భీమిలీని సీరియస్‌గా తీసుకున్న వైసీపీ

అవంతి వెళ్తే వెళ్లనీ, పార్టీ భీమిలీలో స్ట్రాంగ్‌గా ఉందని చాటి చెప్పాలని వైసీపీ అనుకుంటోంది.

విశాఖ జిల్లాలో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం భీమిలీ. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక కేవలం మూడు సార్లు మాత్రమే ఓడింది. టీడీపీ ఓటమి పాలైనప్పుడల్లా తక్కువ మెజారిటీతో గెలిచినపుడల్లా భారీ మెజారిటీతో గెలుస్తూ వచ్చింది.

అంత ప్రాధాన్యత ఉన్న భీమిలీ సీటులో, వైసీపీ 2024 ఎన్నికల్లో 70,000 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే వచ్చిన గట్టి ఫలితం అది. అందుకే అన్నీ ఆలోచించి అవంతి శ్రీనివాసరావు వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు.

అయితే, భీమిలీలో వైసీపీకి కూడా బాగానే బలం ఉంది. సరైన అభ్యర్థిని పెడితే, యాంటీ-ఇంకెంబెన్సీ వర్కౌట్ అయి, వచ్చే ఎన్నికల్లో గెలవవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే, అవంతికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి పార్టీలో చేర్చుకుని, ఇచ్చిన మాట ప్రకారం తొలి విడతలో మంత్రిని చేసి మూడేళ్ల పాటు కొనసాగిస్తే, ఆయన పార్టీ కష్టకాలంలో హ్యాండ్ ఇచ్చి వెళ్లారని వైసీపీ నేతలు అంటున్నారు.

అధినాయకత్వం కూడా అవంతి రాజీనామా పట్ల సీరియస్‌గా ఉంది. అవంతి వెళ్తే వెళ్లనీ, పార్టీ భీమిలీలో స్ట్రాంగ్‌గా ఉందని చాటి చెప్పాలని వైసీపీ అనుకుంటోంది. అందుకే అవంతి రాజీనామా చేసిన వెంటనే ఆలస్యం చేయకుండా, భీమిలీలోని వైసీపీ నేతలతో, కార్యకర్తలతో పార్టీ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

అందరిని కోఆర్డినేట్ చేసుకుంటూ, ఆమోదయోగ్యమైన నేతను సాధ్యమైనంత త్వరలోనే ఇన్‌ఛార్జిగా నియమించి, వైసీపీని అక్కడ మరింత పటిష్ఠం చేయాలని పార్టీ హైకమాండ్ ఆలోచిస్తోంది. అధినాయకత్వం ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ భీమిలీ నేతలతో ఒక అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

భీమిలీ విషయంలో వైసీపీకి పక్కా ప్లాన్స్ ఉన్నాయని అంటున్నారు. అవంతి ఏ పార్టీలో చేరుతారో చూస్తే, ఆ పార్టీలో ఉన్న ఆశావహులు ఇటు వైపు వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.

9 Replies to “భీమిలీని సీరియస్‌గా తీసుకున్న వైసీపీ”

  1. మళ్ళీ ఈ క్యూట్ బాబు.. Ga లో ఏమైనా షేర్ కొన్నారా.. ఏ విషయం లేకపోయినా హెడ్ లైన్స్, ఫోటో లు వేస్తున్నారు

Comments are closed.