ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో కంచే చేను మేసిన చందంగా తయారైంది. ఎక్కడి నుంచో రాజకీయ వలస వచ్చిన వాళ్ల చేతుల్లో తిరుపతి విలవిలలాడుతోంది. వైసీపీ హయాంలో తిరుపతి నగరం నలుదిక్కులా మాస్టర్ ప్లాన్ రోడ్లు వేశారు. మరో ఐదారు దశాబ్దాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తిరుపతి నలువైపులా రోడ్ల సౌకర్యాన్ని కల్పించారు.
అయితే అనూహ్యంగా గత ఎన్నికల్లో రాజకీయ వలస వచ్చిన కొందరు… తిరుపతిని ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నారు. దీంతో మాస్టర్‌ప్లాన్ రోడ్లు వేయడానికి స్థలాలు ఇచ్చిన వారికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేయాల్సిన టీడీఆర్ బాండ్లను అడ్డు పెట్టుకుని భారీగా దోచుకునే పనిలో పడ్డారని టీడీపీ నేతలు కథలుకథలుగా చెబుతున్నారు. రెండు రోజుల క్రితం తిరుపతిలో టీడీఆర్ బాండ్లకు సంబంధించి దోపిడీపై రాసిన కథనానికి కొనసాగింపుగా మరో కథనం ఇదీ.
తిరుపతిలో నాలుగైదు ప్రాంతాల్లో 10 ఎకరాల వివాదాస్పద భూములున్నాయి. అలాంటి స్థలాల్లో హీరో హోండా షోరూమ్ వద్ద మూడు ఎకరాల్లో రంగనాథ్‌రెడ్డి వర్సెస్ కంచి రాము మధ్య వివాదం ఏర్పడింది. మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ రోడ్డు వేసింది. కంచి రాముకు మున్సిపల్ కార్పొరేషన్ టీడీఆర్ బాండ్లను మంజూరు చేయడంతో రంగనాథ్‌రెడ్డి కోర్టును ఆశ్రయించాడు. జారీ అయిన టీడీఆర్ బాండ్లను నిలుపుదల చేయించాడు.
ఇదే అదునుగా భావించిన అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుడి కుటుంబం వివాదంలో తలదూర్చింది. టీడీఆర్ బాండ్లను తాము విడుదల చేయిస్తామని, తమ వాటాగా రూ.25 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. టీడీఆర్ బాండ్లు జారీ చేసేందుకు Director country and town planning అధికారులకు కూడా భారీ మొత్తంలో చేతులు తడిపినట్టు తెలిసింది.
అయితే ఈ భూమికి సంబంధించిన వ్యవహారం కోర్టులో వుందని, టీడీఆర్ బాండ్లను బ్లాక్‌లో ఉంచాలని తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఇప్పటికే నివేదికను ఉన్నతాధికారులకు పంపారని సమాచారం. అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి మాత్రం బాండ్లు జారీ చేయించుకునేందుకు ప్రత్యేక శ్రద్ధాసక్తులు కనబరచడానికి కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తిరుపతి నగరంలోని ఎమ్మార్‌పల్లిలో ఆర్యవైశ్యులకు చెందిన సీతమ్మ ట్రస్ట్ భూములు 40 ఎకరాలకు పైన ఉన్నాయి. ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా వుండేందుకు ఆర్యవైశ్య సంఘం వారు అప్పటి కలెక్టర్‌ని సంప్రదించి, నిషేధిత జాబితా (22ఎ) లో పెట్టించారు. వైసీపీ హయాంలో అక్కడ 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు వేశారు. టీడీఆర్ బాండ్ల కోసం వచ్చిన సంఘం సభ్యులకు అప్పటి కమిషనర్ ఏం చెప్పారంటే… అంతకు ముందు మీరే నిషేధిత జాబితాలో పెట్టించుకున్నారని, దాని తొలగింపు కోసం కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నిషేధిత జాబితా నుంచి తొలగిన తర్వాత టీడీఆర్ బాండ్లను ట్రస్ట్ పేరుతో జారీ చేస్తామని గత కమిషనర్ ఆర్యవైశ్య సంఘం నాయకులకు తెలిపారు. సమస్య ఉంటేనే ఆర్థికంగా సొమ్ము చేసుకోవచ్చని భావించిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి తనదైన స్టైల్‌లో చక్రం తిప్పాలనే ప్రయత్నాలు మొదలు పెట్టారు. సమస్యను తాను పరిష్కరిస్తానని, ఇందుకు ప్రతిఫలంగా టీడీఆర్ బాండ్లలో వచ్చే సొమ్ములో రూ.50 కోట్లు తన వాటా కింద ఇవ్వాలని షరతు విధించినట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు. గతంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో పనిచేసిన కీలక అధికారి ఈ డీల్ కుదర్చడంలో చురుగ్గా పని చేసినట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు.
