హైదరాబాదులో రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే వుంటాయి. సభానిర్వహణే వృత్తిగా చేసుకున్న కొందరు వేరే వ్యాపకం పెట్టుకోకుండా వీటిపైనే జీవించ గలుగు తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు – రోజుకి ఎన్ని సభలు జరుగుతున్నాయో! ఏదైనా మంచి ఆడిటోరియం కావాలంటే నెలా రెండు నెలల ముందే బుక్ చేసుకోకపోతే దొరకనంత జోరుగా కార్యక్రమాలు సాగుతున్నాయి.
ఇన్ని కార్యక్రమాల ఫలితంగా మన సంస్కృతి ఏమైనా మెరుగు పడిందా? మన కళాకారుల నాణ్యత పెరిగిందా? ప్రజల్లో కళల పట్ల అవగాహన, ఆదరణ పెరిగిందా? జాతీయ స్థాయిలో మన కార్యక్రమాలకు, కళాకారులకు గుర్తింపులు, అవార్డులు వస్తున్నాయా? ఇవేమీ జరగకపోతే గత పాతికేళ్లగా యిబ్బడిముబ్బడిగా కార్యక్రమాలు జరిపి, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, అనేక పని గంటలు వృథా చేసి మనం సాధించినదేమిటి?
మన నగరంలో సభానిర్వహణా వృత్తిలో వున్న సంస్థలు వందల సంఖ్యలో వున్నాయి. కానీ వాటిలో సభ్యుల చందాలతో నడిచేవి పదుల సంఖ్యలో కూడా వుండవు. ఇతర నగరాలలో ఒక ప్రత్యేకమైన కళారూపంపై అభిరుచి, అభిమానం వున్నవారు ఒక సమూహంగా ఏర్పడి సంవత్సరానికి యింత అని చందా కట్టి సభ్యులుగా చేరతారు. ఆ సంస్థ నెలకో సారో, రెండు నెలలకో సారో దానికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సభకు జనం రారన్న భయం లేదు. సభ్యులతోనే హాలు నిండుతుంది. సభకు అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారన్న దిగులు లేదు. సంస్ధ నిధులే దానికి సరిపోతాయి. సరిపోయేట్లే వారు ప్లాన్ చేస్తారు.
చెన్నయ్‌లో దశాబ్దాలుగా ‘సంగీతసభ’ల పేరుతో యిలాటి సంస్థలు అనేకం సజావుగా నడుస్తూన్నాయి. నిధుల కోసం, జనసమీకరణ కోసం వారు కసరత్తులు చేయవలసిన పని లేదు. అందువలన కార్యక్రమంలో ఫోకస్ కళాకారుడిపై, అతని పెర్‌ఫామెన్స్‌పై వుంటుంది. మంచి కళాకారుణ్ని ఎంచుకోవడంలో, అతని చేత మంచి కార్యక్రమం రాబట్టడంలో శ్రద్ధ వహిస్తారు. ప్రోగ్రాం బాగుండకపోతే సభ్యులు నిందిస్తారు, వచ్చే ఏడాది తమ సభ్యత్వాన్ని రెన్యూ చేసుకోరు. కార్యక్రమాల నిర్వహణ బాగుంటే, తమ బంధుమిత్రులను కూడా చేర్పిస్తారు. అందుచేత క్వాలిటీ మీదే అక్కడి నిర్వాహకుల శ్రద్ధ! పోటీ పడి, మంచి కళాకారులను తెస్తారు. ఇలాటి సభ్యత్వపు సంస్థలే కాకుండా విడిగా కార్యక్రమాలు నిర్వహించి, టిక్కెట్లు అమ్మి ఖర్చులు రాబట్టే సంస్థలు కూడా చాలా ఉన్నాయి. అక్కడే కాదు, మహారాష్ట్ర, గుజరాత్, బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలలో టిక్కెట్లు కొని నాటకాలు చూసే ప్రేక్షకులున్నారు.
