జ‌గ‌న్‌తో క‌లిసొచ్చే పార్టీలున్నాయా?

క‌ష్టం వ‌స్తే త‌ప్ప‌, బీజేపీ కాకుండా ఇత‌ర రాజ‌కీయ పార్టీలున్నాయ‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి గుర్తు రాలేదు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అంటే భ‌యంతో కాబోలు, జాతీయ‌స్థాయిలో ఇత‌ర పార్టీల‌తో వైసీపీ…

క‌ష్టం వ‌స్తే త‌ప్ప‌, బీజేపీ కాకుండా ఇత‌ర రాజ‌కీయ పార్టీలున్నాయ‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి గుర్తు రాలేదు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అంటే భ‌యంతో కాబోలు, జాతీయ‌స్థాయిలో ఇత‌ర పార్టీల‌తో వైసీపీ ఏనాడూ క‌లిసి న‌డ‌వ‌లేదు. త‌న‌దో రాజ‌కీయ పార్టీ అనే విష‌యాన్ని ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ విస్మ‌రించారు. స్వ‌తంత్రంగా రాజ‌కీయాలు చేయాల‌నే సంగ‌తిని మ‌రిచిపోవ‌డం వ‌ల్లే నేడు ఒంట‌రిగా మిగలాల్సిన ద‌య‌నీయ స్థితి.

క‌నీసం ఇప్పుడైనా జ‌గ‌న్‌కు జ్ఞానోద‌యం అయితే మంచిదే. ఏపీలో అరాచ‌క పాల‌న‌ను నిర‌సిస్తూ ఈ నెల 24న ఢిల్లీలో ధ‌ర్నా నిర్వ‌హించాల‌ని వైఎస్ జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఈ ధ‌ర్నాకు అన్ని పార్టీల‌ను ఆహ్వానించాల‌ని ఆయ‌న అనుకోవ‌డం వైసీపీకి రాజ‌కీయ కోణంలో శుభ‌ప‌రిణామం. అయితే వైసీపీని న‌మ్మి ఎన్ని రాజ‌కీయ పార్టీలు ముందుకొస్తాయ‌నేదే ప్ర‌శ్న‌.

ఇటీవ‌ల లోక్‌స‌భ‌లో చంద్ర‌బాబునాయుడిపై తృణ‌ముల్ కాంగ్రెస్ ఎంపీ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్లే చంద్ర‌బాబు నీతిమంతుడ‌య్యాడా? అని స‌ద‌రు ఎంపీ నిల‌దీసిన సంగ‌తి తెలిసిందే. బీజేపీ చేష్ట‌ల్ని త‌ప్పు ప‌ట్టే క్ర‌మంలో టీఎంసీ ఎంపీ త‌న‌కు తానుగా బాబుపై విమ‌ర్శ‌లు చేశారే త‌ప్ప‌, ఇందులో వైసీపీ గొప్ప‌త‌నం ఏదీ లేదు.

ఈ నేప‌థ్యంలో ఏపీలో దారుణ ఓట‌మి మూట‌క‌ట్టుకున్న వైసీపీపై టీడీపీ తీవ్ర‌స్థాయిలో దాడులు చేస్తోంది. ఈ క్ర‌మంలో వినుకొండ‌లో వైసీపీ కార్య‌క‌ర్త ర‌షీద్‌ను అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లిన సంద‌ర్భంలో ఢిల్లీలో ధ‌ర్నా ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ధ‌ర్నాకు ఇత‌ర పార్టీల‌ను కూడా ఆహ్వానించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం.

