అదానీ గ్రూప్ తాజాగా ముంబైలోని అత్యంత ఖరీదైన నివాస ప్రాంతాల్లో ఒకటైన సౌత్ ముంబై కార్మైఖేల్ రోడ్ లో విలువైన భూమిని కొనుగోలు చేస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక అడుగు వేసింది. 2025 మార్చి 27న ఈ డీల్ ముగిసింది. అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన మహ్-హిల్ ప్రాపర్టీస్ ద్వారా కొనుగోలు పూర్తయ్యింది. 1.1 ఎకరాల భూమికి రూ.170 కోట్లకుపైగా చెల్లించగా, స్టాంప్ డ్యూటీగా రూ.10.46 కోట్లు చెల్లించారు. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ CRE మ్యాట్రిక్స్ విడుదల చేసింది.
ఈ భూమిలో ప్రస్తుతం 2,760 చదరపు అడుగుల రెసిడెన్షియల్ కాటేజ్ ఉంది. ఇది మలబార్ హిల్‌లో ఉంది, ఇది ముంబైలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. అదానీ గ్రూప్ అక్కడ ఏం నిర్మించబోతుందన్న దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే, రియల్ ఎస్టేట్ నిపుణుల ప్రకారం ఇది డెవలప్‌మెంట్‌కి ఎంతో అనుకూలమైన స్థలం. ఈ ప్రాంతంలో మిగిలిన కొద్ది భూముల్లో ఇది ఒకటి కావడం వల్ల, ఇది ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెబుతున్నారు.
ఈ భూమిని బెహ్రామ్ నవ్రోజీ గమాడియా అనే వ్యక్తి అమ్మారు. ఇది అతని కుటుంబ వారసత్వ ఆస్తి. గమాడియా కుటుంబం ఈ భూమిని 1900ల ప్రారంభం నుంచి కలిగి ఉంది. 1991లో ముంబై మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్లాన్ ప్రకారం ఈ భూమిని పిల్లల పార్క్‌గా ఉపయోగించాల్సిందిగా నిర్ణయించారు. అయితే, బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) 2034 డెవలప్‌మెంట్ ప్లాన్ ప్రకారం ఈ భూమిని నివాస భూమిగా (Residential land) పరిగణించింది.
కార్మైఖేల్ రోడ్ భారతదేశంలోని సంపన్న వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు నిలయంగా మారింది. ముంబైలోని ప్రధాన వ్యాపార ప్రాంతాలకు ఇది అత్యంత సమీపంగా ఉండటం వల్ల దేశంలోని అత్యంత విలువైన అడ్రెసులలో ఇది ఒకటి.
2024 అక్టోబర్‌లో KKR ఇండియా CEO గౌరవ్ త్రేహాన్ మోరెనా హౌస్ ప్రాజెక్టులో సముద్ర వీక్షణ గల అపార్ట్మెంట్‌ను రూ.88 కోట్లకు కొనుగొన్నారు. 2024 జూన్‌లో గోద్రెజ్ ఇండస్ట్రీస్ అధినేత నదీర్ గోద్రెజ్ మలబార్ హిల్‌లోని రూపారేల్ హౌస్‌లో రూ.180 కోట్లకు మూడు అపార్ట్మెంట్లు కొన్నారు. 2024 ఏప్రిల్‌లో వెల్‌నోన్ పాలీస్టర్స్ చైర్మన్ అనిల్ గుప్తా, వాకేశ్వర్ రోడ్‌లోని లొధా మలబార్‌లో రూ.270 కోట్లకు రెండు విలాసవంతమైన అపార్ట్మెంట్లు కొనుగోలు చేశారు.
ఈ డీల్ ముంబైలో విలాసవంతమైన రియల్ ఎస్టేట్‌పై ఉన్న అధిక డిమాండ్‌ను సూచిస్తుంది. భారతదేశంలో టాప్ బిజినెస్ లీడర్లు తమ సంపదను ప్రీమియం ప్రాపర్టీల్లో పెట్టుబడి పెట్టడాన్ని ఇది స్పష్టంగా చూపుతోంది.
ఈ లెక్కన ముంబై లో ఎకరం 150 కోట్లు, మనం మాత్రం vizag లో ఎకరం 150 కోట్లు అని బురద జల్లుతాం .
ఈ లెక్కన ముంబై లో ఎకరం 150 crores, మనం మాత్రం vizag లో ఎకరం 150 అని ఆర్టికల్ రాస్తాం .
మరి విశాఖలో 150కోట్లు అన్నావ్?
మా ప్యాలెస్ పులకేశి గాడు ఐతే దానిని, ప్రజల డబ్బుతో ఏలా ఫ్రీ గా నొక్కేయవచ్చో ప్లాన్ చేసేవాడు, ఇప్పటికే ఇలా నొక్కేసిన డబ్బుతో కట్టిన ఊరికి ఒక ప్యాలెస్ ల ప్రకారం.
Much less than what cbn gave to lulu
జాయిన్ కావాలి అంటే