ఢిల్లీ ఎన్నికలకు ఆప్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోడానికి ఆప్, మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించేందుకు కాంగ్రెస్, బీజేపీ గట్టి పట్టుదలతో పని చేస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరగనుంది. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు అధికారం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఏ రకంగా నెరవేరుస్తున్నదో చెబుతూ, ఢిల్లీలో కూడా మంచి పాలన అందిస్తుందని, ఆదరించాలని కోరడం విశేషం.
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలైన చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారా? అనే ఎదురవుతోంది. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలు, వాటి అమలు గురించి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఈ ఇద్దరు నాయకులు వివరిస్తే, బీజేపీకి ప్రయోజనం కలుగుతుందేమో ఆలోచించాలి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పవన్‌కల్యాణ్ వెళ్లిన సంగతి తెలిసిందే.
పవన్ ప్రచారం చేయడం వల్లే మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిందని ఏపీలో జనసేన నాయకులు ఘనంగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, తోటి తెలంగాణ సీఎం ప్రచారం చేసిన నేపథ్యంలో, సహజంగానే చంద్రబాబు, పవన్‌పై ఒత్తిడి రావచ్చు. ఢిల్లీలో తెలుగు ఓటర్లు కూడా బాగా ఉన్నారు. బాబు, పవన్ ఎన్నికల ప్రచారానికి వెళితే ఏమవుతుందో చూడాలని ఆశగా ఎదురు చూసేవాళ్లు కూడా లేకపోలేదు.
వాళ్ళు ఇద్దరు ఇక్కడ ప్రభుత్వ పనులలో బిజీ ….ఎట్టాగ అసెంబ్లీ కూడా వెళ్లడం లేదు, అన్న కు మంచి ఛాన్స్ ఢిల్లీ లో కూడా సిద్ధం సమావేశాలు పెట్టడానికి
వెళ్లక పోవటమే మంచిది బడ్జెట్ లో ఆంధ్రాకి సరిగ్గా ఇవ్వలేదు గతంలో 2014 to 2019 మధ్య మొదట్లో బీజేపీ ఆంధ్ర కి సహకరించింది తర్వాత జగన్ గారి తో సయోధ్య కుదుర్చుకొని బాబు గారిని ఇబ్బంది పెట్టేరు ఇప్పుడు చిరంజీవి గారితో మల్లి అదే రిపీట్ చేద్దామనుకొంటున్నారు కానీ దానికి చిరంజీవిగారు అన్ని తెలుసుకనుక అవకాశం ఇవ్వకపోవచ్చు బీజేపీ ఇక్కడ ఎదిగితే మనకు మన రాజకీయ పార్టీలకు విలువ ఇవ్వరు మొత్తం నార్త్ ఇండియా కి నిధులు వెళ్లిపోతాయి