గ‌త ఐదేళ్ల‌లో వైసీపీ ఏనాడూ విప‌క్షాల ఆందోళ‌న‌ల‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన సంద‌ర్భం లేదు. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల‌లో మోదీ స‌ర్కార్ తీసుకొచ్చిన ప్ర‌తి బిల్లుకు వైసీపీ క‌ళ్లు మూసుకుని మ‌ద్ద‌తు ఇవ్వ‌డం తెలిసిందే. ఇప్పుడు కూడా కేవ‌లం టీడీపీని మాత్ర‌మే వైసీపీ విమ‌ర్శిస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామి అయిన బీజేపీపై విమ‌ర్శ‌లు చేయ‌డానికి వైసీపీ ముందుకు రావ‌డం లేదు. ఇప్ప‌టికీ బీజేపీతో అంట‌కాగే జ‌గ‌న్‌తో క‌లిసొచ్చే రాజ‌కీయ పార్టీలుంటాయా? అనేదే ప్ర‌శ్న‌.

20 Replies to “జ‌గ‌న్‌తో క‌లిసొచ్చే పార్టీలున్నాయా?”

  1. సింగల్ సింహానికి నక్కల తోడు కావాల్సొచ్చేనా..

    అంతేలే.. పార్టీ సంక నాకిపోయేటప్పుడు మనం గతంలో పలికిన డప్పులు గుర్తుండవు..

    2029 లో పొత్తులకోసం వెంపర్లాడతాడు ఈ సింగల్ సింహం.. దాన్ని కూడా భజన గా మార్చుకొంటారు నీలి కుక్కలు..

    సిగ్గొదిలేసిన జన్మలకు .. మాట కు బతుకు కి సంబంధం ఉండదు..

  2. 2019-2024 మధ్యలో టీడీపీ నాయకులు కూడా బీజేపీ ని విమర్శించలేదు, అది గుర్తు ఉంచుకోండి!

  3. అనన్నా ఏంటన్న మనమేదో ప్రతిపక్ష నామరూపాలు లేకుండా చేసే కార్యక్రమంలో ప్రజలని హింసించాము, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసాం, బదులుగా ప్రజలు మనకి విపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇప్పుడేమో ఎవరో వీధి రౌడీలు వ్యక్తిగత కారణాల మూలంగా కొట్టుకుని చస్తే,ప్రతిపక్షాన్ని అవమానించె ప్రయత్నంలో రాష్ట్రాన్నె బదనాం చేస్తున్నాం ఇప్పుడు. మన భవిష్యత్తు ఏంటన్న? ప్రజలు మన నాటకాలు అన్నీ గమనిషతున్నారు అన్నా మరి.

  4. వాసలేను రాసుకుని వెళ్లి ప్యాలస్ పులకేశి నీ వెనక్కి వొంగొని వుండమని చెప్పండి ఢిల్లీ లో, మిగతా పార్టీ లా వాళ్ళు వచ్చి పని కనిచ్చుకుని వెళతారు.

    1. గత 5 ఏళ్ల పాటు ED అధికారులు చేసిన పను అదే, ప్యాలెస్ పులకేశి నీ , వాయించి వాయించి పెట్టారు..

      అందుకే ఢిల్లీ నుండి రాగానే నిటారుగా నడుచే వాడు కాదు

  5. వ్యూహాత్మకంగా వెళ్తున్నారు జగన్, కానీ AP లోది కూటమి ప్రభుత్వం లో బీజేపీ భాగస్వామి, (అసలు బీజేపీ తమ తప్పులను సాధారణంగా ఒప్పుకోదు) ఆ విషయం మార్చి పోయినట్టున్నారు. మిగిలిన జాతీయ స్థాయి కూటములతో ఈయనకి ఏమీ సాన్నిహిత్యం లేదు. వాటి భాగస్వామ్య పక్షాల కు (అధికారం ఉన్న, లేకున్నా) కమిట్మెంట్ ఉంది.

  6. BJP అనే పదం వింటేనే అన్న కి ఉచ్చ…..సిగ్గు శరం లేని జీవితం…కూటమి లో ఎవరెవరు ఉన్నారు???? మరి వాళ్ళు అడగకనే.. కనుసైగ చాలు అన్న సెంట్రల్ లో మద్దతు ఇవ్వడానికి…అన్నని గొర్రెలు నమ్మే కాలం పోయింది

  7. #catchthepsycho

    వీడు మనిషి కాదు single సింహం కదా !! వీడితో కలిసి ఎవరు నడుస్తారు ??

Comments are closed.