ఎన్నారైలకు మాత్రమే ఎందుకు సార్ ఆ సేవ!

భూ కొనుగోళ్లలో కీలకమైన ఇలాంటి సేవలను ఉచితంగా ఇచ్చేట్లయితే కేవలం ఎన్నారైలకు మాత్రమే ఎందుకు అందించాలి?

అమరావతిలో భూకొనుగోళ్లు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టదలచుకున్న ఎన్నారైలకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం అద్భుతమైన సేవలను అందుబాటులోకి తెస్తోంది. ప్రవాసాంధ్రులు అమరావతిలో ఆస్తులు కొనడానికి ముందుకొస్తే.. వారికి కొనుగోలులో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులూ ప్రభుత్వమే చేసి పెడుతుందిట.

స్థలాలను పరిశీలించడం దగ్గరినుంచి.. న్యాయసలహాలు ఏర్పాటు చేయడం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సిద్ధం చేయడం, ఆధార్ కార్డుల్లేకపోయినా ప్రత్యామ్నాయాలు చూడడం.. రిజిస్ట్రేషన్ పూర్తిచేయించడం తదితర వ్యవహారాలన్నీ కూడా వారికోసం చేసిపెట్టడానికి 24 గంటలూ పనిచేసే ఒక ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. సీఆర్డీయే ఆధ్వర్యంలోనే ఏపీ ఎన్నార్టీ సహకారంతో దీనిని నిర్వహిస్తారు.

పెట్టుబడులు పెట్టదలచుకునే వారికి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వం స్వయంగా పూనిక వహించడం మంచిదే అనుకోవచ్చు. కానీ.. ఆ సేవలు అందించడానికి ఈ ఫెసిలిటేషన్ సెంటర్ ఎంతెంత ఫీజులు వసూలు చేస్తుంది.. అనేది సందేహం.

రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల కారణంగా ఎన్నారైల నుంచి మంచి స్పందన ఉన్నదని ప్రభుత్వం భావిస్తున్నది గనుక.. ఈ ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నారు. అలాంటప్పుడు ఎన్నారైల పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఈ సేవలను ఉచితంగా అందిస్తారేమో స్పష్టత లేదు.

అయితే మరొకవైపున భూ కొనుగోళ్లలో కీలకమైన ఇలాంటి సేవలను ఉచితంగా ఇచ్చేట్లయితే కేవలం ఎన్నారైలకు మాత్రమే ఎందుకు అందించాలి? అనే ప్రశ్న కూడా ప్రజల్లో వినవస్తోంది. భారతదేశంలో ఉన్న రియల్టర్లు, అమరావతిలో భూముల కొనుగోలుపై పెట్టుబడులు పెట్టదలచుకున్న వారు ఉంటే.. వారి ఖర్మానికి వారిని వదిలేద్దాం అని చంద్రబాబునాయుడు ప్రభుత్వం అనుకుంటున్నదా?

ఎన్నారైలకు అమరావతిలో భూకొనుగోలులో ఎలాంటి సహకారం ప్రభుత్వం పరంగా అందుతుందని ప్రామిస్ చేస్తున్నారో.. అదే సహకారం అందరికీ అందిస్తే పోయేదేముంది.. అనే అభిప్రాయం పలువురిలో వినిపిస్తోంది. లేదా ఎన్నారైలు అయితే.. ‘సేఫ్ డీల్’ అనుకుంటూ ప్రభుత్వ ధ్రువీకరణకు ఎంతైనా అదనపు రుసుములు చెల్లిస్తారని, తద్వారా ఖజానాకు కొంత డబ్బు సమకూరుతుందని.. స్వదేశీ రియల్టర్లు అన్ని పనులూ తామే చేసుకోగలరు.. ఈ సేవలకు వడ్డించే రుసుములు చెల్లించడానికి ఇష్టపడకపోవచ్చు అని ప్రభుత్వం భావిస్తున్నదేమో ప్రజలకు అర్థం కావడం లేదు.

47 Replies to “ఎన్నారైలకు మాత్రమే ఎందుకు సార్ ఆ సేవ!”

  1. /// స్వదేశీ రియల్టర్లు అన్ని పనులూ తామే చేసుకోగలరు..////

    .

    ఇంతకీ నీ భాద ఎమిటి రా అయ్యా!

    NRI లు అన్ని పనులూ విదెశాల నుండె చెసుకొలెరు. కనుక విదెశి పెట్తుబడులు కొసం ఆ ప్రయత్నం చెసి ఉండవచ్చు! దీనికి కొంచం ఫీజు కూడా చార్జ్ చెస్తారు ఎమొ! అలానె స్వదేశీ రియల్టర్లు అన్ని పనులూ తామే చేసుకోగలరు అని నువ్వె చెపుతునావ్! మరి ఇంకెం నొప్పి నీకు!!

    నీ హెడ్డింగ్ చూస్తె.. నెలా నెలా napkins ఆడవారికె ఎందుకు, మగ వారికి కూడా ఇవ్వాళి అనట్టు ఉంది. మరి మేము ఎదొ ఒక వంక పెట్టాలి కదా అంటావా? సరె కాని!!

