మనం ఇలా చేసి వుంటే, మీరు కూడా అలా చేయాల్సిందే అని డిమాండ్ చేయవచ్చు. కానీ మీకెప్పుడూ అలా చేయాలి, చేయవచ్చు అనే ఆలోచన రాలేదు. కానీ ఇప్పుడు దానికే అడ్డం పడ్డారు. పైగా అడ్డం పడిన తరువాత కూడా అడ్డం తిరిగే డిమాండ్‌లు.
చిత్రంగా లేదూ చంద్రబాబు?
పింఛన్లు నేరుగా ఇంటి దగ్గర వుంటే ఇంటికి, పొలం దగ్గర వుంటే పొలానికి, పెళ్లి దగ్గర వుంటే అక్కడికి, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒకటో తేదీకి అందించే పనికి శ్రీకారం చుట్టింది వైఎస్ జగన్. గడచిన అయిదేళ్లుగా ఇది నిరాటంకంగా సాగుతోంది. దాని కోసం వాలంటరీ వ్యవస్థ నిర్విరామంగా కష్టపడింది. పెళ్లి మరి కొద్ది సేపట్లో పెట్టుకున్న వాలంటీర్ అమ్మాయిలు కూడా టైమ్ కు పింఛన్లు అందించారు. ఇంత అద్భుతంగా సాగిందీ కార్యక్రమం. అంతే కాదు. ఇంటికి వచ్చి వుందా? లేదా? అడిగి మరీ రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు అందించారు.
సరే, చంద్రబాబు స్వంత మనిషి లాంటి నిమ్మగడ్డ రమేష్ నాయుడు ఎన్నికల వేళ వాలంటీర్లు పింఛన్లు ఇవ్వరాదు అంటూ ఫిర్యాదు చేసారు. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. అదేంటో ఆ పిటిషన్ పడినపుడు తెలియలేదు. ఉత్తర్వులు వచ్చాక తెలిసింది.. దాని వల్ల తమ కొంప కొల్లేరు అవుతుందన్న సంగతి తెలుగుదేశం అధినేతలకు. ఎప్పుడూ ఫస్ట్ న వచ్చే పింఛను రాకపోతే, అవ్వ తాతలు.. పింఛనూ ఎందుకు రాలేదు అని అడుగుతారని, అప్పుడు చంద్రబాబు అడ్డం పడ్డారు అనే సమాధానం వస్తే, ఓట్ల డ్యామేజ్ మామూలుగా వుండదని.
ఇక అప్పుడు మొదలెట్టారు. మేము అన్ని తాళాలు వేసేసాం.. అన్ని అడ్డంకాలు క్రియేట్ చేసేసాం.. కానీ, అయినా మీరు మాత్రం ఫస్ట్ న పింఛను ఇచ్చి తీరాల్సిందే అంటూ హూంకరింపులు. పైగా కింద పడ్డా మీద పడ్డట్లు, మీ దగ్గర పింఛను డబ్బులు లేవు, వాటిని వాడేసారు. అందుకే ఇవ్వలేకపోతున్నారు అంటే ఎదురుదాడి. మరి ఆ విషయం తెలిసినపుడు సైలంట్ గా వుండొచ్చు కదా.. అప్పుడు డబ్బులు ఖర్చయిపోయి, పింఛను ఇవ్వలేక, వైకాపా నే మాట పడేది కదా? వాలంటీర్ల అంశం కెలికి తన మీదకు ఎందుకు తెచ్చుకోవడం చంద్రబాబూ!
కానీ చంద్రబాబు అదృష్టం తెలిసిందే కదా, ఆయన సామాజిక అను కుల మీడియా తోడుగా వుండనే వుంటుంది. తాము ఏ విధంగా అనుకుంటే ఆ విధంగానే వార్తలు రాసి జనాల మీద రుద్దుతుంది. అందువల్ల ఆ ప్రయత్నం మొదలైంది. కానీ ఇక్కడ గ్రహించాల్సిన వాస్తవం ఏమిటంటే, పేపర్లలో ఏం రాసారు అని కాదు, పక్కింట్లోనో, ఎదురింట్లోనో వుండే వాలంటీరు ఏం చెప్పాడు అన్నదే అవ్వ తాతలు నమ్మేది. ఎందుకంటే అయిదేళ్లుగా వాళ్లతోనే కదా అనుబంధం పెంచుకున్నది.