ఇలస్ట్రేటర్ అయినవారికి వృత్తిరీత్యా అనేక కథలు చదవాల్సి వుంటుంది. అన్ని కథలూ బాగుండాలన్న రూలు లేదు కాబట్టి, చదివి చదివి కథలంటేనే విసుగుపుట్టే 'ఆక్కుపేషనల్ హజార్డ్ ' కూడా ఉంది వారికి. అలాటి పరిస్థితుల్లో ఓ మంచి కథ తారసిల్లితే వారికి ప్రాణం లేచివస్తుంది. కుంచెకు హుషారొస్తుంది. వృత్తిరీత్యా అనేక కథలు చదవడం వలన మంచికథలేవో, కానివేవో ఇలస్ట్రేటర్లు సులభంగా చెప్పగలుగుతారు. వారి ఆమోదముద్ర పడిందంటే నిస్సందేహంగా అది మంచి కథేనని చెప్పుకోవచ్చు.
చక్కటి చదువరి అయిన బాపుకి కూడా నచ్చిన కథలుండి వుంటాయి – వందల సంఖ్యలో.. ! వాటిని పాఠకులకు పుస్తకరూపంలో అందించాలన్న కోరిక కలిగిందాయనకు 1960లో. 1958 తర్వాత వెలువడిన కథలలో కొన్ని విశిష్టమైనవి ఎన్నిక చేసి, వాటిలో పదకొండు కథలను 'కథ' అనే పేరుతో ఎం. శేషాచలం అండ్ కంపెనీ (ఎమెస్కో) వారి కోసం సంకలీకరించారు 'కూర్పరి బాపు.'
===================================================================
===================================================================
చిత్రకారుడు కావడం ఒక విద్య. సంపాదకుడు కావడం మరో విద్య. కథలను ఎంపిక చేయడమే కాదు, వాటిని పుస్తకరూపంలో తెస్తూ వాటి ఇలస్ట్రేషన్స్ అన్నింటినీ ఒకే మోడల్లో, ఒకే సైజులో ఉండేట్లా మళ్లీ 'డ్రా' చేసి పాఠకులకు కనువిందు చేశారు బాపు. బాపు బొమ్మల సేకరణకర్త, వృత్తిరీత్యా వైద్యుడు, రచయిత అయిన డా|| విజయమోహన రెడ్డి (అనంతపురం)కు కృతజ్ఞతలతో అందిస్తున్న బాపు మరో పార్వ్శం – 'బాపు, ది ఎడిటర్!' ఈ బొమ్మలు 1960లలో బాపు లైన్ ఎలా వుండేదో చూపుతాయి.
===================================================================
===================================================================
===================================================================
===================================================================
(సశేషం)– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2014)