క్వీన్ ఎలిజబెత్ II, 96 సంవత్సరాల వయస్సులో కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె స్కాట్లాండ్‌లోని ఆమె వేసవి నివాసంలో చికిత్స పొందుతు కన్ను మూసినట్లు ప్యాలెస్ వర్గాలు తెలిపాయి.
బ్రిటన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలంగా రాణిగా కొనసాగారు ఎలిజబెత్-II. బ్రిటన్ రాణిగా ఆమె పాతికేళ్ల వయసు నుంచి ఆ హోదాలో ఉన్నారు. ఒకవైపు ప్రజాస్వామ్యం ఉన్నా.. బ్రిటిష్ రాజరిక పాలన కిందే కొనసాగుతూ వస్తోంది. 1952 తన తండ్రి మరణించడంతో వారసురాలిగా ఆమె ప్రకటించబడ్డారు.
క్వీన్ ఎలిజబెత్ II మరణించడంతో, ఆమె పెద్ద కుమారుడు చార్లెస్ ను వారసుడిగా పదవీ బాధ్యతలు చేపడతారు. యునైటెడ్ కింగ్‌డమ్ రాచరిక వ్యవస్థలో భాగంగా కిరీటం వెంటనే ఆమె పెద్ద కుమారుడు చార్లెస్‌కు దక్కనుండి.
15 మంది బ్రిటన్ ప్రధానులు.. ఈమె హయాంలో పని చేశారు. 1952లో సింహాసనాన్ని అధిష్టించిన క్వీన్ ఎలిజబెత్-2 అనేక సామాజిక మార్పులకు సాక్షిగా నిలిచారు.