ప్రపంచంలోని టాప్-1000 రెస్టారెంట్స్ లిస్ట్ లో హైదరాబాద్ కు స్థానం దక్కింది. హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో ఉన్న అదా రెస్టారెంట్ ఈ ఘనత దక్కించుకుంది. లిస్ట్ లోకి టాప్-10 ఇండియన్ రెస్టారెంట్లలో అదాకు మూడో స్థానం దక్కింది.
ఫ్రెంచ్ రెస్టారెంట్ గైడ్ లా లిస్టే, ప్రపంచంలో టాప్-1000 రెస్టారెంట్లు జాబితాను వెల్లడించింది. వేల సంఖ్యలో ప్రచురణలు, వందల కొద్దీ గైడ్‌బుక్‌లు, మిలియన్ల కొద్దీ ఆన్‌లైన్ సమీక్షల ఆధారంగా ఈ రెస్టారెంట్‌లకు ర్యాంక్ ఇచ్చింది లా లిస్టే సంస్థ.
టాప్-1000లో ఇండియన్ రెస్టారెంట్ల విషయానికొస్తే.. న్యూ ఢిల్లీలోని ఇండియన్ యాక్సెంట్ టాప్ లో నిలిచింది. ఇక బెంగళూరులోని కరవల్లి రెస్టారెంట్ రెండో స్థానంలో నిలిచింది. ప్రాంతీయ రుచులకు ఇది పెట్టింది పేరు. ఇక మూడో స్థానంలో హైదరాబాద్ నుంచి అదా రెస్టారెంట్ నిలిచింది. అసలైన హైదరాబాదీ రుచులు ఆస్వాదించాలంటే ఈ రెస్టారెంట్ కు వెళ్లాలంటోంది లా లిస్టే.
ముంబయిలోని యాట్చా, న్యూఢిల్లీలోని డమ్ పుకెట్ రెస్టారెంట్లు 4,5 స్థానాల్లో నిలిచాయి. లిస్ట్ లో ఎక్కువగా బెంగళూరు, ఢిల్లీకి చెందిన రెస్టారెంట్లే ఉండగా.. హైదరాబాద్ కు ఒకే ఒక స్థానం దక్కింది.
ఇక టాప్-1000 లిస్ట్ లో నంబర్-1 స్థానంలో నిలిచిన రెస్టారెంట్ లే బెర్నార్డిన్. అమెరికాకు చెందిన ఈ రెస్టారెంట్ అన్ని విభాగాల్లో బెస్ట్ రేటింగ్ సాధించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ రెస్టారెంట్ టైటిల్ అందుకుంది.