మ‌న‌కెందుకులే.. లోకేశ్ టీమ్ చూసుకుంటుంది!

కూట‌మి ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ, సీనియ‌ర్ నేత‌లైన అమ‌ర్నాథ్‌రెడ్డి, న‌ల్లారి కిషోర్ త‌దిత‌ర సీనియ‌ర్ నేత‌ల నుంచి ఎలాంటి స్పందనా లేదు.

మంత్రి నారా లోకేశ్ తీరుపై టీడీపీ సీనియ‌ర్ నేత‌లు గుర్రుగా ఉన్నారు. లోకేశ్ కార‌ణంగానే త‌మ‌కు ప‌ద‌వులు ద‌క్క‌లేద‌నే ఆవేద‌న సీనియ‌ర్ నేత‌ల్లో బ‌లంగా వుంది. ఈ నేప‌థ్యంలో ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో టీడీపీ సీనియ‌ర్ నేత‌లైన ఎమ్మెల్యేలు అమ‌ర్నాథ్‌రెడ్డి, న‌ల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి సైలెంట్ అయ్యారు. రాజ‌కీయాల్లో ఉన్నారా? లేరా? అనే అనుమానం వ‌చ్చేలా, వాళ్లిద్ద‌రూ మౌనాన్ని ఆశ్ర‌యించ‌డం గ‌మ‌నార్హం.

ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు మంత్రి ప‌ద‌వులు ఆశించారు. కానీ నిరాశే ఎదురైంది. క‌నీసం మంచి నామినేటెడ్ ప‌ద‌వులైనా ద‌క్కుతాయ‌ని వాళ్లు అనుకున్నారు. వాటికి కూడా నోచుకోలేదు. మ‌రోవైపు త‌మ నెత్తిన మంతి రాంప్ర‌సాద్‌రెడ్డిని బ‌ల‌వంతంగా రుద్దార‌నే భావ‌న వాళ్ల‌లో వుంది. మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి వ‌స్తున్నా, స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నా సీనియ‌ర్ నేత‌లెవ‌రూ అటు వైపు తొంగిచూడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కొత్త‌గా పార్టీలోకి రావ‌డ‌మే కాకుండా, మొద‌టిసారి గెలిచిన రాంప్ర‌సాద్‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇచ్చి, అన్న‌మ‌య్య జిల్లా బాధ్య‌త‌లు అప్ప‌గించి రాజ‌కీయంగా స్వారీ చేయించాలంటే ఎలా కుదురుతుంద‌నేది వాళ్ల ప్ర‌శ్న‌. దీంతో టీడీపీ సీనియ‌ర్ నేత‌లు స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ సీనియ‌ర్ నేత‌ల్ని ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితి టీడీపీ అధిష్టానానిది.

కూట‌మి ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ, సీనియ‌ర్ నేత‌లైన అమ‌ర్నాథ్‌రెడ్డి, న‌ల్లారి కిషోర్ త‌దిత‌ర సీనియ‌ర్ నేత‌ల నుంచి ఎలాంటి స్పందనా లేదు. లోకేశ్ టీమ్ వుందిలే, అదే అన్నీ చూసుకుంటుంద‌ని దెప్పి పొడుస్తున్నారు. మేము ప‌నికిరామ‌నే కార‌ణంతోనే క‌దా ప‌క్క‌న పెట్టింద‌ని ఒకింత ఆగ్ర‌హంతో అంటున్నారు.

2 Replies to “మ‌న‌కెందుకులే.. లోకేశ్ టీమ్ చూసుకుంటుంది!”

  1. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం రా గ్యాస్ ఆంధ్ర .

    మధ్యలో నీకు వచ్చిన గుద్ధ నొప్పి ఏమిటో తెలియదు మరి . ఒక్కొక్కటి నీ పార్టీని వదిలిపెట్టి ఎందుకు పోతున్నారో మరి కారణం చెప్పగలవా ?

    అది మాత్రం చెప్పలేవు గాడిదలా ఇటువంటి కారు కూతలు మాత్రం కూస్తూ ఉంటావు . వారి కనీసం పార్టీలో ఉన్నారు మీ వాళ్ళు పార్టీని సభ్యత్వాన్ని అన్ని వదిలేసుకుని వెళ్ళిపోతున్నారు . ఎందుకు ?

    కళ్ళు ఉన్న కబోధులంటే చెవులున్న బెదిరి వాళ్ళ అంటే మీరే రా గ్యాస్ ఆంధ్ర . మీ దాంట్లో జరిగేవి ఏమీ కనపడవు వినపడవు అదే ఇతరులదైతే కనిపిస్తుంది వినిపిస్తుంది రా గ్యాస్ ఆంధ్ర

Comments are closed.