బీజేపీ నేతలపై దక్షిణాది విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ చాలా చాలా మాటలు మాట్లాడుతున్నాడు. అలాగే ట్విటర్ వేదికగా ఘాటైన విమర్శలు చేస్తున్నాడు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ – బీజేపీ మధ్య మాటలు హీటెక్కించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ విమర్శలపై ప్రకాశ్‌రాజ్ తనదైన శైలిలో ట్విటర్ వేదికగా ఘాటైన విమర్శలకు దిగాడు.
“గోలీ, బిర్యానీ, టెర్రరిస్టులు, హేట్ స్పీచ్” అంటూ ప్రకాశ్‌రాజ్ విరుచుకుపడ్డాడు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడేందుకు ఇంతకంటే మంచి మాటలు, అంశాలు లేవా అని ఆయన ప్రశ్నించాడు. బీజేపీ నేతలు మాట్లాడిన ఆ మాటలను గుర్తు చేస్తూ…వారికి సిగ్గుండాలని ఆయన ధ్వజమెత్తాడు.
కాగా ఇటీవల ప్రకాశ్‌రాజ్‌తో పాటు కర్నాటక మాజీ సీఎం కుమార్‌స్వామిని ఈ నెల 26న చంపేస్తామని కొందరు దుండగలు లేఖరాసిన విషయం తెలిసిందే. బీజేపీ అప్రజాస్వామిక విధానాలపై ప్రకాశ్‌రాజ్ పదేపదే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ప్రకాశ్‌రాజ్ విమర్శలు బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రతి సామాజిక సమస్యపై ఆయన స్పందిస్తున్నాడు. తాజాగా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతల విమర్శలు హద్దులు దాటి ఈసీ నిషేధం వరకు వెళ్లిన విషయం తెలిసిందే.