గేమ్ ఛేంజర్.. అన్నింటి కంటే ముందు

ఈ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ లో గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ కు రాబోతోంది.

సంక్రాంతి సినిమాల్లో ముందుగా గేమ్ ఛేంజర్ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని గతంలోనే చెప్పుకున్నాం. ఇప్పుడదే జరిగింది. గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ డేట్ బయటకొచ్చింది. ఈ శుక్రవారం (7వ తేదీ) నుంచి అమెజాన్ ప్రైమ్ లో గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ కు రాబోతోంది.

హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కింది గేమ్ ఛేంజర్ సినిమా. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాడు నిర్మాత దిల్ రాజు. కేవలం పాటల కోసమే 75 కోట్ల రూపాయలు ఖర్చుచేశారు.

కెరీర్ లో దిల్ రాజుకు ఇది 50వ చిత్రం కూడా. అలా భారీ బడ్జెట్ తో పాటు, భారీ అంచనాల మధ్య సంక్రాంతి బరిలో ముందుగా థియేటర్లలోకి వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా పెద్దగా ఆడలేదు. ఇకపై కాంబినేషన్లను నమ్ముకొని సినిమాలు తీయనని, కంటెంట్ ను నమ్ముకొని మాత్రమే సినిమాలు తీస్తానని, దిల్ రాజు ప్రకటించారంటే, గేమ్ ఛేంజర్ రిజల్ట్, దిల్ రాజు మైండ్ సెట్ ను ఎంతలా ఛేంజ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.

కియరా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ఎస్ జే సూర్య విలన్ గా చేశాడు. తమన్ సంగీతం అందించాడు. ఓటీటీలోకి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.

8 Replies to “గేమ్ ఛేంజర్.. అన్నింటి కంటే ముందు”

Comments are closed.