ఆయన మీద వైసీపీ ఆశలు వదిలేసుకుందా?

విశాఖలో 2024 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి అసెంబ్లీని పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్. ఆ ఓటమి తరువాత ఆయన వైసీపీలో అయితే కనిపించడం లేదు.…

విశాఖలో 2024 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి అసెంబ్లీని పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్. ఆ ఓటమి తరువాత ఆయన వైసీపీలో అయితే కనిపించడం లేదు. పార్టీతో సంబంధం లేనట్లుగానే ఉంటున్నారు.

ఇటీవల విశాఖ డైరీకి చెందిన నెయ్యిని సింహాచలం దేవస్థానానికి సప్లై చేసే చాన్స్ కూడా ఆయనకు దక్కింది. అలా ఆయన టీడీపీకి మళ్లీ చేరువ అవుతున్నారని ప్రచారం మొదలైంది. ఆయన తండ్రి దివంగత ఆడారి తులసీరావు టీడీపీకి వీర విధేయుడిగా దశాబ్దాల పాటు నిలిచారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటుకు ఆడారి ఆనంద్ పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.

ఇపుడు మళ్లీ ఆయన సైకిలెక్కేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు అని అంటున్నారు. వైసీపీ నిర్వహించే సమీక్షా సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. దాంతో ఆయన మీద వైసీపీ ఆశలు వదిలేసుకుంది అనే అంటున్నారు. ఇటీవల జగన్ సమక్షంలో విశాఖ జిల్లా పార్టీ నేతల సమావేశంలో పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ కి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆడారి కి వైసీపీకి ఉన్న బంధం అఫీషియల్ గా కట్ అయింది అని అంటున్నారు.

మళ్ల విజయ్ ప్రసాద్ 2009లో కాంగ్రెస్ నుంచి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2024లో ఆయనే పోటీ చేయాలి కానీ ఆడారి రావడంతో టికెట్ ఇచ్చారు. ఇపుడు తిరిగి ఆ సీటుని మళ్ళకే కన్ ఫర్మ్ చేశారు. రానున్న రోజులలో యాక్టివ్ గా లేని చోట్ల ఇంచార్జిలను పార్టీ మారుస్తుంది అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

6 Replies to “ఆయన మీద వైసీపీ ఆశలు వదిలేసుకుందా?”

  1. మతం మారడం ప్రతి ఒక్కరి స్వేచ్ఛ. మీ విశ్వాసాన్ని ఎంచుకోవడం మీ హక్కు, దానిని గౌరవించడం కూడా సమాజం బాధ్యత. కానీ, ఈ స్వేచ్ఛను బలపెట్టి, మరొక మతాన్ని అవమానించడం, హిందూ మతాన్ని కించపరచడం ఏ మాత్రం సహించదగినది కాదు. ఇది కేవలం అనాగరికత మాత్రమే కాదు, దారుణమైన నీచత్వం.

    మీరు కొత్త మతాన్ని స్వీకరించడం మంచిదే, ఆ మతాన్ని ప్రేమించండి, గౌరవించండి. కానీ హిందూ మతాన్ని, ఆ మతం కోసం బతుకుతున్న కోట్లాది ప్రజల భావాలను కించపరచడం మీకున్న హక్కు కాదు. హిందూ భావాలను అవమానించడం మనిషిగా మీరు ఎంతకైనా దిగజారిన స్థాయికి వెళ్లినట్టు చూపుతుంది. మీ మతాన్ని మీరు గౌరవించాలన్నదే గాక, ఇతరుల మతాలను గౌరవించడమే మానవతా ధర్మం.

    మీరు మీ మతం మార్చుకున్నారని, అది మీ స్వేచ్ఛ అని గౌరవించాలి. కానీ హిందూ మతాన్ని విమర్శించడం వల్ల మీరు ఏం సాధిస్తారు? హిందూ మతాన్ని తక్కువ చేసి, హిందూ భావాలను దిగజార్చే ప్రయత్నం ఎంత నీచమైన పని అని ఆలోచించండి. మీరు అనుసరిస్తున్న మతం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మార్చాలి కానీ, ఇతర మతాలపై ద్వేషాన్ని ప్రోత్సహించడం కాదు.

    రాజకీయ నాయకులు, అజ్ఞానంతో నడిచే వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మతాలను కలుపుకొని ఆడుతుంటారు. మీరు వాటికి బలి కాకండి. జాగ్రత్తగా ఉండండి, వారి మాటల్లో పడకండి. మీ మతాన్ని గౌరవించడం తప్పకండి కానీ, హిందూ మతాన్ని అవమానించడం క్షమించరాని పాపం. ఈ వ్యవహారం మీ విలువలను, మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తుంది.

    మీ పూర్వీకులు హిందువులే. వారిదైన వారసత్వాన్ని మీరు విస్మరించి కొత్త మతాన్ని స్వీకరించినా అది మీ హక్కు. కానీ వారి చరిత్రను అవమానించడం అసహ్యకరమైన చర్య. హిందూ మతం ఒక వ్యక్తి లేదా రాజకీయ నాయకుడి సొత్తు కాదు. అది ఒక గొప్ప సాంస్కృతిక ముద్ర, కోట్లాది ప్రజల ఆత్మవిశ్వాసం. దీన్ని అవమానించడాన్ని మానుకోండి.

    మతం మార్చుకోవడం ఎవరి వ్యక్తిగత నిర్ణయమైనా, మరొక మతాన్ని కించపరచడం అత్యంత దిగజారిన పని. మతం మారడం మంచిదే, గౌరవించదగినదే. కానీ హిందూ భావాలను అవమానించడం ద్వారా మీరు ఏమాత్రం గౌరవం పొందరు. దయచేసి ఆలోచనల మార్పు చేసుకోండి. మీ మతం, విశ్వాసం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలపాలి, అది ఇతరులపై ద్వేషాన్ని కాకుండా గౌరవాన్ని చూపించాలి.

    మరియు చివరగా, సత్యం, గౌరవం, మానవత్వం—ఇవే మానవ జీవనానికి నిజమైన విలువలు. హిందూ మతాన్ని ద్వేషించడం ద్వారా మీరు ఏమీ సాధించలేరు

Comments are closed.