ఇక్కడి పరిస్థితి అలాటిది కాదు. టిక్కెట్టు పెడితే నాటకం, సంగీతసభకు వచ్చే వారు లేరు. కళాసేవా సంస్థలకు సభ్యత్వమూ, సభ్యులు లేనప్పుడు వారిని మెప్పించాలన్న తాపత్రయం కానీ, నొప్పిస్తే నష్టమనే భయం కానీ లేవు. ఎందుకంటే సభకు డబ్బు సమకూర్చేది వాళ్లు కాదు. అందువలన వారితో ఏ బంధమూ, బాధ్యతా లేదు. స్పాన్సర్లు యిచ్చే విరాళాలే నిర్వాహకుడికి ఆదాయ వనరు కాబట్టి స్పాన్సర్ల పట్లనే నిర్వాహకుడికి బాధ్యత ఉంటుంది. వారికి సముచితాసనం యిచ్చారా లేదా, ప్రాధాన్యత యిచ్చారా లేదా, ఉపన్యసించడానికి ఆయన కోరినంత సమయం యిచ్చారా లేదా అన్నదే ప్రధానమై పోతుంది. ఈ కారణాల చేత నిర్వాహకుడు అసలు కార్యక్రమం నాణ్యత కంటె కొసరు వాటిపైనే దృష్టి పెట్టవలసి వస్తుంది.
పెద్ద కళాకారుణ్ని తెప్పించే స్తోమత వుండదు. తమ ఖర్చులపై తెప్పించి, టిక్కెట్లు అమ్మి ఖర్చు రాబట్టే ధైర్యం ఎవరికీ వుండదు. అందువలన ఔత్సాహిక కళాకారుడి తోనే కార్యక్రమం చేయాలి. మరి అతణ్ని కనడానికి, వినడానికి జనాలు వస్తారన్న నమ్మకం వుండదు కదా! గ్లామరున్న సినీతారలనో, పేరున్న సాహిత్యకారులనో పిలవాలి. వారి చేత మాట్లాడించాలి. వారి చేతుల మీదుగా కళాకారుణ్ని సన్మానింప చేయాలి. అంటే పాటల కార్యక్రమమో, నృత్య కార్యక్రమమో మధ్యలో ఆపేసి, కుర్చీలు వేసి సభ పెట్టాలి. వ్యాఖ్యానాలు, రకరకాల అతిథులను పేరుపేరునా వేదికపై పిలవడాలు, పూలదండలు, అప్పటిదాకా జరిగిన కార్యక్రమం అంతా ఉత్తుత్తిదే అన్నట్లు అప్పుడే జ్యోతి ప్రజ్వలనాలు, శాలువా, సన్మానాలు, సన్మానపత్రాలు, స్పందనలు, కృతజ్ఞతలు, వందన సమర్చణలు.. యింత తతంగం జరగాలి.
వీటికి ఖర్చు అవుతుంది. కాబట్టి అది భరించే దాతలను వేదికపైకి ఆహ్వానించాలి. వాళ్లను ప్రశంసించాలి. మొత్తం ఖర్చు ఒకరే భరించలేకపోతే దాతల సంఖ్య, తద్వారా వేదికపై కుర్చీల సంఖ్య రెండు, మూడు రెట్లు పెరుగుతుంది. ఈ రకంగా చూస్తే కళాకారుడికి తన ప్రజ్ఞ చూపించే అవకాశం ఎంతసేపు దొరుకుతోంది? సాయంత్రం 6 గంటలకు ప్రారంభం అని ప్రకటించి, 6.30కు గానమో, నృత్యమో ప్రారంభిస్తే అది నడిచేది 7.15 ప్రాంతంలో ముఖ్య అతిథి వచ్చేవరకు మాత్రమే! ముఖ్య అతిథి సమక్షంలో పావుగంటైనా తన విద్య ప్రదర్శించే అవకాశం కళాకారుడికి యివ్వరు. ఎందుకంటే వచ్చిన అతిథి వెంటనే వేదిక ఎక్కడానికి తొందర పడతారు. 7.15 – 7.30 మధ్యలో ప్రారంభమైన సభ హీనపక్షం గంట నడుస్తుంది. 8.30 అయ్యేసరికి వందన సమర్ప్చణ సాగుతూండగానే ప్రేక్షకులు బయటకు నడుస్తూ వుంటారు.
