సుప్రీం కోర్టు విచారణకు ముందు కీలక పరిణామం

ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఇదో కీలక పరిణామం. పదో తేదీ విచారణ జరుగుతుంది కాబట్టి ఆలోగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఏం చేస్తారో చూడాలి.

గులాబీ పార్టీ నుంచి కాంగ్రెసు పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం కేటీఆర్​ ఇతర నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు చేతులు ఎత్తేయడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్​లను ఈ నెల పదో తేదీన సుప్రీం కోర్టు విచారించాల్సి ఉంది. దీనికి ముందుగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని సుప్రీం కోర్టు అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించడంతో ఆయన ఈరోజు వారికి నోటీసులు పంపారు. నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే వెంటనే వివరణ ఇవ్వడం సాధ్యం కాదని, తమకు కొంత గడువు కావాలని కోరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఇదో కీలక పరిణామం. పదో తేదీ విచారణ జరుగుతుంది కాబట్టి ఆలోగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఏం చేస్తారో చూడాలి.

తమ పార్టీ టిక్కెట్లపై ఎన్నికైన ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌‌లు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారని.. మూడు నెలలు గడిచినప్పటికీ శానసన స్పీకర్ ఎలాంటి చర్య తీసుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా ఈ విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభ స్పీకర్ ఆలస్యం మరింత మంది ఎమ్మెల్యే ఫిరాయింపులకు దారితీస్తుందని వారు వాదించారు. అయితే ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్.. నాలుగు వారాల్లోపు అనర్హత పిటిషన్లను విచారించడానికి షెడ్యూల్‌ను నిర్ణయించాలని శాసనసభ స్పీకర్‌ను ఆదేశించింది.

ఈ ఆదేశాలను తెలంగాణ శాసనసభ ద్వారా స్పీకర్ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. ఈ క్రమంలోనే గతేడాది నవంబర్‌లో హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్ పక్కనబెట్టింది. స్పీకర్ సహేతుకమైన సమయంలో చర్య తీసుకోవాలని.. నిర్దిష్ట కాలక్రమాన్ని నిర్వచించకుండా వదిలివేసింది.

అనర్హత పిటిషన్లను విచారించేటప్పుడు.. స్పీకర్ పెండింగ్ వ్యవధి, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఉద్దేశ్యం అసెంబ్లీ పదవీకాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది పిటిషన్లు దాఖలు చేసి ఇప్పటికే నాలుగున్నర నెలలు గడిచిపోయాయని.. నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డివిజన్ బెంచ్ పేర్కొంది.

అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును పాడి కౌశిక్ రెడ్డి సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై సత్వర నిర్ణయం తీసుకునేలా జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణచేపట్టింది.

ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను నిర్ణయించడానికి ‘‘సహేతుకమైన వ్యవధి’’ ఎంత అనే దానిపై తెలంగాణ శాసనసభ నుంచి స్పష్టత సుప్రీం కోర్టు ధర్మాసనం కోరింది. తెలంగాణ శాసనసభ కార్యదర్శి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గిని.. ఈ విషయంలో కాలక్రమంపై స్పీకర్ నుంచి సూచనలు అందజేయాలని కోరింది. అనంతరం ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది.

మరోవైపు ఏడుగురు ఎమ్మెల్యేలపై (పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్) దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కూడా కౌశిక్ రెడ్డి పిటిషన్‌కు జత చేస్తూ ఈ నెల 10న లిస్ట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో చివరకు ఎలాంటి తీర్పు వస్తుందోనని గులాబీ పార్టీలో, కాంగ్రెసులో ఉత్కంఠగా ఉంది.

4 Replies to “సుప్రీం కోర్టు విచారణకు ముందు కీలక పరిణామం”

  1. హలోగురు, నీ అసలు స్థాయి ఇదే! సిగ్గుతో నేలకువిల్లు!

