అరవింద్ అత్యుత్సాహం కొంప ముంచిందా?

అలాంటి టైమ్ లో బన్నీ తండ్రి అల్లు అరవింద్ ఇలా గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అని పబ్లిక్ గా వేదిక మీద సైగలతో చెప్పడం అన్నది పుండు మీద కారం జల్లినట్లు అయింది.

అల్లు అరవింద్ అంటే ఆచి తూచి మాట్లాడతారు అని పేరు. ఓ మాట వదిలేముందు పదిసార్లు ఆలోచిస్తారు. ఓ నిర్ణయం తీసుకునే ముందు వందసార్లు ఆలోచిస్తారు. అందువల్లే ఎప్పుడూ ఎక్కడా కాంట్రావర్సీల్లో చిక్కుకోరు. పర్సనల్ ఇంటర్వూలకు దూరంగా వుంటారు. ఎవరికీ దొరకకుండా చిక్కడు.. దొరకడు అన్నట్లు సాగిపోతున్నారు. కానీ ఎందుకో కాస్త అత్యుత్సాహం వచ్చింది. తండేల్ లాంటి భారీ సినిమా చేసారు. విడుదల దగ్గరకు వచ్చింది. దాని ప్రచారంలో కాస్త ఎక్కువగా పాల్గొంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు వేదికల మీద డ్యాన్స్ కూడా చేసారు.

ఈ ఉత్సాహం కాస్త శృతి మించింది. తాను కామెంట్ చేస్తున్నది తన మేనల్లుడి సినిమా మీద అన్న సంగతి ఎందుకో మర్చిపోయారు. దిల్ రాజు సినిమా గురించి మాట్లాడుతున్నా అనేసుకున్నారు. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ లేదా డిజాస్టర్ అనే అర్థం వచ్చేలా చేతులతో చూపించారు.

అసలే సినిమా ఫ్లాప్ అని మెగా ఫ్యాన్స్ బాధపడుతున్నారు. మరోపక్కన బన్నీకి మెగా ఫ్యాన్స్ కు మధ్య పొసగడం లేదు. అలాంటి టైమ్ లో బన్నీ తండ్రి అల్లు అరవింద్ ఇలా గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అని పబ్లిక్ గా వేదిక మీద సైగలతో చెప్పడం అన్నది పుండు మీద కారం జల్లినట్లు అయింది.

ఇప్పుడు మెగా ఫ్యాన్స్ చాలా అంటే చాలా గుర్రుగా వున్నారు. కల్కి, దేవర, పుష్ప 2, గేమ్ ఛేంజర్ సినిమాలు అన్నీ ట్రోలింగ్ ను తట్టుకున్నాయి. ఎందువల్ల అంటే అటు ఇటు సమానంగా డిజిటల్ టీమ్ లు వుంటాయి. ఫ్యాన్స్ హ్యాండిల్స్ వుంటాయి. కానీ ఇక్కడ నాగ్ చైతన్య కు అంత బలమైన టీమ్ లేదు. హ్యాండిల్స్ లేవు. అందువల్ల తండేల్ కు యునానిమస్ టాక్ రాకపోతే ట్రోలింగ్ మామూలుగా వుండదు. ఇటు మెగా ఫ్యాన్స్-అటు సమంత ఫ్యాన్స్ ఇలా ఒక వైపు ట్రోలింగ్ కు రెడీగా వున్నారు.

తండేల్ సినిమా అద్భుతంగా వుంటే ఏ సమస్య లేదు. లేదంటే అరవింద్ చేసిన చిన్న తొందరపాటు చర్య సినిమాను ఇబ్బంది పెడుతుంది.

18 Replies to “అరవింద్ అత్యుత్సాహం కొంప ముంచిందా?”

  1. మేనమామ కాబట్టి సరదాగా మేన అల్లుడు అని కాస్త ఆట పట్టించాడు ఏమో!

    హిట్ సినిమా , అతను అన్నాడు కాబట్టి ఫ్లాప్ అవ్వదు కదా.

    అలాగే ఫ్లాప్ సినిమా, హిట్ అని చెప్పిన , జనాలకి నిజం తెలిసి కదా.

    1. yes Sandeep. I was mesmerized by the performance of Mohanlal in Lucifer.

      when I saw telugu version, a lot of disappointment..

      vaadi kodukki 700 crores petti go air konuchadu PRP ni ammesi..

      VJA and vizag lo film city kosam konni vandala acre lu aakraminchadu..

      valla tammullu Sare sari..package kukkalu

    2. Tondarapadake sundaravadana

      Mundara vundi musalla pandaga

      Ika daga ante aa peruke inti peru allu aravind annadi Mee mate kada ippudu uttamudu ayyadu

      Ante Mee matalu abaddalu Ani niroopitam ayyayi

      So aravind dhooram ayithe mega family ki clean chit vachinatte ika aa daga antha aravind Bunny ki vellali kada

      Anti fans opinion prakaram

    3. antha scene vundabatte chitra vichitram ga vunna kuda first cinema hit aindhi le mee babu dhi..idpu edhigaam kadha ani ela vunna starting nunchi support chesinavallani marchipovatam neechanga matladatam correct kadhu kadha..aina north lo thappa ekkada break even avaladanta ga..

  2. ఎంత కాదనుకున్నా మేనమామ, మేనల్లుడు. ఏదన్నా చిన్న స్పర్ధలు ఉంటే మెల్లగా అవే సర్దుకుంటాయి. కుటుంబాలు ప్రశాంతముగా ఉంటే చూడలేవా? అన్నీ మన కొంపలాగే ఉంటాయా? నరకటం, గోడకేసి కొట్టటం, తల్లీ, చెల్లి మీద కోర్ట్ లో కేసులు వెయ్యటం లాగా?

  3. అల్లు అరవింద్ నిఖార్సయిన వ్యక్తి గా మాట్లాడాడు.అదే మన మే”గే’ఫ్యామిలీ అయితే చంద్రబాబు బూట్లు నాకేవాళ్ళు

Comments are closed.