విశాఖకు పరిపాలనా రాజధాని అని వైసీపీ గట్టిగానే చెబుతోంది. దీని మీద ఆ పార్టీ ధీమా స్ట్రాంగ్ గానే ఉంది. ఓ వైపు మూడు రాజధానుల అంశం మీద కోర్టులో విచారణ జరుగుతోంది.
తీర్పు రావడానికి చాలా సమయం పట్టవచ్చు. అయితే ఎల్లో మీడియా మాత్రం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనలు విరమించుకున్నారని అపుడే కధలు అల్లేస్తోంది.
అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణాలకు జగన్ సర్కార్ మూడు వేల కోట్ల నిధులను వెచ్చించేందుకు రెడీ అయింది. దాంతో ఇక విశాఖ రాజధాని గోవిందా అంటూ కొత్త ప్రచారం మొదలెట్టేశారు తమ్ముళ్ళు.
దీని మీద పక్కా క్లారిటీగా మంత్రి పేర్ని నాని అసలు విషయం చెప్పేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ రాజధాని అవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఆ విషయంలో వెనక్కి తగ్గినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అమరావతి అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నామని, మొదటి నుంచి అదే చెబుతున్నామని ఆయన వివరణ ఇచ్చారు.
మొత్తానికి విశాఖకు రాజధాని రాదు అంటూ రివర్స్ గేర్ లో జీవీఈంసీ ఎన్నికల్లో ప్రచారం చేయడం ద్వారా టీడీపీ లబ్ది పొందాలనుకుంటోందిట. దాన్ని మొదటికే మంత్రి ఖండించడంతో పచ్చ పార్టీకి నోట్లో వెలక్కాయ పడ్డట్టేగా.