దశాబ్దాల కాలంగా కాటన్‌మిల్లు ప్రాంతంలోని భూములకు సంబంధించి సుబ్రమణ్యంనాయుడు వర్సెస్ వెంకటరమణారెడ్డి మధ్య వివాదం నడుస్తోంది. ఈ ప్రాంతంలో 80 అడుగులు, 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్లను వేశారు. సదరు స్థలాల్లో 3.50 ఎకరాలు మాస్టర్ ప్లాన్ రోడ్లకు పోయింది. ఈ మేరకు టీడీఆర్ బాండ్లు ఇవ్వాల్సి వుంది. ఈ మొత్తం విలువ కనీసం అంటే రూ.400 కోట్లు వుంటుంది. దీంట్లో వెంకటరమణారెడ్డికి మేలు చేకూర్చేలా ఎత్తుగడ వేసి, తన వాటాగా రూ.90 కోట్లు దక్కించుకునేందుకు సదరు వలస నేత కుటుంబం డీల్ కుదుర్చుకున్నట్టు టీడీపీ నేతలు వివరాలు చెప్పారు. అయితే ఈ బాండ్లు జారీ అయితే మున్సిపల్ కార్పొరేషన్ అనవసరంగా వివాదాల్లో ఇరుక్కుంటుందని టీడీపీ నేతలు అంటున్నారు.
తిమ్మినాయుడుపాళెంలో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయడంతో 250 నుంచి 300 ఎకరాల్లోని భూములకు రవాణా సౌకర్యం కలిగింది. ఈ ప్రాంతంలో మూడు 60 అడుగుల రోడ్లు, రెండు 80 అడుగుల రోడ్లు, అలాగే మరో 100 అడుగుల రోడ్డు పూర్తయ్యాయి. సుమారుగా 30 ఎకరాల భూమికి టీడీఆర్ బాండ్లను ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.
బహిరంగ మార్కెట్‌లో ఈ బాండ్ల విలువ వందల కోట్లు. ఇవన్నీ వ్యవసాయ భూములు కావడంతో ఈ బాండ్ల విలువ మరింత పెంచడం కోసం కమర్షియల్ అవసరాలకు బదిలీ చేసుకోకుండానే తానున్నానని, తనకు వాటా ముట్టచెబితే, బాండ్లు రిలీజ్ అవుతాయని, లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మంజూరు కావని స్థలాల యజమానులను వలస నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. అంతేకాదు, ల్యాండ్ కన్వర్షెన్ అవసరం లేకుండానే, బాండ్ల విలువను 8 రెట్లు పెంచుతానని ప్రలోభ పెడుతున్నట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు.
ఆ ప్రజాప్రతినిధి చెప్పినట్టు విని బాండ్లను జారీ చేస్తే, ఆ నాయకుడి వాటా కింద కనీసం రూ.400 కోట్లు దక్కుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. తిరుపతిలో వైసీపీ హయాంలో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయగా, అప్పట్లో నిరాధార ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడేమో వాటిని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసుకోడానికి వలస వచ్చిన నేత కుటుంబం వెంపర్లాడుతోంది. మరోవైపు కూటమిలో భాగస్వామ్య పార్టీని గెలిపించాలనే ఏకైక లక్ష్యంతో అందరూ కలిసి వలస నేత కోసం అయిష్టంగా పని చేశామని టీడీపీ నేతలు చెబుతున్నారు.
కానీ ఆ ప్రజాప్రతినిధి మాత్రం తిరుపతి అభివృద్ధిపై దృష్టి సారించకుండా, ఫ్యామిలీ ప్యాకేజీలా అందరూ కలిసి నగరంపై పడి అందిన కాడికి దోచుకోడానికే పరిమితం అయ్యారని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఈ దోపిడీ విషయమై తమ నాయకుడైన మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్తామని, అడ్డుకుంటామని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రస్తుతానికైతే దోపిడీదారుల నుంచి తిరుపతిని ఆ వేంకటేశ్వర స్వామే కాపాడాలని నగర ప్రజలు కోరుతున్నారు.
నువ్వు మరీ ఓవర్ లే బుల్రెడ్డి..
.
లెవెనోడీ నుంచి,, అధర్మ చె-డ్డీ నుంచి, అసుద్ధా చె-డ్డీ నుంచి, కరకరణాకర చె-డ్డీ నుంచి , చెవి చె-డ్డీ నుంచి తిరుమలనే కాపాడుకున్నాడు, తిరుపతిని కాపాడుకోలేడా..
నువ్వు మరీ ఓవర్ లే %#బుల్రెడ్డి..
.
