రంధ్రాన్వేషణ చేస్తున్న పచ్చ మేధావులు

పన్నుల బకాయిల రూపేణా, వాటి సంరక్షణ కొరకు సిబ్బందిని వెచ్చించడం రూపేణా ప్రభుత్వానికి ఆర్ధిక భారంగా మారడం తప్ప మరొక ఉపయోగం లేని వృథా భవనాలను తెలంగాణకు అప్పగించేసినందుకు తెలుగు ప్రజలు ఏం పర్లేదని…

పన్నుల బకాయిల రూపేణా, వాటి సంరక్షణ కొరకు సిబ్బందిని వెచ్చించడం రూపేణా ప్రభుత్వానికి ఆర్ధిక భారంగా మారడం తప్ప మరొక ఉపయోగం లేని వృథా భవనాలను తెలంగాణకు అప్పగించేసినందుకు తెలుగు ప్రజలు ఏం పర్లేదని అనుకుంటున్నారు. కానీ ఈ నిర్ణయంతో జాతికి ద్రోహం జరిగిపోయినట్లుగా రంగు పులుముతూ జగన్ మీద ఎదురుదాడికి అస్త్రాలను సిద్ధం చేయడంలో పచ్చ మేధావులు ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ప్రభుత్వం మారిన వెంటనే నిరూపయోగ భవనాలను వదిలించుకోవడం పూర్తయింది. ఇందులో ఏపీ ప్రజలకు ఎలాంటి అభ్యంతరమూ కనిపించలేదు. అయితే గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా గత ఐదేళ్లుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అచేతనత్వం కూడా బయటపడింది. చంద్రబాబు చేయలేని పని జగన్ రాగానే జరిగిపోయిందనే భావన ప్రజలకు కలిగింది. దీనిని పచ్చదళాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. అందుకే రంధ్రాన్వేషణకు దిగాయి.

ఈ వృధా భవనాలు తెలంగాణకు ఇవ్వడం వలన ఎదో ఉపద్రవం జరిగిపోయిందనీ, ఒక అద్భుతమైన పరమార్ధాన్ని ఉద్దేశించి చంద్రబాబు ఇన్నాళ్లూ ఈ పని జరగకుండా అడ్డుకున్నారని చాటడానికి ఉద్యుక్తులవుతున్నారు. చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్ లో రెస్టు తీసుకుంటున్నారు. ఇప్పట్లో ఏపీకి వచ్చే ఉద్దేశంతో కూడా లేరు. మూడునెలల దాకా ఈ ప్రభుత్వాన్ని పనిచేయనిద్దాం, తర్వాత లోపాలు చెబుదాం అని ఆయన తన రెస్టు పీరియడ్ డ్యూరేషన్ కూడా ప్రకటించేశారు.

ఆయన ఎప్పటికి ట్రాక్ మీదకు వస్తే అప్పటికి నివేదించడానికి నోట్సు తయారుచేస్తున్నారని సమాచారం. ప్రజలంతా ఆమోదించిన తర్వాత బాబు నోరు చేసుకుంటే నవ్వులపాలు అవుతారేమో మరి!!

ఎన్టీయార్‌ పేరుతో గెలిచేశారు.. లంచం తీసుకుంటే పట్టించారు