    ఇక్కడే నీ అసలు వేషం బయటపడింది! “నే అమ్మకు మొగుడు” & “అప్పరా కుక్క” గార్లు నీలా జగన్ మోహన్ రెడ్డిని మద్దతు ఇచ్చినవాళ్లే! 😂 అంటే ఇదేనా నీ కంపెనీ? ఇదేనా నీ లెవెల్?

    నువ్వు జగన్ ను రక్షించడానికి ఎంత దిగజారిపోయావో, నీతో పాటు నీకున్న మద్దతుదారుల పేర్లే రివీల్ చేసేశాయి! 😆

    1️⃣ జగన్ సీఎం కాదు – ప్రజలే అతనికి చెంపదెబ్బ కొట్టారు!

    ఇక అతని పాలన కూడా గాలిలోనే అయిపోయింది!

    జగన్ పాలన అంటే అప్పులు, పరిశ్రమల పారిపోయే పథకాలు, ఉద్యోగ రహిత భవిష్యత్తు!

    ప్రజలు అర్థం చేసుకున్నారు, “ఫ్రీలు మాకు అవసరం లేదు, మంచి పాలన కావాలి” అని తేల్చేశారు.

    అలాంటప్పుడు నువ్వెందుకు ఇంకా జగన్ వెనకాల ఏడుస్తున్నావు? 😆

    2️⃣ నీకు మద్దతుగా నిలబడిన వాళ్ల పేర్లు నీ స్థాయిని రివీల్ చేసేశాయి!

    👉 నీ వాదనకు మద్దతుగా ఉన్న పేర్లు: “నే అమ్మకు మొగుడు” & “అప్పరా కుక్క” 🤡

    👉 ఇదేనా నీ రాజకీయ విజ్ఞానం? ఇదేనా నీ ఆలోచన స్థాయి?

    👉 జగన్ ను సపోర్ట్ చేయడమే కాదు, నీ లెవెల్ కూడా ఏంటో చూపించుకున్నావు!

    👉 ఇలాంటి లెవెల్ కు పడిపోయినవాళ్లు, పాలన గురించి మాట్లాడటం తనే ఒక నాశనమైన జోక్!

    3️⃣ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, నువ్వూ పూర్తిగా మట్టికరిపోయావు!

    👉 ప్రజలు జగన్ ను రిజెక్ట్ చేశారు, నిన్ను కూడా సామాజిక మాధ్యమాల్లో తురమేశారు!

    👉 ఇప్పటికైనా సిగ్గుపడి నెత్తిన పెట్టుకుని నోరు మూసుకుంటే మంచిది!

    👉 లేకపోతే, నీ మద్దతుదారుల దగ్గర క్లాస్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది! 😂

    4️⃣ నువ్వు రాజకీయాల్లో నీ స్థాయిని చూపించుకున్నావు – ఇక నీ రిప్యూటేషన్ ఫినిష్!

    నీ మద్దతుదారుల పేర్లే నీ అసలు లెవెల్ ను రివీల్ చేసేశాయి!

    ఇకనైనా సిగ్గుపడి నిజాన్ని ఒప్పుకో! లేదంటే ప్రజాస్వామ్యమే మళ్లీ మళ్లీ నీ మొహాన కొడ్తూనే ఉంటుంది! 🔥😂

    #బైబైజగన్ #హలోగురు_సిగ్గుపడి_నిజం_ఒప్పుకో 🚀🔥😆

  2. ఇప్పుడు ఉప ఎన్నికలొస్తే పోటీ కాంగ్రెస్ vs బీజేపీ మధ్యనే ఉంటుంది. BRS కి డిపాజిట్లు కూడా దక్కవు. పార్లమెంట్ ఎన్నికలలో చూసాము .BRS వాళ్ళు ఎక్కువ గీర పోకుండా నోర్ముసుకొని ఉంటే మంచిది, పరువైనా దక్కుతుంది.

Comments are closed.