లెవెనోడీ నుంచి,, అధర్మ చె-డ్డీ నుంచి, అసుద్ధా చె-డ్డీ నుంచి, కరకరణాకర చె-డ్డీ నుంచి , చెవి చె-డ్డీ నుంచి తిరుమలనే కాపాడుకున్నాడు, తిరుపతిని కాపాడుకోలేడా..
నువ్వు మరీ ఓవర్ లే %#బుల్రెడ్డి..
.
#%లెవెనోడీ నుంచి,, #%అధర్మ చె-డ్డీ నుంచి, #%అసుద్ధా చె-డ్డీ నుంచి, #%కరకరణాకర చె-డ్డీ నుంచి , #%చెవి చె-డ్డీ నుంచి తిరుమలనే కాపాడుకున్నాడు, తిరుపతిని కాపాడుకోలేడా..
నువ్వు మరీ ఓవర్ లే %#బుల్రెడ్డి..
.
#%లెవెనోడీ నుంచి,, #%అధర్మ చె-డ్డీ నుంచి, #%అసుద్ధా చె-డ్డీ నుంచి, #%కరకరణాకర చె-డ్డీ నుంచి , #%చెవి చె-డ్డీ నుంచి #%తిరుమలనే కాపాడుకున్నాడు, #%తిరుపతిని కాపాడుకోలేడా..
నువ్వు మరీ ఓవర్ లే %#బుల్రెడ్డి..
.
#%లెవెనోడీ@ నుంచి,, #%అధర్మ @చె-డ్డీ నుంచి, #%అసుద్ధా @చె-డ్డీ నుంచి, #%కరకరణాకర @చె-డ్డీ నుంచి , #%చెవి @చె-డ్డీ నుంచి #%తిరుమలనే కాపాడుకున్నాడు, #%తిరుపతిని కాపాడుకోలేడా..
అబ్బొ! దొపిడీదారులు అంట! గత 5 ఎళ్ళలొ అసాంతం దొచుకున్నది ఎవరొ?
అప్పుడు ఎమన్న రాసి ఉంటె నీ మీద కొంచం అన్నా గురి కుదురుతుంది!
How long are you going to cry on previous government to cover your mistakes. People already woke up.
Call boy works 9989793850
You expose a failure or looting they bring up a topic blaming previous government with baseless allegation and divert attention.
గోవిందుడు అందరి వాడేలే
“అలాంటి స్థలాల్లో హీరో హోండా షోరూమ్ వద్ద మూడు ఎకరాల్లో…”
ఏంటి బాబు hero హోండ నా? లేక రోజా నోట్లో మైసూర్ బొందానా? పాపం GA గారి రచనలని చూసి బుద్ధి తెచుకునైనా Hero Honda కలిసిపోతాయి.
“అలాంటి స్థలాల్లో హీరో హోండా షోరూమ్ వద్ద మూడు ఎకరాల్లో…”
ఏంటి బాబు hero హోండ నా? లేక రోజా నోxట్లో మైసూర్ బొందానా? పాపం GA గారి రచనలని చూసి బుద్ధి తెచుకునైనా Hero Honda కలిసిపోతాయి.
“అలాంటి స్థలాల్లో హీరో హోండా షోరూమ్ వద్ద మూడు ఎకరాల్లో…”
ఏంటి బాబు herox హోండ నా? లేక రోజా నోxట్లో మైసూర్ బొందానా? పాపం GA గారి రచనలని చూసి బుద్ధి తెచుకునైనా Herox Honda కలిసిపోతాయి.
The ‘SAVE’ part was already done in the last elections.
vc estanu 9380537747
vc available 9380537747
VC అంటే వంకాయ కర్రీ ఆనా.
Big Blasting News… త్వరలో మీ ముందుకు చెన్నై లీక్స్! అప్పట్లో ఒక మహిళ కోసం 13 కొట్లు పెట్టీ చెన్నై లో విల్లా కొన్న ఒక పెద్ద తలకాయ!
వైసీపీ హయాంలో తిరుపతి నగరం నలుదిక్కులా మాస్టర్ ప్లాన్ రోడ్లు వేశారు. మరో ఐదారు దశాబ్దాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తిరుపతి నలువైపులా రోడ్ల సౌకర్యాన్ని కల్పించారు. మంచిది.. ఇది బావుంది సార్.. అయితే ఈ రోడ్లు రాష్ట్రం అంతటా ఎందుకు వేయలేదు వైసీపి ప్రభుత్వం. నేను చెప్పనా.. ఎందుకంటే తిరుపతిలో రోడ్లు వేసింది శీవారి డబ్బులతో… మిగతా రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి తియ్యాలి డబ్బులు.. ఇక్కడ వెంకన్న డబ్బులు ఉన్నాయిగా వాటితో వేసే ఉంటారు.
Meru entha tesukunnaru appudu
ఈ ఆర్టికల్ వాళ్ళ గురించి రాసిందే