సభానంతరం సాగే రెండో భాగంలో కళాకారుడు ముప్పావు ఖాళీ అయిన హాలు లోనే తన ప్రదర్శన సాగించవలసి వస్తుంది. గానం, నృత్యం ఏదైనా కానీయండి, గంట గంటన్నరపాటు నిరంతరంగా సాగితేనే కళాకారుడు పతాకస్థాయికి చేరతాడు. సభ పేరుతో మధ్యలో రసభంగం ఏర్పడితే కళాకారుడికి కాని, ప్రేక్షకుడికి గాని తృప్తి ఎక్కడుంటుంది? అందుకే గానసభలు వాక్-సభలుగా పేరుపడ్డాయి. అక్కడ వినిపించేవి త్యాగరాజ కీర్తనలు కాదు. స్పాన్సర్ రాజుల కీర్తనలు! స్పాన్సర్ చేసినవారికి దక్కే ప్రశంసల్లో పదోవంతు కూడా కళాకారుడికి దక్కవు. పోనుపోను పాటల కార్యక్రమం అనేది సభ పెట్టడానికి ఒక సాకుగా తయారైంది.
ఆ కార్యక్రమానికి కూడా సాకు కావాలిగా, అందువలన ఫలానా వారి వర్ధంతి అనో, జయంతి అనో, ఫలానా వారు కలం పట్టి పదిహేనేళ్లు అయిందనో, ఫలానా సినిమా విడుదలై 43 ఏళ్లు అయిందనో.. యేదో ఒక మిష పెట్టి వారికి సంబంధించిన పది పాటలు మీటింగుకి ముందు పెడితే చాలు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆ పాటల్లో సైతం కొత్తగా వినిపించేవి ఏవీ వుండవు. గీత రచయిత పరంగా చెప్పినా, సంగీత దర్శకుడి పరంగా చెప్పినా, దర్శకుడి పరంగా చెప్పినా, నిర్మాత పరంగా చెప్పినా, నటుల పరంగా చెప్పినా అవే పాటలు మళ్లీమళ్లీ వినిపిస్తారు. కొత్తవి వినిపించరేం? అని ప్రేక్షకులు అడగరు, అడగలేరు. ఎందుకంటే ఆ కార్యక్రమాలకు వారు టిక్కెట్టు కొనడం లేదు. ఆడిటోరియంలో ఎసి లేకపోయినా, వాహనాలకు పార్కింగ్ లేకపోయినా, టాయిలెట్ సౌకర్యాలు లేకపోయినా వారు కిమ్మనలేరు.
ప్రదర్శన అధ్వాన్నంగా వుందనైనా ఫిర్యాదు చేయబోయి, ‘‘మన తెలుగునాట టిక్కెట్టు పెట్టి నాటకాలు ఆడదామని చూస్తే ఆడటం లేదు. మీకు యింటి దగ్గర కాలక్షేపం కాకపోవడం చేత సాయంత్రాలు యిక్కడికి వచ్చి కూచుంటున్నారు. మేం ఏం చూపిస్తే అది చూడాల్సిందే.’’ అని నిర్వాహకులు అనగలరన్న భయంతో వూరుకుంటారు. ఎలాగోలా హాలు నిండడాన్ని అలుసుగా తీసుకుని యిప్పుడిప్పుడే కళారంగంలో ప్రవేశిస్తున్న వాళ్లు సైతం తమకు బిరుదులు కావాలని, ఘనసన్మానాలు జరగాలని నిర్వాహకుల వద్ద పట్టుబడుతున్నారు. ఎంతటి సూపర్ స్టారైనా ప్రేక్షకులు తన సినిమాలు చూడకపోతే రేటు తగ్గించుకో వలసినదే. ఇక్కడ ప్రేక్షకుల ఆమోద తిరస్కారాలతో పని లేదు. మంచి సాంస్కృతిక సంస్థను లేదా స్పాన్సర్‌ను ఒప్పించ గలిగామా లేదా అన్నదే గీటురాయి. ఇక వాళ్లు తమ విద్య మెరుగు పరుచుకోవాలని ఎందుకు తపిస్తారు? కళ ఎలా వృద్ధి చెందుతుంది?
