ఇటీవల జరిగిన బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లీసెస్టర్ ఈస్ట్ సీటు నుండి కన్జర్వేటివ్ పార్టీ తరపున గెలిచిన భారతీయ సంతతికి చెందిన శివాని రాజా(27) బ్రిటన్ పార్లమెంటులో భగవద్గీతపై ప్రమాణం చేసి ఎంపీగా బాధ్యతలు చేపట్టారు.
భారతీయ మూలాలుగల శివాని రాజా లీసెస్టర్ ఈస్ట్ సీటు నుండి చారిత్రాత్మక విజయం సాధించారు. ఆ నియోజకవర్గంలో 37 ఏళ్ల పాటు గెలుస్తున్న లేజర్ పార్టీని ఓడించి విజయం సాధించి సరికొత్త రికార్డుకు ఎక్కారు. భారతీయ సంతతికి చెందిన లేబర్ పార్టీ అభ్యర్ధి రాజేష్ అగర్వాల్‌పై శివానీ రాజా గెలుపొందారు. శివానీ రాజాకు 14,526 ఓట్లు రాగా.. తన ప్రత్యర్థి రాజేష్ అగర్వాల్ కు 10,100 ఓట్లే వచ్చాయి.
బ్రిటన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, శివాని.. “లీసెస్టర్ ఈస్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు పార్లమెంటులో భగవద్గీత గీతపై ప్రమాణ స్వీకారం చేయడం గౌరవంగా ఉందని”.. ట్వీట్టర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇటీవల జరిగిన బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 27 మంది హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు.