తనకు ఎలాంటి అమ్మాయి కావాలనుకునే అంశం గురించి మగాడు చాలా ఎక్స్ పెక్టేషన్లతో ఉంటాడు. వాస్తవానికి అమ్మాయిలే ఈ విషయంలో ఎక్కువగా కలలు కంటారనేది జనరల్ ఒపీనియన్. అబ్బాయిలు అందానికే ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తారనేది కూడా నిజమే. అయితే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత.. ఆమె తీరు నచ్చకపోతే ఆస్వాధించడానికి ఏమీ మిగలదు కూడా.
అందమైన భార్య సొసైటీలో మగాడికి స్టేటస్ సింబల్ కావొచ్చు. అయితే అందం ఒక్కటే అనునిత్య మనుగడలో ఉపయోగపడదనేది వాస్తవం. వ్యక్తిత్వం, కొన్ని విషయాల్లో అండగా నిలవడం, మరి కొన్ని విషయాల్లో సొంతంగా నిలబడగలగడం.. ఇవన్నీ మగాడు తన భార్య నుంచి ఎక్స్ పెక్ట్ చేసే విషయాలు. అయితే పెళ్లి సమయాల్లో అమ్మాయిల్లో చాలా మంది చూసేది అందమొక్కటే.
అప్పుడు అదొక్కటే చాలనిపిస్తుంది. ఆ తర్వాత మిగతావన్నీ అర్థం అవుతాయి. చాలా మంది అబ్బాయిల్లో ఉండే గొప్ప గుణం ఏమిటంటే.. తాము అందాన్ని చూసి పెళ్లి చేసుకున్నాం కాబట్టి, మిగతా విషయాల్లో కూడా ఆమెను తప్పక భరిస్తారు. ఆమె కూడా మిగతా విషయాల్లో తన బాధ్యత లేదు, తను చెప్పినట్టుగానే జరగాలన్నట్టుగా ఒక అథారిటీని చెలాయిస్తూ ఉంటుంది.
ఈ విషయాల గురించి అధ్యయనం చేసిన రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్ అమ్మాయిల్లో అబ్బాయిలు ఎక్స్ పెక్ట్ చేసే మినిమం విషయాల గురించి ఇలా చెబుతున్నారు…
తన మీద ఆధారపడాలి..
తన భార్య తన ఆలోచనలు తనతో పంచుకోవాలని చాలా మంది మగాళ్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారట ఈ తరంలో. అంతే కాదు.. ఆర్థికంగా, ఎమోషనల్ గా, ఫిజికల్ గా.. ఈ మూడు విషయాల్లోనూ పూర్తిగా తన మీదే ఆధారపడాలనేది ఈ తరం భర్తల ప్రధానమైన కోరిక అని అధ్యయనకర్తలు చెబుతున్నారు.
ఈ విషయాల్లో వేరొకరితో అనుబంధాన్ని పెట్టుకోవడం వీళ్లు సహించే విషయం కాదు. అయితే ఎమోషన్స్ విషయంలో భార్యలు.. భర్తను ఎంత వరకూ పరిగణనలోకి తీసుకుంటారనేది ప్రశ్నార్థకమే. ఈ విషయాల్లో భర్త దగ్గర కంటే తోబుట్టువులు, స్నేహితుల దగ్గరే చాలా మంది ఓపెనప్ అవుతూ ఉంటారు కూడా!
ఎమోషనల్లీ మెచ్యూర్డ్ గా ఉండాలి!
టఫ్ సిట్చ్యూషన్ లో కావొచ్చు, చిన్న చిన్న విషయాలకే కావొచ్చు.. అధికంగా ఎమోషనల్ అయిపోయే వారిని భర్తలు భరించడం కష్టం.
తన భార్య ఎమోషనల్ గా మెచ్యూర్డ్ గా ఉండాలని, అన్నింటికీ తను ఊరడించడం కష్టమనే భావనతోనే చాలా మంది మగాళ్లు ఉంటారు. ఈ విషయంలో భర్తను అర్థం చేసుకోని భార్యలను వారు చులకనగా చూస్తారు కూడా. ఇక్కడే చాలా తేడా కొడుతూ ఉంటుంది.
చదువు, తెలివితేటలు..
కొన్ని కొన్ని విషయాలను అయినా సొంతంగా డీల్ చేసే అమ్మాయిలే కాపురాన్ని సాఫీగా సాగించగలరు.
చిన్న చిన్న విషయాల గురించి కూడా కనీస అవగాహన లేకపోవడం, పెద్దగా చదువుకోకపోవడం, ప్రతి విషయంలోనూ భర్త సాయం ఉండాల్సిందే అనే వాళ్లు భర్తకు చులకనకావడమే కాదు, అలాంటి వాళ్లను మొద్దులా చూస్తూ.. కించపరచడానికి కూడా భర్త వెనుకాడకపోవచ్చు.
సోషియలైజింగ్..
తన భార్య పరాయి వాళ్లతో మాట్లాడితే.. ఏడ్చేవాళ్లో, అనుమానించే వాళ్లో కొందరు ఉంటారేమో కానీ, ఈ తరం మెజారిటీ భర్తలు మాత్రం.. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసి, నలుగురితో కలుపుగోలు తనంతో ఉండటం, కుటుంబంతో సన్నిహిత సంబంధాలు మెయింటెయిన్ చేసే తత్వం ఉంటేనే హ్యాపీగా ఉంటున్నారు.
హెల్త్ అండ్ యాంబిషన్..
ఆరోగ్యమే సంపద ఇప్పుడు. తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యతను ఇచ్చే భార్య ఇంటి ఆరోగ్యాన్నే కాపాడగలదు. కాబట్టి.. ఈ రకమైన అవగాహన, ఆసక్తి ఉన్న అతివ భర్త మనసును ఈజీగా నెగ్గుతుంది. అలాగే తమ భార్యలు జీవితంలో సాధించడానికి ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే సహకరించడానికి కూడా చాలా మంది భర్తలు సంసిద్ధంగా ఉంటారట.