గత మూడు దశాబ్దాల కాలం తీసుకోండి. ఒక పక్క సాంస్కృతిక సభానిర్వహణ అనేది పెద్ద పరిశ్రమగా భారీ ఎత్తున సాగిపోతోంది. మరో పక్క కళాకారుల నైపుణ్యం పెరగటం లేదు, కార్యక్రమాల స్థాయి పెరగడం లేదు, ప్రేక్షకులకు కళ పట్ల అవగాహన పెరగటం లేదు. మనలో మనం అవార్డులు యిచ్చుకోవడం చూసి అబ్బో కళాభివృద్ధి జరిగిందని అనుకోవద్దు. పొరుగు రాష్ట్రాలలో కానీ, జాతీయ స్థాయిలో కాని తెలుగువాళ్లు ఏ మేరకు గుర్తింపు పొందుతున్నారో చెప్పండి చూద్దాం.
దీనికంతా కారణం – యీ నిర్వాహకులు ప్రేక్షకుణ్ని పట్టించుకోకుండా తమ దృష్టి అంతా స్పాన్సర్లపైనే పెట్టడం! ప్రేక్షకులను మెప్పించనిదే హాలు నిండదు, కార్యక్రమం ఖర్చులు రాబట్టలేము అనే భయం వున్నపుడే కార్యక్రమంలో నాణ్యత పెరుగుతుంది.
ప్రేక్షకులు మెచ్చాడా లేదా అన్నదానికి కొలబద్ద టిక్కెట్లు అమ్మడం! నచ్చిన సినిమాను 70-80 రూ.లు పెట్టి టిక్కెట్టు కొనే ప్రేక్షకుడు నచ్చిన కార్యక్రమానికి పదో, ఇరవైయ్యో పెట్టి టిక్కెట్టు కొంటాడు. కొనే అలవాటు చేయాలి. తమిళనాడు రీతిలో ఆరేడు వందల మంది సభ్యుల తో సంస్థలు ఏర్పడినపుడు యిది సాధ్యమవుతుంది. ప్రస్తుతం తెలుగునాట నడిచే సంస్థల్లో నిర్వాహకులతో బాటు ముగ్గురు, నలుగురు కార్యకర్తలు తప్ప వేరెవరూ కనబడరు. దశాబ్దాలు గడిచినా ఆ వ్యక్తులే ఉంటారు. సభ్యత్వాన్ని విస్తరింప చేయాలన్న ఊహే రాదు వాళ్లకు. స్పాన్సర్ల వేట లోనే సమయమంతా ఖర్చయిపోతోంది.
నేనూ మొహమాటాలకు లొంగి అనేక కార్యక్రమాలకు ఆర్థికసహాయం చేశాను. ఆ పాపానికి నన్ను వేదిక ఎక్కిస్తారు. వద్దని చెప్పినా వినరు. ఉపన్యాసం యివ్వను అంటే యిచ్చి తీరాల్సిందే నంటారు. ఒకప్పుడు యువభారతి సమావేశాలకు వెళ్లి రెండు, మూడు గంటలు శ్రోతగా ఎంతో ఆనందించి వచ్చేవాడిని. ఈ రోజు ఆ అనందం కరువైంది. కళను ప్రోత్సహిస్తున్నానన్న భ్రమలో పడి కళావికాసానికి ద్రోహం చేస్తున్నానని అర్థమైంది.
