హైద్రాబాద్‌కి చెందిన వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 29 విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్‌లో గల్లంతయ్యారు. విహార యాత్రలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్ళిన విద్యార్థి బృందం, ఓ నది ఒడ్డున ఫొటోలు దిగుతుండగా, అనూహ్యంగా నదీ ప్రవాహం పెరగడంతో ఆ నదిలో విద్యార్థులు కొట్టుకుపోయారు.
బియాస్ నదిపై నిర్మించిన లర్జి డ్యామ్ దిగువ భాగంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్ పోలీసులు గల్లంతయినవారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుమనాలీకి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. లర్జి డ్యామ్ గేట్లను ఎలాంటి హెచ్చరికలూ లేకుండా డ్యామ్ అధికారులు తెరవడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.