టాలీవుడ్ లోకి పెళ్లి సందడి చేసుకుంటూ సర్రున దూసుకువచ్చింది శ్రీలీల. ఆ ఊపులో చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ అయిన తరువాత ఇంకా దూసుకు వెళ్లింది. గుంటూరు కారంతో శ్రీలీల కెరీర్ పీక్ కు వెళ్లిపోయింది. కానీ చాలా సినిమాలు ఫ్లాప్ కావడంతో బ్రేక్ పడినట్లు అయింది. కానీ ఇప్పుడు మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఇటీవల చేసిన పుష్ప ఐటమ్ సాంగ్ శ్రీలీల కెరీర్ ను మళ్లీ స్పీడప్ చేసింది.
అక్కినేని అఖిల్ సినిమాలో శ్రీలీల నటించబోతోంది. వినరో భాగ్యము విష్ణుకథ అందించిన డైరక్టర్ తో అన్నపూర్ణ బ్యానర్ లో నిర్మించే సినిమా కోసం శ్రీలీల ను తీసుకున్నారు. విశేషమేమిటంటే తొలిసారిగా అన్నపూర్ణ బ్యానర్ -సితార బ్యానర్ తో కలిసి సినిమా నిర్మించబోతోంది.
ఇదిలా వుంటే విరూపాక్ష సినిమా దర్శకుడు నాగ్ చైతన్యతో రూపొందించే సినిమాకు కూడా శ్రీలీలను తీసుకుంటున్నారు. అంటే అన్నదమ్ముల ఇద్దరితో ఒకే సారి హీరోయిన్ గా శ్రీలీల నటించబోతోంది.
ఇప్పటికే రవితేజ తో సితార లో సినిమా జరుగుతోంది.
అదే సితార బ్యానర్ లో జరిగే సిద్దు జొన్నలగడ్డ సినిమాకు కూడా శ్రీలీల హీరోయిన్ గా ఫైనల్ అయింది.
అంటే ఒక్క సితార బ్యానర్ లోనే మూడు సినిమాలు అన్నమాట. మొత్తం మీద శ్రీలీల ఇప్పుడు ఫుల్ జోష్ లో వుంది.
అఖిల్ తో అశ్వర్య నటించిన అప్పలమ్మ్ నటించిన ఒకటే అది పోయే సినిమా కాబట్టి . వాడు సినిమాలు కి పనికి రాడు . వాళ్ళకి లేడీస్ ఉంటే చాలు
నీకు సినిమాలు ఎందుకురా ఎదవ …
ఎవరికిరా నీకా సన్నాసి