పోర్న్ సైట్లు మరో కాపురంలో నిప్పులు పోశాయి. వరుసగా పోర్న్ సినిమాలు చూసిన ఓ మహిళ లెస్బియన్ గా మారడంతో, ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం ఒంగోలులో చోటుచేసుకుంది. ఒంగోలులో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఏడుకొండలు. కొన్నాళ్ల కిందట సుమలతతో పరిచయం అయింది. ప్రస్తుతం ఇద్దరూ కలిసే ఉంటున్నారు. కొన్ని నెలలుగా పోర్న్ సైట్లు చూస్తున్న సుమలత, లెస్బియన్ గా మారింది. అమ్మాయిల్ని వశపరుచుకోవడం, వాళ్లతో వికృతంగా సెక్స్ చేయడం అలవాటు చేసుకుంది.
సమీపంలో ఉన్న కాలేజీకి వచ్చే ఇంటర్మీడియట్ అమ్మాయిలపై వలవేసింది సుమలత. వాళ్లకు మాయ మాటలు చెప్పడం, అవసరాలకు డబ్బులు ఇవ్వడం లాంటి పనులు చేస్తూ వశపరుచుకునేది. మాట వినని అమ్మాయిలకు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి తన కోర్కెలు తీర్చుకునేది. ఈమెకు అమ్మాయిల సెల్ నంబర్లు ఇస్తూ సహాయపడేవాడు వంశీ అనే వ్యక్తి. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారం ఓ కాలేజ్ అమ్మాయి తెగింపుతో బట్టబయలైంది.
తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించింది ఓ కాలేజ్ స్టూడెంట్. తల్లిదండ్రులతో కలిసి స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు కనిపించాయి. సుమలత అబ్బాయిగా ప్రవర్తించడం, అమ్మాయిలతో వికృతంగా సెక్స్ కోర్కెలు తీర్చుకోవడం లాంటి ఎన్నో ఘటనలు బయటకొచ్చాయి. సుమలతతో పాటు వంశీని అరెస్ట్ చేశారు.
అంతేకాకుండా.. సుమలత ఇంటి నుంచి సెక్స్ టాయ్స్, కొన్ని ప్రేమలేఖల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. సుమలత ట్రాప్ లో ఎంతమంది అమ్మాయిలు ఇరుక్కున్నారనే అంశాన్ని పోలీసులు కూపీలాగుతున్నారు. మరోవైపు ఏడుకొండలు దీన్ని అవమానంగా భావించారు. సుమలత వ్యవహారం బయటకు రావడంతో అతడు తట్టుకోలేకపోయాడు. మూడంతస్తుల ఇంటిపై నుంచి కిందకు దూకి మరణించాడు.