  2. ఇక్కడ వాళ్ళు అయితే మనం మళ్ళీ కులం కార్డు తీసి గుక్కపెట్టచ్చు

  3. ముందు మారవలసింది గ్రేట్ ఆంధ్ర. కామ్ వారు. ఎందుకంటే పాజిటివ్ ను నెగటివ్ గానూ నెగటివ్ ను పాజిటివ్ చూపింటం మానుకోవాలి

  4. మన రాష్ట్రాన్ని నమ్మి ఎవరు వచ్చి పెట్టుబడి పెడతానన్న రెడ్ కార్పెట్ పర్చవల్సిందే అమెరికా సిస్టమ్ మాదిరి పెట్టుబడిదారుల సంక్షేమం చూస్తేనే మనకు ఉపాధి వస్తుంది రాష్ట్రానికి ఆదాయం వస్తుంది పెట్టుబడిదారులు నేరస్తులు కాదు దొంగలు కాదు మనం పని జరగాలంటే లంచాలు ఆశిస్తే వాళ్ళు లంచాలిచ్చి అడ్డగోలు గ సంపాదించుకోవాలనుకొంటారు అందుచేత మనం కరెక్ట్ అయినా నాయకున్ని ఎన్నుకొంటే ఉభయతారకంగా ఒప్పందాలు చేసుకొని రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టిస్తారు దొంగలను ఎన్నుకొంటే వాళ్ళు లంచాలిచ్చి రాష్ట్రానికి బొక్కపెట్టి ఒప్పందాలు చేసుకొంటారు

    1. లెక్క ఎప్పుడు పెట్టావ్? ఎలెక్షన్ కమిషన్ కి చెప్పు పోయి. Sc నియోజకవర్గ కింద కట్టింది

      1. ఆంధ్రా-కర్ణాటక బ్యాచ్ కప్పలకి అవేమి తెలియవు..లెవన్అ-న్న ఏది చెప్తే ఆ కప్పలకి అదే నిజం..

  5. ఇంతకీ ప్యాలస్ పులకేశి నీ కలవడానికి పెట్టిన ఫిక్స్డ్ రేటు ఎంతో చెప్పలేదు, సొంత పార్టీ వాళ్ళకి కూడా!

  6. మన కులగుల తానా తందానా గాళ్ళు మింగిన డబ్బుని వైట్ కింద మార్చడానికి కమరావతిలో కొత్త పథకం. దీన్నే గులగజ్జిగాళ్ళకి సంపద సృష్టి అంటారు. ఎర్రు ప్రజలు ఎప్పటికి మింగించుకుంటూనేవుంటారు.

    1. అన్నకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ మూడు రాజధానులు కట్టేసి వుంటే ఈ బాధలు వుండేవి కాదు కదా

  7. కాకినాడ పొర్ట్ లాగెసుకున్నారు అంటూ మొర! మొసాలు అన్ని ఇన్నె కావు!

    eenadu.net/telugu-news/andhra-pradesh/ap-cid-to-probe-sale-of-kakinada-sea-port-stake-to-aurobindo-realty/1702/124217594

  8. కాకినాడ పోర్టు, సెజ్‌లను మా నుంచి లాక్కున్నారు – సీఐడీకి వాటి యజమాని కేవీరావు ఫిర్యాదు

    వైవీ తనయుడు విక్రాంత్‌తో మాట్లాడాలని సాయిరెడ్డి ఫోన్‌.. వాటాలు వదులుకోకుంటే జైలుకే అన్న విక్రాంత్‌

    పోర్టులో 2500 కోట్ల విలువైన మా వాటాకు 494 కోట్లు

    సెజ్‌లో రూ.1104 కోట్ల షేర్లకు గాను రూ.12 కోట్లే

    అన్యాయం గురించి చెబుతున్నా వినని నాటి సీఎం

    andhrajyothy.com/2024/andhra-pradesh/kakinada-port-and-sez-deals-cid-inquiry-launched-after-allegations-of-coercion-and-corruption-by-ysrcp-leaders-1342941.html

  9. గ్రేట్ ఆంద్ర వెనకటి రెడ్డి గారు కూడా nri నే కదా, వారికి కూడా ఈ అవకాశం వింది. ఉపయోగించు కోవచ్చు.

  10. ఓరి వెర్రి వంగళప్పం ...ఎన్ఆర్ఐ లు AP లో చాలా ఎక్కువ..
    హైదరాబాద్ లో పెట్టుబదులు పెట్టే పరిస్థితి 2014 లో లేదు తరువాత మన ప్రభుత్వ పుణ్యమా అని అక్కడ రియల్ ఎస్టేట్ పీక్స్ కి వెళ్ళింది..
    ఇప్పుడు హైడ్రా గైడ్రా అని మళ్లీ మూలపడింది..
    కొంచెం ఊపు ఇస్తే ఎన్నారై ఎదురు ఇస్తారు అదే జరుగుతోంది. మనం ఊపలేము ..ఊపు వల్లని ఒప్పనివ్వం అంటే ఎలా
  11. అమెరికా ను బ్రతికించడం కోసం తన సభ లో రెండు caste వాళ్ళు కొట్టుకున్నారు

Comments are closed.