స్క్రీన్ ప్లే రాసేసి, డైలాగ్ వెర్షన్ రాయించాలనుకుంటున్నారా?

‘నలుగురు ముసుగులో వచ్చారు వారెవ్వరు?’ అనేది మరో ప్రశ్న. ‘తనకు తెలియదని, ముసుగుల వారిని చూడనేలేదని’ విజయపాల్ సమాధానం.

రఘురామక్రిష్ణ రాజును గత ప్రభుత్వ హయాంలో అరెస్టు చేసి నిర్బంధించినప్పటి వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు కేసు విచారణ ముమ్మరంగా నడుస్తోంది. అప్పట్లో జగన్ తనమీద కక్ష కట్టి, సీఐడీ పోలీసుల ద్వారా హత్య చేయించడానికి ప్రయత్నించారని రఘురామ పోలీసు కేసు పెట్టారు.

దీనికి సంబంధించి ఆయన అప్పటి సీఐడీ ఎఎస్పీ విజయపాల్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి, మూలకారకుడిగా జగన్మోహన్ రెడ్డి, సూత్రధారిగా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తదితరుల మీద కేసు పెట్టారు. వీరిలో ప్రస్తుతం రిటైరై ఉన్న ఎఎస్పీ విజయపాల్‌ను పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు. రిమాండులో ఉన్న ఆయనను కస్టడీలోకి తీసుకుని మరీ విచారించారు.

అయితే, ఈ విచారణ సాగుతున్న సరళి చాలా చిత్రంగా కనిపిస్తోంది. స్క్రీన్ ప్లే ముందే రాసేసుకుని, ఆ స్క్రిప్ట్‌కు మ్యాచ్ అయ్యే డైలాగులను విజయపాల్ ద్వారా రాయించాలని విచారణాధికారులు భావిస్తున్నారేమో అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.

రఘురామక్రిష్ణ రాజును కస్టడీలో ముసుగులు ధరించిన వ్యక్తులు వచ్చి దారుణంగా కొట్టి, హింసించి చంపడానికి ప్రయత్నించారనేది ఇప్పటి కేసు.

రఘురామను కస్టడీలో కొట్టారా? అని అడిగితే విజయపాల్ “లేదు” అని బదులిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దానికి అనుబంధంగా పోలీసులు అడిగిన నెక్ట్స్ ప్రశ్న – ‘ఆయనను చిత్రహింసలకు గురిచేసింది ఎవరు? వేధించాలని మిమ్మల్ని ప్రేరేపించింది ఎవరు?’ అని! ఈ ప్రశ్నల క్రమం గమనిస్తే కామెడీ అనిపిస్తుంది.

సినిమాల్లో రొటీన్ కామెడీ సీక్వెన్స్ ఒకటుంటుంది. ‘పెళ్లయిందా?’ అని ఒక అమ్మాయిని అడగడం… ‘కాలేదండీ..’ అని జవాబు వచ్చిన వెంటనే ‘పిల్లలు ఎంతమంది?’ అని అడగడం జరుగుతుంటుంది. పోలీసుల ప్రశ్నలు కూడా అలాగే ఉన్నాయి. ‘కొట్టనేలేదు’ అని విజయపాల్ చెబుతోంటే, ‘కొట్టమని ప్రేరేపించింది ఎవరు?’ అని ప్రశ్నించడం చూస్తే… వాళ్లు స్క్రిప్టు ముందే రాసేసుకుని, ఆ స్క్రిప్టుకు తగిన డైలాగుల్ని విజయపాల్ నోటితో చెప్పించాలని ప్రయత్నిస్తున్నట్టుగా అర్థమవుతోంది.

‘నలుగురు ముసుగులో వచ్చారు వారెవ్వరు?’ అనేది మరో ప్రశ్న. ‘తనకు తెలియదని, ముసుగుల వారిని చూడనేలేదని’ విజయపాల్ సమాధానం. దానికి విరుగుడు – విజయపాల్‌కు తెలిసే ముసుగు వ్యక్తులు వచ్చినట్లు ఏదైనా ఇతర ఆధారం చూపించి, ఆయనను ఇరుకున పెట్టి ప్రశ్నించాలి గానీ, ఏ ఇతర ఆధారమూ లేకుండా ‘ఆయన చెబుతున్నదంతా అబద్ధం… నిజం చెప్పేదాకా విచారిస్తాం’ అని పోలీసులు మాట్లాడటం… తమ స్క్రిప్టును ఆయన పలికేదాకా వేధించేలా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు.

29 Replies to “స్క్రీన్ ప్లే రాసేసి, డైలాగ్ వెర్షన్ రాయించాలనుకుంటున్నారా?”

  1. Anyway, the fact that every one silent in this case raises questions on whether the case itself.

    especially case pettinodu silent like a thieve bit by cobra

    1. You crossing limits…

      everyday cbn gaadu ookadampudu.. social media laws ani…

      which law control your mouth.

      either he is stupid or his laws are stupid

      😂😂😂

  2. అప్పట్లో రఘు రామ ని కస్టడి లో కుళ్లబొడిచారు అని ఆర్టికల్స్ రాసుకుని శునకానందం పొందావు.. ఇప్పుడు ఇలా ఏడుస్తున్నావు!

Comments are closed.