క‌విత‌కు బెయిల్ ఎలా వచ్చిందంటే?

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.క‌విత‌కు ఎట్ట‌కేల‌కు బెయిల్ ల‌భించింది. క‌విత‌కు బెయిల్ రావ‌డం రాజ‌కీయ దుమారం రేపుతోంది. ఒక వైపు బీఆర్ఎస్ నేత‌లు సంబ‌రాలు చేసుకుంటుంటే, మ‌రోవైపు బీఆర్ఎస్‌,…

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.క‌విత‌కు ఎట్ట‌కేల‌కు బెయిల్ ల‌భించింది. క‌విత‌కు బెయిల్ రావ‌డం రాజ‌కీయ దుమారం రేపుతోంది. ఒక వైపు బీఆర్ఎస్ నేత‌లు సంబ‌రాలు చేసుకుంటుంటే, మ‌రోవైపు బీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు మాట‌లు తూటాలు పేలుస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌విత‌కు బెయిల్ ఎలా వ‌చ్చిందో టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌హేశ్‌గౌడ్ త‌న‌దైన స్టైల్‌లో చెప్పుకొచ్చారు.

మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మ‌క్కు కావ‌డం వ‌ల్లే క‌విత‌కు బెయిల్ వ‌చ్చింద‌న్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఆ రెండు పార్టీలు కుమ్మ‌క్కు అయ్యిన‌ట్టు ఆయ‌న ఆరోపించారు. బీజేపీకి బీఆర్ఎస్ దాసోహం అయ్యింద‌న్నారు. ఢిల్లీలో బీజేపీ నేత‌ల చుట్టూ కేటీఆర్‌, హ‌రీష్‌రావు ఆప‌ద‌మొక్కులు మొక్కార‌ని, అందుకే క‌విత‌కు బెయిల్ వ‌చ్చింద‌ని ఆయ‌న అన్నారు.

బీజేపీ నేత‌ల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ల‌మీద ప‌డి క‌విత‌కు బెయిల్ తెచ్చుకున్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. క‌విత‌కు బెయిల్ రావ‌డంతో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజ‌కీయాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌న్నారు. త్వ‌ర‌లో బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్ర‌క్రియ మొద‌లువుతుంద‌ని మ‌హేశ్‌గౌడ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

4 Replies to “క‌విత‌కు బెయిల్ ఎలా వచ్చిందంటే?”

  1. మరి BRS నేత ల మీద వచ్చిన ఆరోపణలు గురించి ఒక్క విషయం లోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుందా ఇంతవరకు? హైడ్రా పేరిట దందా వసూళ్లు తప్ప!

  2. పిల్ల కాంగ్రెస్ మీడియా వాళ్ళు కోన్కిస్కా గొట్టం గాళ్ళు బీజేపీ మీద మాట్లాడినా లగేత్తుకొచ్చి ఆర్టికల్ వేస్తారు

Comments are closed.