వంశీని అప్ప‌టి వ‌ర‌కూ అరెస్ట్ చేయొద్దు!

ఏపీ మంత్రి నారా లోకేశ్ రెడ్‌బుక్ తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రెడ్‌బుక్‌లో రాసుకున్న రాజ‌కీయ నాయ‌కులు, ఉన్న‌తాధికారుల‌పై ఏదో ర‌కంగా వేధింపులు త‌ప్ప‌వ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. Advertisement ఇప్ప‌టికే మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడు…

ఏపీ మంత్రి నారా లోకేశ్ రెడ్‌బుక్ తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రెడ్‌బుక్‌లో రాసుకున్న రాజ‌కీయ నాయ‌కులు, ఉన్న‌తాధికారుల‌పై ఏదో ర‌కంగా వేధింపులు త‌ప్ప‌వ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ఇప్ప‌టికే మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడు రాజీవ్‌ను అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్య‌వ‌హారంలో అరెస్ట్ జ‌రిగింది.

తాజాగా గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియ‌ర్ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీని అరెస్ట్ చేయాల‌ని టీడీపీ టార్గెట్‌గా పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది.

గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేయాల‌ని మంత్రి లోకేశ్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు.

అరెస్ట్ నుంచి త‌ప్పించుకోడానికి వంశీ న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి ఆయ‌న‌కు న్యాయ స్థానంలో ఊర‌ట ద‌క్కింది.

వ‌ల్ల‌భ‌నేని వంశీ ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌పై ఏపీ హైకోర్టులో బుధ‌వారం విచార‌ణ జ‌రిగింది. కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని హైకోర్టు ఆదేశిస్తూ… ఈ నెల 20వ తేదీ వ‌ర‌కూ వంశీని అరెస్ట్ చేయ‌వ‌ద్ద‌ని పేర్కొంది.

ఏపీ పోలీస్ అధికారులు హైకోర్టుకు స‌మ‌ర్పించే అఫిడ‌విట్‌లో ఏం చెబుతారు? వంశీ పాత్ర ఏంట‌ని మ‌రోసారి స్ప‌ష్టం కానుంది. దాన్ని బ‌ట్టి వంశీని అరెస్ట్ చేస్తారా? లేదా? అనేది తేల‌నుంది. ప్ర‌స్తుతం వంశీ విజ‌య‌వాడ‌లో లేరు.

14 Replies to “వంశీని అప్ప‌టి వ‌ర‌కూ అరెస్ట్ చేయొద్దు!”

  1. అరేయ్ వంశీ, టీడీపీ ఓడిపోంగానే వైసీపీ కి జంప్..టీడీపీ గెల్వం గానే అమెరికా జంప్ .ఎన్నాళ్ళు దాక్కుంటావ్ రా…ఇక నీ జీవితం ఆర్తనాదాలే రా…

  2. మొన్నటి దాకా రాజారెడ్డి రాజ్యాగం… ఇప్పుడు మాధవరెడ్డి రాజ్యాంగం….

      1. ప్యాలస్ పులకేశి కు ముందు కుమార్ g వెనుక లోకనాథం వుండి , వాడిని 3 సం గా రాత్రి పగలు తేడా లేకుండా వాయిస్తున్నార్. అందుకే ప్యాలస్ లో నుండి వాడు బయటకి రావడం లేదు అనేది నిజమే అంటావ్.

  3. Same to same… ycp ni rajareddy rajyangam annaru… ippudu veellu Red Book implement chesthunnaru… Ycp is far better ani anukuntunnary janaalu. No development, no schemes to the poor people.. only demolitions

    .arrests,, media tho bhuthulu… idhi present conditions in AP.

Comments are closed.