తిరుపతి టీడీఆర్ బాండ్లలో రూ.4 వేల కోట్లు అవినీతి జరిగిందని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే భూమన కరుణాకరరెడ్డి, ఆయన తనయుడు అభినయ్, అలాగే మున్సిపల్ కమిషనర్ హరితను జైలుకు పంపుతామని నెల్లూరు టీడీపీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి నిత్యం విమర్శలు చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలైంది. ఆనం వెంకటరమణారెడ్డికి కూడా నామినేటెడ్ పదవి దక్కింది.
టీడీఆర్ బాండ్లలో జరిగిన రూ.4 వేల కోట్ల అవినీతి ఆరోపణల సంగతేంటో తెలియడం లేదు. టీడీఆర్ (Transferable Development Rights) బాండ్లలో ఆనం వెంకటరమణారెడ్డితో పాటు కూటమి పాలకుల్లో ఎవరెవరికి ఎంతెంత సొమ్ము ముట్టిందో అని జనం చర్చించుకుంటున్నారు. దీనికి కారణం… టీడీఆర్ బాండ్లపై అవినీతిని వెలికి తీస్తామంటూ కూటమి చేయించిన సీఐడీ దర్యాప్తు ఏమైందో తెలియడం లేదు. మరోవైపు భూములు పోగొట్టుకున్న వాళ్లలో తాజాగా 22 మందికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నాగమౌర్య టీడీఆర్ బాండ్లు పంపిణీ చేశారు.
వైఎస్సార్‌సీపీ పాలనలో తిరుపతి నగరంలో సుమారు 21 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేశారు. ఈ రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు 1303 మంది స్థలాలు ఇచ్చారు. వీళ్లలో 997 మంది టీడీఆర్ బాండ్లు పొందడానికి అర్హులని సంబంధిత అధికారులు గుర్తించారు. 809 మంది స్థల యజమానులకు నోటీసులు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ హయాంలో 442 మందికి టీడీఆర్ బాండ్లు అందించారు.
ఎన్నికల ముంగిట టీడీఆర్ బాండ్లపై ముఖ్యంగా నెల్లూరు టీడీపీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి నోటికొచ్చినట్టు తిట్టారు. మరి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. మరోవైపు టీడీఆర్ బాండ్లలో ఏమీ తేల్చకుండానే, వాటి పంపిణీ చేపట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కూటమి ప్రభుత్వంలో పాలకులు, అధికారులు అంతా కలిసి… టీడీఆర్ బాండ్లలో సొమ్ము చేసుకుని, వాటి పంపిణీ చేపట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో కూడా టీడీఆర్ బాండ్లలో భారీ మొత్తంలో సొమ్ము చేసుకోడానికి ఎలాంటి లోపాయికారి ఒప్పందాలు జరుగుతున్నాయో కథనాలు రాశాం. ఇప్పుడు అదే నిజమైందనేందుకు టీడీఆర్ బాండ్ల పంపిణీనే నిదర్శనం. మాస్టర్‌ప్లాన్ రోడ్లకు స్థలాలు పోగొట్టుకున్నోళ్లకు టీడీఆర్ బాండ్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది. అయితే గతంలో చేసిన తీవ్ర విమర్శల సంగతేంటి? వైసీపీ హయాంలో అవినీతి బాండ్లను నీతిమంతమైన బాండ్లగా మారడం వెనుక… లోగుట్టు ఏంటనే పౌర సమాజం ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది.
కేవలం టీడీఆర్ బాండ్లను ఆర్థికంగా సొమ్ము చేసుకోడానికే, అవినీతి ఆరోపణలతో నిలిపి వేయించి, ఇప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇష్టానుసారం దోచుకుంటున్నారనే విమర్శలపై స్పందించాల్సిన అవసరం వుంది. మరీ ముఖ్యంగా ఆనం వెంకటరమణారెడ్డి నాడు భారీ మొత్తంలో అవినీతి జరిగిందని, పేపర్లతో ముందుకొచ్చి విమర్శలు చేసి, నేడు ఆయన నోరు మూయించిన శక్తి ఏంటో చెబితే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు.
ఊపర్ షేర్వాణి అందర్ పరేషాని అది జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి.. అంతడానికి ఇంత అవసరం వుందా? సాంబా?
4k crores yehtha Jujupi
liquor scam laksha kotlu
no digital payments only cash!!!!
liquor lo yevarevariki yentha muttayi reddy?