‌కీయంగా అడ్డా అనే పేరు వుంది. కంచుకోట లాంటి ఆ జిల్లాలో ఆరు నెల‌ల క్రితం జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ బాగా దెబ్బ‌తింది. వైఎస్ జ‌గ‌న్‌కు అత్యంత బ‌ల‌మైన క‌డ‌ప‌లో ఆయ‌న్ను రాజ‌కీయంగా దెబ్బ‌తీయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇందుకు క‌డ‌ప ఎమ్మెల్యే ఆర్‌.మాధ‌విరెడ్డి శ్రీ‌కారం చుట్టారు.

క‌డ‌ప‌లో 15 నుంచి 20 మంది వైసీపీ కార్పొరేట‌ర్ల‌ను టీడీపీ చేర్చుకోడానికి ఎమ్మెల్యే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప‌థ‌కాన్ని వ్యూహాత్మ‌కంగా చేప‌ట్టారు. వారంలోపు వీళ్లంద‌ర్నీ సీఎం చంద్ర‌బాబు లేదా లోకేశ్ స‌మ‌క్షంలో టీడీపీ కండువా క‌ప్పుకునేలా ఒప్పించార‌ని తెలిసింది.

రానున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ వాళ్ల‌కే సీట్లు ఇవ్వ‌డంతో పాటు రాజ‌కీయంగా ప్రాధాన్యం ఇస్తామ‌నే హామీ ఇచ్చిన‌ట్టు తెలిసింది. అధికార పార్టీలోకి వెళితే, ఆర్థికంగా ల‌బ్ధి పొందొచ్చ‌నే ఆలోచ‌న‌తో కొంద‌రు కార్పొరేట‌ర్లు అటు వైపు మొగ్గు చూపుతున్నార‌ని తెలిసింది.

మ‌రీ ముఖ్యంగా క‌డ‌ప కార్పొరేష‌న్‌ను హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌ని ఎమ్మెల్యే మాధ‌వీ పావులు క‌దుపుతున్నారు. ఎలాగైనా మేయ‌ర్ పీఠం మీద నుంచి సురేష్‌బాబును దింపాల‌నేది ఆమె ఆశ‌యం. అయితే ప్ర‌స్తుతానికి ఆ ప‌ని చేయ‌డానికి మ‌రింత మంది కార్పొరేట‌ర్లు అవ‌స‌రం. ఈ 15-20 మంది సరిపోరు. ముందు కొంద‌రిని పార్టీలో చేర్చుకుంటే, మిగిలిన వాళ్లు కూడా వ‌స్తార‌ని టీడీపీ ఆలోచ‌న‌.

4 Replies to “టీడీపీలో చేర‌డానికి సిద్ధంగా క‌డ‌ప కార్పొరేట‌ర్లు”

  1. మావోడు ప్యాలెస్ లో అదీ నాలుగ్గోడల మధ్య ఒంగుని కళ్ళు మూసుకుని ఉన్నాడు.. మీరు ఇలా రెచ్చగొడితే

    A1కళ్ళు &గుద్ద తెరిచి మరో భోపాల్ గ్యాస్..చేస్తాడు

    1. Jagan ni thiditene/(scolding) kani niku food dorike paristiti lenattu undi ..ni dustiti chusi Bada vestundi Bro..Take care ela ne 100 years bhatiki Jagan koti Rai .

Comments are closed.