ఆర్టిస్ట్ లోకేష్.. అవార్డు గ్యారెంటీ

లోకేష్ ట్విట్టర్ లో పెడుతున్న ఫొటోలు, చేస్తున్న వ్యాఖ్యానాలు చూస్తుంటే జనాలకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ప్రభుత్వంపై నిందలు వేయడం అటుంచి.. ప్రతిరోజూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తనను…

లోకేష్ ట్విట్టర్ లో పెడుతున్న ఫొటోలు, చేస్తున్న వ్యాఖ్యానాలు చూస్తుంటే జనాలకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ప్రభుత్వంపై నిందలు వేయడం అటుంచి.. ప్రతిరోజూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తనను కలుస్తున్నారని, వారి కష్టాలు తనతో చెప్పుకుంటున్నారని పోస్టులు పెడుతున్నారు లోకేష్. ప్రజలు తీసుకొస్తున్న అర్జీలను తేరిపార చూస్తూ.. పెద్ద మేథావి ఇచ్చినట్టు ఫొటోలకు పోజులిస్తున్నారు.

అసలు లోకేష్ ని చూస్తుంటే.. సీరియస్ గా ఆ కాగితాలన్నిటినీ తేరిపార చూసి వెంటనే సమస్యను అక్కడికక్కడే పరిష్కారించే ఐఏఎస్ ఆఫీసర్ లా కనిపిస్తుంటారు. కానీ మనోడికి అంత సీనుందా అంటే అస్సలు లేదు. తెలుగు మాట్లాడటమే చేతకాని లోకేష్ కి, పేదవారు తెలుగులో రాసుకుని తీసుకొచ్చే అర్జీ చదివే జ్ఞానం ఉందని అనుకోవాలా. ఆమాత్రం లాజిక్ మిస్సై.. తన దగ్గరకు వచ్చేవారిని నమ్మించినట్టు మీడియాని, నెటిజన్లను కూడా నమ్మించాలనుకుంటే ఎట్లా.

అర్జీలు చదవడం రాని లోకేష్.. వాటిని తేరిపార చూస్తుంటే జనాలు నవ్వకుండా ఎలా ఉంటారు. అందుకే ఇలాంటి పోస్టింగ్ లన్నీ విపరీతంగా ట్రోలింగ్ కి గురవుతుంటాయి. పోనీ లోకేష్ పెద్ద తోపు అనుకుందాం. ఎమ్మెల్యేగా ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించగలుగుతారు. పోనీ తన నియోజకవర్గం ఇదీ అని చెప్పుకునే పరిస్థితి కూడా లేని ఎమ్మెల్సీ పోస్ట్ ఆయనది.

ఓ వైపు సీఎం జగన్ తరతమ భేదం లేకుండా అందరి సమస్యలు పరిష్కరించుకుంటూ పోతుంటే.. ఇంకా లోకేష్ దగ్గరకు అర్జీలు తీసుకొచ్చేవారెవరుంటారు. ఆయనేమైనా ఆర్చేవారా.. తీర్చేవారా..? ఇదంతా చూస్తుంటే.. తెలుగుదేశం పార్టీ ఆర్టిస్ట్ లకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అర్థమవుతుంది.

ఓ పెద్ద ఆర్టిస్ట్ మనవడుగా, మరో ఓవర్ యాక్షన్ ఆర్టిస్ట్ కు అల్లుడిగా.. తన తోటి ఆర్టిస్ట్ ల కష్టాలు తెలిసినవాడు కాబట్టే.. వారి యాక్షన్ కి అంతలా రియాక్షన్స్ ఇస్తూ కామెడీ పండిస్తున్నారు లోకేష్. ఇంకెంతకాలం ఇలా తండ్రీ కొడుకులు ఆర్టిస్ట్ ల సహకారంతో రాజకీయాలను నెట్టుకు వస్తారో చూడాలి. వీళ్లకు కూడా ఏమైనా అవార్డులు ప్రవేశపెడితే బాగుంటుందేమో!

దొరసాని మనసెరిగిన దొర.. ఏమి చెప్పాడో తెలుసా?