మనకు యిన్ని కార్యక్రమాలు అవసరం లేదు. హైదరాబాదు యిక 23 జిల్లాల రాజధాని కాదు, 10 జిల్లాల రాజధాని కాబోతోంది. దానికి తగ్గట్టుగా కార్యక్రమాల జోరు తగ్గిస్తే మంచిది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగానే సాంస్కృతిక రంగంలో కూడా పునర్నిర్మాణం జరగాలి. టిక్కెట్టు కొని కార్యక్రమాన్ని వచ్చేలా ప్రేక్షకుణ్ని పురి కొల్పే కార్యక్రమాలు వుంటే చాలు. మాటకచేరీలు ఆపి పాటకచేరీయే మూడు గంటలు సాగాలి. ఒకవేళ ప్రసంగం మాత్రమే ఏర్పాటు చేస్తే ఏదైనా అంశం గురించి ప్రధాన వక్తలు ఒకరిద్దరితో ఏర్పాటు చేస్తే చాలు. మళ్లీ దానికో సభ అక్కరలేదు.
ఈ అవగాహన స్పాన్సర్లందరికీ కలిగి సభల సంఖ్య తగ్గించడానికి దోహదపడితే చాలామంచిది. కళాపోషణ చేయాలన్న కుతూహలం వున్నవారు సభ్యత్వంపై ఆధారపడి నడిచే సంస్థలను ప్రోత్సహించాలి. అభిరుచి వుండి, ఆర్థికస్తోమత లేని రసజ్ఞులను వాటిలో సభ్యులుగా చేర్పించడానికి వారి తరఫున చందా కట్టవచ్చు. ఇది జరిగితే రాబోయే పదేళ్లలో మన కార్యక్రమాల నాణ్యత పెరుగుతుందని ఆశ.
దీని రచనాకాలం — 2014 మార్చి. ‘‘సుజన రంజని’’ సంస్థ ప్రత్యేక సంచికకై రాసినది. దీని తర్వాత పరిస్థితి మెరుగుపడిందో లేదో హైదరాబాదు వాసులందరికీ తెలుసు. ఈ 11 ఏళ్ల కాలంలో ఊళ్లో ట్రాఫిక్ పెరిగింది. ఒటిటిలకు జనాలు బాగా అలవాటు పడ్డారు. ఫోన్ చేస్తే చాలు, సమస్తం యింటికే వచ్చి పడుతున్నాయి. సాధ్యమైనంతవరకు యిల్లు కదలకుండా వుండడానికే నగరవాసులు అలవాటు పడ్డారు. వారిని ఆడిటోరియంకు రప్పించాలంటే గతంలో కంటె యింకా ఎక్కువగా శ్రమించి, కార్యక్రమాల నాణ్యత పెంచాలి. ఆ కృషి జరుగుతున్నట్లు నాకు తోచటం లేదు.
– కె.ఐ. వరప్రసాద్ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్)
sollu …
nobody cares
మీరు ఉన్నత ఆలోచనలు గురించి మాట్లాడుతున్నాయి. కానీ , దానికి దోహదం చేయాల్సిన విద్యా, కళా రంగాలు లో వారికి తీరిక లేదు అని అనుమానం.
గోరటి వెంకన్న లాంటి వారు తెలంగాణ లో సొంతగా బాణి కట్టి అలవోకగా పాడే పద్యాలు , పాటలు,
ఆంద్ర లో అలాంటి కవులు పాడినట్లు ఎక్కడ వినపడేలేదు.
మాట్లాడితే దళిత వాదాన్ని అడ్డం పెట్టుకునే ఆ రూపంలో వాటికన్ మత మార్పిడీ ప్రయోగాలే.
ఆంధ్ర గురుంచి నీకేం తెలుసురా తెలంగాణ సన్నాసి
ఏది, ఒక 4 ఆంద్ర కవుల పేర్లు చెప్పు రా సన్నాసి,
ప్రకృతి గురించి, రైతుల గురించే సామాన్య ప్రజలు అర్థం చేసుకునే సరళమైన తెలుగులో కవిత్వం రాసిన వాళ్ళు ఉంటే.
ఒరే, వాటికన్ మత మార్పిడీ గొర్రె పిల్లలు పేర్లు చెప్పమాక రోయి.
ప్రతిదీ, వర్చువల్ గా , వీడియో లైవ్ లో ప్రసారం చేసే అవకాశం వున్న ఈ రోజుల్లో హాల్లో చేసే ఇలాంటి ప్రదర్శనకు గిరాకీ తగ్గుతుంది.
U want bold cal number in dp
R u intrest see dp